breaking news
high security number plates
-
నో సెక్యూరిటీ..
సాక్షి, హైదరాబాద్: ఏళ్లకేళ్లుగా నత్తనడకన నడుస్తున్న హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ల (హెచ్ఎఎస్ఆర్పీ)లో మరోసారి కదలిక వచి్చంది. భద్రత దృష్ట్యా ప్రతి వాహనానికి హై సెక్యూరిటీ నంబర్‌ప్లేట్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలతో రవాణా శాఖ అప్రమత్తమైంది. పాత, కొత్త వాహనాలన్నింటికీ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లో పెండింగ్‌లో ఉన్న సుమారు 20 లక్షలకు పైగా వాహనాలకు ఇప్పుడు హెచ్ఎస్ఆర్పీ తప్పనిసరిగా మారింది. ఈ ఏడాది సెపె్టంబర్ నాటికి ఏర్పాటు చేసుకోవాలని రవాణాశాఖ పేర్కొనడంతో వాహనదారుల్లో గందరగోళం నెలకొంది. నత్తకు నడకలు నేర్పేలా.. సామాజిక భద్రత, వాహనాల భద్రత దృష్ట్యా 2013లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. కానీ.. నంబర్ ప్లేట్ల తయారీలో తీవ్రమైన కొరత, డిమాండ్ మేరకు సరఫరా లేకపోవడం, అప్పటి ఉద్యమ వాతావరణం తదితర పరిణామాల దృష్ట్యా నిర్లక్ష్యం కొనసాగింది. ఇంచుమించు 2017 వరకు ఆర్టీఏ కార్యాలయాల్లోనే ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి నంబర్ ప్లేట్లను బిగించారు. కానీ.. అప్పటికే లక్షలాది వాహనాలు పెండింగ్‌లో ఉండడంతో హెచ్ఎస్ఆర్పీ నిర్వహణ సవాలుగా మారింది. ఆ తర్వాత ఈ పథకాన్ని షోరూమ్‌లకు బదిలీ చేశారు. బండి కొనుగోలు సమయంలోనే హెచ్ఎస్ఆర్పీ కోసం ఫీజు చెల్లించడం తప్పనిసరి చేశారు. షోరూమ్‌లకు బదిలీ అయిన తర్వాత కొంతమేరకు బాగానే అమలైంది. కానీ.. నంబర్ ప్లేట్ సహా శాశ్వత రిజి్రస్టేషన్ ఫీజులు కూడా చెల్లించినప్పటికీ కొందరు వాహనదారులు హెచ్‌ఎస్‌ఆర్‌పీని ఏర్పాటు చేసుకోలేదు. తమకు నచి్చన పద్ధతిలో బయట తయారు చేసుకొని అమర్చుకున్నారు. ఇలాంటి వాహనాలు కనీసం 20 లక్షలకు పైగా ఉండవచ్చని అంచనా. కార్లు, లగ్జరీ వాహనాలు, హై ఎండ్ బండ్లకు ఆకర్షణీయమైన పద్ధతిలో నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకునేందుకు హెచ్‌ఎస్‌ఆర్‌పీని విస్మరించారు. సుమారు 12 లక్షల ద్విచక్ర వాహనాలు, 5 లక్షల కార్లు, సుమారు 2 లక్షల వరకు క్యాబ్‌లు, ఇతర రవాణా వాహనాలు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. నాణ్యతపై నమ్మకం లేకనే.. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లలో నాణ్యత లేకపోవడంతోనూ వాహనదారులు విముఖత చూపుతున్నారు. తెలుపు రంగు ప్లేట్లపై నంబర్లను ఎంబోసింగ్ చేసి నలుపురంగు పెయింట్ వేస్తారు. కాగా.. ఈ రంగు ఎక్కువ కాలం ఉండడం లేదు. ప్లేట్లు సైతం నాసిరకం కారణంగా త్వరగా దెబ్బ తింటున్నాయి. సొట్టలు పడుతున్నాయి. విరిగి ముక్కలవుతున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. నంబర్ ప్లేట్లు ఆకర్షణీయంగా లేకపోవడం కూడా మరో కారణం. రూ.లక్షల ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసి ఇలాంటి నాసిరకం ప్లేట్లు అమర్చుకొనేందుకు ఆసక్తి కనబర్చడంలేదు. ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటు.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రస్తుతం పాత, కొత్త వాహనాలకు హెచ్ఎస్ఆర్పీ అనివార్యమైంది. మరోవైపు హెచ్ఎస్ఆర్పీ లేని వాహనాలకు అన్ని రకాల పౌరసేవలను నిలిపివేయనున్నట్లు ఆర్టీఏ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో పాత వాహనాలకు ఏర్పాటు చేసుకొనేందుకు వాహనదారులు సయమ్ (ఎస్ఐఏఎం) వెబ్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకొనే సదుపాయం ఉంది. ఈ పోర్టల్‌లో తమ సమీపంలోని షోరూమ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. నమోదైన స్లాట్ ప్రకారం వెళ్లి నంబర్ ప్లేట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. కొత్తవాహనాలకు మాత్రం బండి రిజి్రస్టేషన్ సమయంలోనే ప్లేట్లను బిగిస్తారు. -
