breaking news
Hudood victims
-
హుదూద్ బాధితుల కోసం ‘ఇంద్రధనుస్సు’
హుదూద్ బాధితుల సహాయార్థం శ్రీ సుధా ఆర్ట్స్, శ్రీ భవిరి ఆర్ట్స్ క్రియేషన్స్ ఆదివారం చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో ‘ఇంద్రధనుస్సు’ పేరిట సాంస్కృతిక కార్యక్రవూన్ని నిర్వహిస్తున్నారుు. ఉదయుం 10.00 గంటలకు ప్రారంభవుయ్యే ఈ కార్యక్రవుంలో హరికిషన్, జీవీఎన్ రాజు, భవిరి రవి మల్లెల, సుధాకర్ల మిమిక్రీ, కళాధర్ మైమ్, కె.జనార్దన్ మేజిక్ కార్యక్రమాలు ఉంటాయి. సినీ, టీవీ కళాకారులు పాల్గొనే ఈ కార్యక్రవుంలో ఫన్నీ నృత్యాలు, పసందైన హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. -
మా బతుకులు చూడన్నా..!
కట్టుకోనాకి గుడ్డ లేదు వండుకోనాకి పొయ్యిలేదు ఆకలితో ఉన్నా ఏలూ పట్టించుకోట్లేదు తమ కష్టాలను జగన్‌కు వివరించిన హుదూద్ బాధితులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ అధినేత ఆరవ రోజు పర్యటన సాక్షి,విశాఖపట్నం : ‘అన్నం తింటాం డగా గంగమ్మ వచ్చి ఆ కంచాన్ని, ఇంట్లోని సామాల్ని పట్టుకుపోనాది. పానాలు అరచేతిలో ఎట్టుకుని కట్టుబట్టల్తో పరిగెత్తేసినాం..ఇల్లు కూలిపోనాది. ఆళ్లు, ఈళ్లు వచ్చి బియ్యం ఇస్తాన్నారు. గ్యాస్ బండలు కొట్టుకుపోనాయి. నీళ్లు వచ్చేశాయి.. పిల్లా పాపలతో వీధిన పడ్డాం..తినడానికి తిండేకాదు, తాగడానికి నీరు, కట్టుకోనాకి గుడ్డ లేదు..మా బతుకులు ఇలా ఉన్నా పట్టించుకోనాకి ఏలూ రానేదు. నువ్వే వచ్చినావ్..చూడన్నా మా బతుకులు’ అంటూ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డికి తమ కష్టాలు చెప్పుకున్నారు. హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతా ల్లో ఆరవ రోజైన ఆదివారం జగన్ పర్యటన భీమునిపట్నంలో జరిగింది. జనం పడుతున్న బాధలను పేరు పేరునా అడిగితెలుసుకున్న ఆయన తా ను అండగా ఉండి, న్యాయం జరిగేలా పోరాడతానని భరోసా ఇచ్చారు. ఉదయం 10గంటలకు భీమునిపట్నం చేరుకున్న జగన్‌కు తాను మాట్లాడలేనని, శబ్దం వినలేనని (మూగ, చెవిటి) అయినా పింఛన్ రావడం లేదని వాడమదుల అప్పారావు సైగలతో తన గోడు చెప్పుకున్నాడు. సూరి బాబు అనే వృద్ధుడిని పలకరించి ‘బాగున్నావా తాతా’ అంటూ జగన్ అప్యాయంగా మాట్లాడారు. ‘జీవితంలో ఏన్నడూ ఇంతటి ప్రకృతి విపత్తును చూ డలేదు బాబూ’అని సూరిబాబు బోరుమన్నాడు. కడుపుకట్టుకుని, రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్న ఇల్లు దెబ్డతిందని, దానికి 13ఏళ్లుగా తలుపులు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్న తమను తుపాను కోలుకోలేని దెబ్బతీసిందని రాకోతులక్ష్మి కన్నీరు పెట్టుకుంది. ‘పోలియోతో కాలు పనిచేయకపోయినా పింఛన్ ఇవ్వడంలేదన్నా. ఇల్లు కూలి పోయింది. అమ్మను, నన్ను చెల్లి చిన్నమ్మలు కూలిపని చేసి పోషిస్తోంది.’ అంటూ మరో ఇంటి వద్ద అరిసివిల్లి రమణ తన దీనస్థితిని తెలి పారు. పాప కు పాలు కూడా దొరకడం లేదని బర్రి నరసాయమ్మ చెప్పింది. ఇలా ప్రతి చోటా జనం జగన్‌కు తమ ఇక్కట్లను ఏకరవుపెట్టారు. కొట్టుకువచ్చిన మరపడవలను, వలలను జగన్ పరిశీలించారు. భీమునిపట్నంలోని తోటవీధి, గడ్డవీధి, బోయవీధిలో అన్ని ఇళ్లను పరిశీ లించారు. సెయింట్ ఆన్స్ స్కూల్ గ్రౌండ్ తుపానుకు పూర్తిగా దెబ్బతిందని స్కూల్ ఉపాధ్యాయులు చూపించారు. జామ్యా మసీదుకు వెళ్లి ముస్లింలతో జగన్ మాట్లాడారు. తమ ఇళ్లకు వచ్చి కష్టాలు చూడన్నా అంటూ చిన్నబజార్ కొంకివీధికి చెందిన ప్రజలు జగన్‌ను కోరారు. రాజేంద్రనగర్, తగరపువలస వాసులు కూడా ఇదే విధంగా పట్టుబట్టారు. వారి సమస్యలను జగన్ ఓపిగ్గా విన్నారు. న్యాయం జరిగేంత వరకూ ప్రభుత్వంపై పోరాడతానని, ధైర్యంగా ఉండమని చెప్పారు. భీమునిపట్నంలో విద్యార్థులు, ఉపాధ్యాయు లు చేస్తున్న శ్రమదానం కార్యక్రమాన్ని జగన్ పరిశీలించారు. వారితో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా తాను క్షేత్రస్థాయికి వస్తేనే ప్రజలకు ఏం కావాలో తెలుస్తుందని, బాధితులను పట్టించుకోని ప్రభుత్వం తాను రావడం వల్ల పట్టించుకుంటుందనే ఆశతోనే తిరగుతున్నానని చెప్పారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై గళం విప్పడంతోపాటు క్షేత్ర స్థాయిలో బాగా వస్తున్నారని, మీ లాంటి వాళ్ల అవసరం ప్రజలకు ఉందని జగన్‌తో విజయనగరం జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన అధ్యాపకుడు ఆనందకుమార్ అన్నారు. జిల్లాలో ఆరు రోజుల పర్యటన ముగించుకుని విజయనగరం జిల్లాలో తుపాను బాధి తులను పరా మర్శించేందుకు జగన్ బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాధ్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తలు కర్రి సీతారామ్, కోలా గరువులు, చొక్కాకుల వెంకట్రావ్, వంశీకృష్ణయాదవ్, పార్టీ నేతలు అదిప్‌రాజు, కొయ్యప్రసాదరెడ్డి, కోరాడ రాజబాబు, జాన్‌వెస్లి, ప్రసాదరెడ్డి , పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. భీమునిపట్నంలో తుపాను బాధితులను పరామర్శించిన జగన్ ప్రతి ఒక్కరికీ ధైర్యం చెప్పారు. వారితో గంటల తరబడి మాట్లాడారు. వారి ఇబ్బందులను తెలుసుకుని కర్తవ్యాన్ని వివరించారు. తోటవీధి, గడ్డడవీధి, బోయవీధిలో ప్రజలతో మమేకమయ్యారు.. ఈ సమయంలో జగన్ వారితో ఏమన్నారంటే... మీరు నేను ప్రతిపక్షంలో ఉన్నాం..అయినా ఎంతో కొంత చేతనయిన సాయం చేస్తాం. ఎంత చేసినా అది తక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రతిపక్షంలో ఉన్నాం. మనకు కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రభుత్వానికి ఉండవు. ప్రజలకు నిజంగా సాయం చేయాలనే చిత్తశుద్ధి వాళ్లకు ఉంటే లక్ష కోట్ల రూపాయల బడ్డెట్ ఉంది. పార్టీ తరపున నేనూ సాయం చేస్తాను. ప్రభుత్వం నుంచి సాయం అందేలా గట్టి ప్రయత్నం చేద్దాం. మనమందరం కలిసి న్యాయం కోసం వచ్చే నెల 5వ తేదీన ధర్నాలు చేద్దాం. అంత వరకూ ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో చేయడానికి అవకాశం ఇద్దాం. గట్టిగా నిలదీయకపోతే ఏమీ చేయరు. చేద్దామంటే బయట పనిలేదు. కూరగాయలు రేట్లు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం కిలో రూపాయి బియ్యం 25 నుంచి 50 కేజీలు