breaking news
Honeymoon destination
-
నవజంట కలల పంట..థాయ్‌లాండ్!
సాక్షి, అమరావతి : ఇంతకాలం బ్యాచిలర్స్ డెస్టినేషన్‌గా పేరొందిన థాయిలాండ్ ఇప్పుడు పెళ్లయిన కొత్త జంటలకు హానీమూన్ స్పాట్‌గా మారింది. ఇప్పటి వరకు హానీమూన్ డెస్టినీగా ఉన్న మాల్దీవుల కంటే అత్యధికంగా థాయ్‌లాండ్‌కు వెళ్లినట్టు మేక్ మై ట్రిప్ హానీమూన్–2024 నివేదిక వెల్లడించింది. గడిచిన ఏడాది కాలం(అక్టోబర్ 23 నుంచి సెప్టెంబర్–24)లో కొత్తగా పెళ్లయిన జంటలు హనీమూన్ కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లినట్టు పేర్కొంది. ఈ ఏడాదిలో థాయ్‌లాండ్ కు వెళ్లిన కొత్త జంటల్లో 5.2 శాతం వృద్ధి నమోదయితే.. అదే సమయంలో మాల్దీవుల బుకింగ్స్ 16.2 శాతం పడిపోయినట్లు పేర్కొంది. మాల్దీవుల పర్యాటక మంత్రి ఇండియన్ బీచ్‌లను కించపరుస్తూ మాట్లాడటం, ఆ తర్వాత బ్యాన్ మాల్దీవ్స్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారం జరగడమే దీనికి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. థాయ్‌లాండ్, మాల్దీవుల తర్వాత ఇండోనేషియా, మారిషస్, వియత్నాంలకు ఎక్కువ మంది జంటలు వెళుతున్నట్టు నివేదిక పేర్కొంది. ఇండియా నుంచి అత్యధికంగా వెళ్లే ఐదు దేశాల్లో ఒక్క మాల్దీవులు తప్ప మిగిలిన నాలుగు దేశాలు వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ప్రస్తుత యువత హానీమూన్ కోసం దగ్గర ప్రాంతాలనే కాకుండా ఎక్కువ రోజులు గడిపేలా సుదీర్ఘ ప్రాంతాలైన జపాన్, స్కాండినేవియా, యునైటెడ్ స్టేట్స్, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు వెళ్లేందుకు కూడా అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది జపాన్ బుకింగ్స్‌లో ఏకంగా 388 శాతం వృద్ధి నమోదైంది. కేరళను అధిగమించిన అండమాన్ ఇక దేశీయంగా చూస్తే కొత్త జంటలు అండమాన్ నికోబార్ దీవుల్లో గడపడానికి ఇష్టపడుతున్నారు. తొలిసారిగా హానీమూన్ ప్యాకేజీల్లో కేరళను అధిగమించి అండమాన్ ముందుకొచ్చినట్టు నివేదిక పేర్కొంది. అండమాన్‌లో నీలి రంగు సముద్రంతో బీచ్‌లు పరిశుభ్రంగా ఉండటంతో పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గతేడాదితో పోలిస్తే అండమాన్ బుకింగ్స్‌లో 6.9 శాతం వృద్ధి నమోదైంది. అండమాన్, కేరళ తర్వాత కశ్మీర్, గోవా, హిమాచల్ ప్రదేశ్లు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. కొత్తగా హనీమూన్ పర్యాటక ప్రాంతాలుగా ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలు ఎదుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. అస్సలు తగ్గడం లేదు.. హనీమూన్ ఖర్చు విషయంలో యువత వెనుకాడటం లేదు. హానీమూన్ ప్యాకేజీల్లో అత్యధికంగా ఫోర్స్టార్, ఫైవ్‌స్టార్ హోటల్స్‌లోనే బస చేసేందుకే ఇష్టపడుతున్నారట. గతేడాది మొత్తం జంటల్లో 68 శాతం మంది స్టార్ హోటల్స్‌లోనే బస చేయడమే కాకుండా, సగటు ఖర్చులో 13 శాతం వృద్ధి నమోదైంది. కేవలం ఒక ఊరు, ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా రెండు మూడు ప్రాంతాలు తిరగడానికి జంటలు ఎక్కువగా ఇష్టపడుతున్నాయి. అంతర్జాతీయంగా రెండు మూడు దేశాలకు వెళ్లే వారి సంఖ్య 32 శాతం నుంచి 47 శాతానికి పెరిగితే, దేశంలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ నగరాలను సందర్శించే జంటల సంఖ్య 35 శాతం నుంచి 39 శాతానికి పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. -
హనీమూన్ డెస్టినేషన్ : పడవింట్లో విహారం!