హైసెక్యూరిటీ కష్టాలు
►ముందే డబ్బులు చెల్లించినా 15 రోజులు ఆగాల్సిందే.. ►ప్లేటు బిగించుకునేందుకు కార్యాలయానికి రావాల్సిందే ►నంబర్ ప్లేట్‌కు డబ్బులు చెల్లించనిదే రిజిస్ట్రేషన్‌కు అనుమతి నిరాకరణ ►చోద్యం చూస్తున్న ఆర్టీసీ, రవాణా అధికారులు నెల్లూరు (రవాణా) : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా తయారైంది రవాణాశాఖలో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల జారీ పరిస్థితి. ప్రమాదాలను తగ్గించేందుకు ప్రమాణాలతో కూడిన నంబర్లు ప్లేట్లను బిగించాలన్న ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ ప్రక్రియతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రవాణా, ఆర్టీసీ శాఖలమధ్య సమన్వయలోపం కారణంగా కాంట్రాక్టరు ఆడింది ఆట పాడిందే పాటగా మారింది. దీంతో రవాణాశాఖలో వాహనదారులకు నంబరు ప్లేటు కష్టాలు వెంటాడుతున్నాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనానికి తప్పనిసరిగా గుర్తింపుపొందిన సంస్థ నుంచే నంబర్ ప్లేటు బిగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. నంబరు ప్లేట్‌కు ముందే డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న నిబంధనను రవాణాశాఖ జారీ చేసింది. దీనిని అవకాశంగా తీసుకున్న కాంట్రాక్టర్ లింకోఆటోటెక్ సంస్థ నిర్వాహకులు నంబర్ప్లేట్ల జారీలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వాహనదారునికి 4 రోజుల్లో నంబర్‌ప్లేట్ జారీ చేయాలన్న నిబంధనను మరచి 15 రోజులకుపైగా తిప్పుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఆయా రవాణాశాఖ కార్యాలయాల్లో రోజుకు 200 వాహనాలకుపైగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. వాటిలో కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోట్రాలీలు, ట్రాక్టర్ట్రాలీలు, లారీలు ఉన్నాయి. వాహనదారులు తమ ఇష్టారాజ్యంగా నంబర్లు ప్లేట్లు బిగించుకునే వీలులేకుండా అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్లేట్లను మాత్రమే బిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ పర్యవేక్షణలో నెల్లూరు జిల్లాలో హైసెక్యూరిటీ నంబర్ ప్లేటు బిగింపు కాంట్రాక్ట్‌ను లింకో ఆటోటెక్కు అప్పగించింది. జనవరి 15 నుంచి హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు బిగింపు అమలులోకి తీసుకువచ్చారు. ద్విచక్రవాహనానికి రూ.250లు, నాలుగు చక్రాల వాహనానికి రూ.619లు, లారీకి రూ.650లు, ట్రాక్టర్ టేలర్‌కు రూ.900లు లెక్కన వసూలు చేస్తున్నారు. డబ్బులు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ వాహనానికి రిజిస్ట్రేషన్ చేయించుకుందామని కార్యాలయానికి వచ్చిన వాహనదారులకు ముందుగా నంబరు ప్లేటు కోసం డబ్బులు చెల్లించి రసీదు తీసుకువస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని రవాణా అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో చేసేదేమి లేక వాహనదారులు ముందుగానే