ఇస్తోంది. అంటే యాభై రూపాయలు ఇచ్చి చంద్రబాబు నాయుడు టీవీల ముందు కూర్చొని చాలా చేసేశామని చెబుతున్నారు. నిజానికి ఆ బియ్యం కూడా స్వచ్ఛంద సంస్థలే ఇస్తున్నాయి. ప్రభుత్వం దగ్గర మానవత్వం తగ్గిపోయి మన్నల్ని పట్టించుకోవడం లేదు. నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకోవాలి. వీధి వీధిలో చిన్న నష్టం జరిగిన వాళ్ల పేర్లు కూడా పరిహారం జాబితాలో ఉండాలి. వదర వచ్చినప్పుడు చిన్న, పెద్ద తేడా లేకుండా అందరికీ నష్టం జరుగుతుంది. మా అవస్థలు పట్టించుకోలేదు మమ్మల్ని పట్టించుకోమంటే ‘మీరు చచ్చిపోలేదుగా, చెట్లు, ఇళ్లేగా పోయాయి. మీరుపోతే వచ్చిండెవాళ్లం’ అని కౌన్సిలరు దారుణంగా మాట్లాడుతున్నాడు. మా అవస్థలు పట్టించుకునే వాళ్లే కరువయ్యారన్నా. - ఎస్కె సలీం, భీమునిపట్నం, గడ్డవీధి నువ్వే ఆదుకోవాలి ‘‘బాబూ నా పిల్లలకు తండ్రి లేడు. ఉన్న పాక కూలిపోయింది. నాన్న గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా నా కూతురు మంగ మెదడుకు ఆపరేషన్ చేయించాను. నేను పెద్దాపరేషన్, మెడకు ఆపరేషన్ చేయించుకున్నాను. ఇప్పుడు నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి.’’ - చెట్టి ఎల్లాయమ్మ, తోటవీధి, భీమునిపట్నం రేసన్కార్డు పోనాది ఇల్లు మొత్తం పడిపోనాది. బుక్కులు, రేసన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు అన్నీ కొట్టుకుపోనాయి. బియ్యం ఇవ్వాలంటే రేషన్ కార్డు సూపించమంటున్నారు. గంగలో కలిసిపోయిందాన్ని ఏడ నుంచి తేవాలా.. - వాసుపల్లి సీతమ్మ, తోటవీధి, భీమునిపట్నం -
శిథిల జీవితాలకు చేయూత
తుపాను తాకిడితో శిథిలమైన జీవితాలను చూసి చెమ్మగిల్లని కన్ను లేదు.. కరగని హృదయం లేదు. కడలిలో రేగిన కల్లోలం.. తీరాన్ని తాకిన వేళ సృష్టించిన బీభత్సంతో.. అన్నివిధాలా నష్టపోయిన ‘హుదూద్’ బాధితులకు చేయూతనిచ్చేందుకు జిల్లాలో అనేకమంది ముందుకు వస్తున్నారు. చేతనైన రీతిలో సహాయం అందిస్తున్నారు. జోలె పట్టిన న్యాయవాదులు కాకినాడ లీగల్ : కాకినాడలో న్యాయవాదులు గురువారం జోలె పట్టారు. బార్ అసోసియేషన్ తరఫున వారు ఇప్పటివరకూ రూ.1.50 లక్షల విరాళం ఇచ్చారు. మరింత సాయం సమకూర్చేందుకు నగరంలోని ప్రధాన కూడళ్లలో వ్యాపారులు, ప్రజలు, ప్రయాణికుల నుంచి రూ.30 వేల విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం కూడా కొనసాగిస్తామని కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పేపకాయల రామకృష్ణ, కంబాల శ్రీధర్ చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తుపాను బాధితులకు సహాయం అందజేయాలని సీనియర్ న్యాయవాది జవహర్ అలీ కోరారు. వారం రోజులపాటు రోజుకు లక్ష లీటర్ల మంచినీరు ఆల్కాట్‌తోట (రాజమండ్రి) : ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ ఆధ్వర్యంలో తుపాను బాధితులకు రెండో విడతగా రోజుకు లక్ష లీటర్ల చొప్పున వారం రోజుల పాటు మంచినీరు అందించనున్నారు. ఇందుకు సంబంధించిన తొలి ట్యాంకర్‌ను అసెట్ మేనేజర్ దేబశీష్ సన్యాల్ గురువారం జెండా ఊపి విశాఖకు పంపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవసరమైతే మరిన్ని రోజులు మంచినీరు సరఫరా చేయడానికి ఏర్పాటు చేశామన్నారు. మొదటి విడత రూ.8 లక్షల విలువైన 1000 ఆహార పొట్లాలు, మినరల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశామన్నారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. ప్రకాశ్‌నగర్ (రాజమండ్రి) : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేకరించిన 70 వేల వాటర్ ప్యాకెట్లు, 3 టన్నుల బియ్యం, దుస్తులను లారీలో గురువారం విశాఖపట్నం పంపించారు. ట్రస్ట్ డెరైక్టర్ ఆదిరెడ్డి వాసు, రాజమండ్రి కార్పొరేషన్లో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధరరావు, విప్ ఈతకోటి బాపన సుధారాణి, కార్పొరేటర్లు పిల్లి నిర్మల, మజ్జి నూకరత్నం, మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు, నల్లా రామాంజనేయులు, నాయకులు ఆర్వీవీ సత్యనారాయణచౌదరి, నరవ గోపాలకృష్ణ, కానుబోయిన సాగర్ తదితరులు పాల్గొన్నారు. తుపాను బాధితుల సహాయ శిబిరం ఏర్పాటు అమలాపురం : తుపాను బాధితులకు విరాళాలు సేకరించేందుకు కోనసీమ జిల్లా సాధన సమితి స్థానిక హైస్కూల్ సెంటర్లో గురువారం శిబిరం ఏర్పాటు చేసింది. దాతల నుంచి దుస్తులు, బిస్కట్లు, పాలు, పండ్లు, రొట్టెలు, విరాళాలు, పుస్తకాలు సేకరించారు. ఈ నెల 19 వరకూ శిబిరం కొనసాగుతుందని సాధన సమితి నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, న్యాయవాది యార్లగడ్డ రవీంద్ర తెలిపారు. డీసీసీబీ డెరైక్టర్ జవ్వాది బుజ్జి, కౌన్సిలర్ మట్టపర్తి రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు. 5 లారీలతో ఆహార పదార్థాల తరలింపు కోటగుమ్మం (రాజమండ్రి) : ఆహార పదార్థాలతో సిద్ధం చేసిన 5 లారీలను రాజమండ్రిలో రాష్ట్ర అడవులు, సహకార శాఖల మంత్రి బొజ్జల గోపాలకృష్ణ గురువారం జెండా ఊపి విశాఖకు పంపించారు. ఈ లారీల్లో పాల ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, పప్పులు, కూరగాయలు, వాటర్ ప్యాకెట్లు కూడా తరలించారు. తుపాను బాధితుల సహాయార్థం మంత్రికి రాజమండ్రి డివిజన్ సహకార సిబ్బంది రూ.70 వేల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కో ఆపరేటివ్ రిజిస్ట్రార్ కె.పద్మ, జిల్లా కో ఆపరేటివ్ ఆడిట్ అధికారి కె.కృష్ణశృతి పాల్గొన్నారు. తుపాను బాధితులకు చేయూత గోకవరం : తుపాను బాధితులకు వెయ్యి వాటర్ ప్యాకెట్లు, 2,500 బ్రెడ్లు, వెయ్యి బిస్కట్ ప్యాకెట్లు, 1,500 పాల ప్యాకెట్లు, 20 బస్తాల బియ్యం, 100 కేజీల కూరగాయలు పంపినట్టు కొత్తపల్లి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ప్రగళ్లపాటి సుబ్బారావు (తాతబాబు) తెలిపారు. వీటిని గురువారం వ్యాన్‌పై తరలించారు. దీనిని సంఘం గౌరవాధ్యక్షుడు ప్రగళ్లపాటి బాబులు జెండా ఊపి ప్రారంభించారు. వీటిని బాధితులకు పంచేందుకు సంఘం కార్యదర్శి పి.శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు భద్రాద్రి, కోశాధికారి సుధీర్, సంయుక్త కార్యదర్శి ప్రసాద్ తదితరులు బయలుదేరి వెళ్లారు.