కేరళ ప్రకృతి సౌందర్యానికి నెలవు అని తెలిసిందే. ఈ సంగతిని గ్రహించిన కేరళ వాళ్లు గాడ్స్ ఓన్ కంట్రీ అనే విశేషణంతో పర్యాటకరంగాన్ని తమ వైపు తిప్పుకున్నారు. టూరిజమే ప్రధాన ఉ΄ాధి మార్గంగా ఉన్న ఉత్తరాఖండ్ వాళ్లు కూడా తమది దేవభూమి అని చెప్పుకుంటారు. ప్రకృతి వాళ్లకిచ్చిన ప్రివిలేజ్ అది. ఈ సీజన్లో కేరళలో చూడాల్సిన ప్రదేశం అలెప్పీ... అదే అళప్పుఱపడవింట్లో విహారంహౌస్బోట్ విహారం అళప్పుఱ ప్రత్యేకం. హనీమూన్ కపుల్ కోసం అందమైన హౌస్బోట్లుంటాయి. అరేబియా సముద్రంతోపాటు నదులు, చిన్న చిన్న నీటి పాయల్లో విహారం, భోజనం, రాత్రి బస కూడా హౌస్‌బోట్‌లోనే. కేరళ ఆహారం చేప లేకుండా ఉండదు. శాకాహారం కావాలంటే ముందుగా చెప్పాలి. కొబ్బరి నూనెతో వండిన వంటలు తేలిగ్గా జీర్ణమవుతాయి. కేరళలో సంతృప్తిగా భోజనం చేసినప్పటికీ మళ్లీ త్వరగా ఆకలి వేస్తుంది. జర్నీలో చిరుతిండి దగ్గరుంచుకోక తప్పదు. ఇక్కడ కొబ్బరి హల్వా, అరటి కాయ చిప్స్ రుచిగా ఉంటాయి. పర్యాటకులు కేరళలో కొబ్బరి నీటిని అమృతంలాగ తాగుతుంటే స్థానికులు మాత్రం థమ్స్ అప్, స్ప్రైట్ తాగుతుంటారు. ఇక్కడ మార్కెట్లో రకరకాల అరటిపండ్లు ఉంటాయి. తప్పకుండా రుచి చూడాలి. -
హనీమూన్‌కు అక్కడికి వెళుతున్నారు
ముంబై(మహారాష్ట్ర): భారతీయ యువజంటల్లో ఎక్కువమంది బాలి ద్వీపానికి హనీమూన్ కోసం వెళ్తున్నట్టు ఓ సర్వేలో తేలింది. ఆ తర్వాతి స్థానాల్లో మల్దీవులు, థాయ్‌లాండ్ ఉన్నాయట. పెళ్లి చేసుకోబోయే జంటలు దాదాపు ఏడాది ముందుగానే తమ హనీమూన్ టూర్‌ను ప్లాన్ చేసుకుంటున్నట్లు తమ సర్వేలో వెల్లడైందని ఈజీగోఒన్ డాట్ కామ్ సీఈవో నీలు సింగ్ తెలిపారు. ఇందులో భాగంగా కొత్త జంటలు వీసా ఆన్ అరైవల్ విధానం అమల్లో ఉన్న దేశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నాయని వెల్లడించారు. వీటిల్లో ఇండోనేసియా కూడా ఉంది. ఈ దేశంలోని ప్రముఖ బాలి దీవి బీచ్‌ల్లో గడిపేందుకు మక్కువ చూపుతున్నారని చెప్పారు. ఈ దీవికి నేరుగా విమాన సౌకర్యం ఉండటంతోపాటు అందమైన బీచ్‌లు, ప్రకృతి రమణీయత పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయన్నారు. అయితే, గ్రీస్, పారిస్, సెచెల్స్ లను కూడా కొత్త జంటలు ఇష్టపడుతున్నాయని చెప్పారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఈ ప్రాంతాల కోసం ఆన్లైన్లో వెతికే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.