ఆ జైలు జీవితం ఎంతో బాగుంటుంది!!
                  
	భోపాల్:  జైలంటే నరకం. అక్కడి తిండి తినలేం. ఒంటరి జీవితం. అయిన వాళ్లందరకీ దూరంగా ఉండాలి. చెప్పిన పనులు చేయాలి. 
	 ఇంతకంటే చేసిన తప్పుకు ఒకేసారి చంపేస్తే బాగుండని జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలు బాధపడుతుంటారు. కానీ మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ జైలు మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. ఇంటి కన్నాజైలే పదిలం  అని ఈ జైలును చూసిన వారెవరైనా అనాల్సిందే.  మొదటి సారిగా 17 ఎకరాల సువిశాల ప్రదేశంలో రూ.32 కోట్లతో 25 మంది ఖైదీలు తమ కుటుంబాలతో కలిసి ఉంటున్నారు. ఇందులో 18 మంది తమ జైలు శిక్షను పూర్తి చేసుకొని విడుదల అవుతున్నట్టు జైలు సూపరింటెండెంట్ తెలిపారు. 
	 
	జైలులోకి అడుగుపెట్టిన  నాటి నుంచి చివరి రోజు వరకు వారికి కుటుంబ వాతావరణాన్ని కల్పించడమే ఈ జైలు  ఉద్దేశం.ఇందులో ఖైదీలుగా ఉన్న శంకర్, ముఖేష్, మంగిలాల్, ధర్మేంద్ర, జితేంద్ర లు ఉదయం సాధారణ వ్యక్తులలాగానే బయటకు వెళ్లి వ్యాపారాలు చేసుకొని సాయంత్రానికి తిరిగొస్తారు. వారి పిల్లలు పాఠశాలకు వెళ్లే సౌకర్యం కూడా అధికారులు కల్పిస్తున్నారు.తమ కుంటుంబ సభ్యులతో కలిసి ఎంచక్కా డిన్నర్ చేస్తారు.
	
	చాలా మంది ఖైదీలను తమ ప్రవర్తన ద్వారా చివరి రోజుల్లో మాత్రమే ఓపెన్ జైలులో ప్రవేశం దొరుకుతుందని కానీ తనకు ముందుగానే చోటు లభిచడం అదృష్టంగా ఉందని ముకేష్ కేవత్ తెలిపాడు. ఖైదీలలో సత్రవర్తనను తీసుకొచ్చేందుకు మానవతాదృక్పథంతో ఓపెన్ జైలును నిర్మించామని  రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని జైళ్లను నిర్మించనున్నట్టు జైళ్ల శాఖ డైరెక్టర్ సుశోవన్ బెనర్జీ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఓపెన్ జైళ్లను వివిధ రాష్ట్రాలు సైతం నిర్మించనున్నాయి.