breaking news
IBA-employer associations
-
రూపాయిల్లో వాణిజ్యంపై బ్యాంకుల అవగాహన కార్యక్రమాలు
న్యూఢిల్లీ: రూపాయి మారకంలో సీమాంతర వాణిజ్యాన్ని నిర్వహించడానికి సంబంధించిన విధివిధానాలపై భారతీయ బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ), ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. వాణిజ్య శాఖ అధికారులు, బ్యాంకుల సీఈవోలు, ఎగుమతిదారులతో కేంద్ర ఆర్థిక శాఖ డిసెంబర్ 5న నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సమావేశంలో పాల్గొన్న ఎగుమతిదారులు లేవనెత్తిన సందేహాలకు ఆర్బీఐ ప్రతినిధి వివరణ ఇచ్చారని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకర్లు, ఎగుమతిదారులకు రూపాయి మారకంలో వాణిజ్య నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఐబీఏ, ఎఫ్ఐఈవో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కరెన్సీ మారకంపరమైన రిస్కులను సమర్ధంగా ఎదుర్కొనేలా మన కంపెనీలకు, అలాగే తమ ఖాతాల్లో ఉన్న రూపాయి నిల్వలకు సమానంగా మన దగ్గర నుంచి దిగుమతులు పెంచుకునేలా సీమాంతర భాగస్వాములను ప్రోత్సహించేందుకు దేశీ కరెన్సీలో వాణిజ్యం తోడ్పడగలదని ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ చెప్పారు. (సరికొత్త అవతార్‌లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..?) తద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం మెరుగుపడుతుందని, మరిన్ని దేశాలకు కూడా దీన్ని విస్తరిస్తే అంతర్జాతీయ స్థాయిలో భారతీయ రూపాయికి ప్రత్యేక గుర్తింపు లభించగలదని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో డాలరుకు ప్రత్యామ్నాయంగా ఇతర దేశాలతో దేశీ కరెన్సీలో వాణిజ్య లావాదేవీలు నిర్వహించుకోవడంపై భారత్ మరింతగా దృష్టి పెడుతోంది. (వర్క్ ఫ్రం హోం: వచ్చే ఏడాది దాకా వారికి కేంద్రం తీపి కబురు) -
బ్యాంకింగ్‌లో 15% వేతన పెంపు షురూ!
ఐబీఏ-ఉద్యోగ సంఘాల సంతకాలు ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులుసహా 43 బ్యాంకులకు చెందిన దాదాపు 10 లక్షల మంది ఉద్యోగుల వేతనాలు 15 శాతం పెరగనున్నాయి. ఈ మేరకు ఒక వేతన ఒప్పందంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సంతకం చేసింది. ఐబీఏ, ఉద్యోగ సంఘాల, ఆఫీసర్స్ అసోసియేషన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందం ప్రకారం, 2012 నవంబర్ 1వ తేదీ నుంచీ వర్తించే విధంగా ఈ తాజా వేతన సవరణ అమలవుతుంది. ఈ 15 శాతం వేతన పెంపు.. ఇంక్రిమెంటల్ వేతనం, అలవెన్సుల రూపంలో బ్యాంకులపై ఏడాదికి రూ.4,725 కోట్ల అదనపు భారాన్ని మోపుతుంది. పదవీ విరమణ వ్యయ భారాలను సైతం కలుపుకుంటే ఈ భారం రూ.8,370 కోట్లని ఐబీఏ చైర్మన్ టీఎం భాసిన్ సోమవారం నాడు ఇక్కడ విలేకరులకు తెలిపారు. సాధారణ ఉద్యోగులకు బకాయిలు వెంటనే చెల్లించడం జరుగుతుందని అన్నారు. అధికారుల విషయంలో ఈ శ్రేణి 4 నుంచి 6 నెలల కాలమని తెలిపారు. బ్యాంకు ఉద్యోగులకు త్వరలో రెండవ, నాల్గవ శనివారాలు సెలవు దినాలుగా ఉంటాయి. సెలవు దినాలకు సంబంధించి ఆర్బీఐ సూత్రప్రాయ ఆమోదం తెలిపిందనీ, ప్రభుత్వ తుది ఆమోదం కోసం ఇప్పటికే లేఖ రాశామన్నారు.