డబ్బులు చెల్లించి రసీదు తీసుకుంటున్నారు. వాస్తవంగా నిబంధనలు ప్రకారం రిజిస్ట్రేషన్‌కు, నంబరుప్లేటు వ్యవహరానికి ఎలాంటి సంబంధం పెట్టకూడదు. నిర్లక్ష్యంగా సమాధానం కాంట్రాక్టు నిబంధనలు ప్రకారం వాహనదారుడుకు 4 రోజుల్లో నంబరు ప్లేటు జారీచేయాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా హైసెక్యూరిటీ ప్లేటు జారీ 12 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. నంబరు ప్లేటు ఎందుకు ఆల స్యం చేస్తున్నారని ఎవరైన వాహనదారుడు ప్రశ్నిస్తే కాంట్రాక్టు సంస్థ సిబ్బం ది నుంచి నిర్లక్ష్యపు సమాధానం వస్తోం ది. పోనీ రవాణాశాఖ సిబ్బందిని అడిగితే నంబరు ప్లేటు వ్యవహారం తమకేమి తెలియదని సెలవిస్తున్నారు. పెపై చ్చు వాహనాన్ని రవాణా కార్యాలయానికి తీసుకువస్తేనే ప్లేటు ఇస్తామని మెలి కపెడుతున్నారు. రిజిస్ట్రేషన్, నంబరుప్లేటు బిగింపు వ్యవహారంలో రెండుసార్లు బండిని రవాణా కార్యాల యానికి తీసుకురావాల్సి వస్తుందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోని అధికారులు హైసెక్యూరిటీ నంబరు ప్లేటు వ్యవహరాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఆర్టీసీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే రవాణాశాఖ అధికారులు కూడా ఈ వ్యవహారంలో మిన్నకుండిపోతున్నారు. రిపోర్టు చేస్తున్నాం నంబరు ప్లేటు జారీ ఆలస్యం విషయం నాదృష్టికి వచ్చింది. ఈ విషయంపై విచారించి రిపోర్టు తయారు చేస్తున్నాం. ఆర్టీసీ ఆర్ఎంతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తాం. నంబరు ప్లేట్ల వ్యవహరం ఆర్టీసీ పర్యవేక్షణలో జరగాల్సి ఉంది. - ఎన్.శివరాంప్రసాద్,ఉపరవాణా కమీషనర్ -
ఎట్టకేలకు ‘హై సెక్యూరిటీ’
పరిగి: స్థానిక ఆర్టీఏ కార్యాలయంలో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించే కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి వాహనాలకు నంబర్ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. 2013 డిసెంబర్లో మొదటిసారిగా ఈ అంశం తెరపైకి వచ్చింది. ప్రతి వాహనానికీ హైసెక్యూరిటీ నంబర్లు ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాను పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసింది. జిల్లాలో మొత్తం ఆరు ఆర్టీఏ కార్యాలయాలు ఉండగా.. ఏడు నెలల క్రితం ఒక్క కూకట్పల్లి ఆర్టీఏ కార్యాలయంలో మాత్రమే ఈ ప్రక్రియ ప్రారంభించారు. మిగతా ఆరు ఆర్టీఏ కార్యాలయాల్లో ఐదు అర్బన్ జిల్లాలో ఉండగా గ్రామీణ జిల్లాలో పరిగిలో మాత్రమే ఆర్టీఏ కార్యాలయం ఉంది. ఈ ఒక్క ఆర్టీఏ కార్యాలయంలోనూ హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల ఏర్పాటు ప్రక్రియ వారంలోపు ప్రారంభిస్తామని చెప్పిన అధికారులు అప్పటినుంచీ నాన్చుతూ వచ్చారు. ఇదే సమయంలో రాష్ట్ర పునర్విభజన కూడా జరగటంతో ఈ ప్రక్రియ కాస్త అటకెక్కింది. సమస్యలన్నీ తొలగటంతో ఎట్టకేలకు శుక్రవారం నుంచి పరిగిలో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించే ప్రక్రియ ప్రారంభానికి నోచుకుంది. ఇందుకోసం పరిగి ఆర్టీఏ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి కేవ లం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలకు మాత్రమే ఈ నంబర్‌పేట్లు బిగిస్తారు. అదనపు భారం భరించాల్సిందే.. హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లకయ్యే ఖర్చును వాహనదారులే భరించాల్సి వస్తుంది. అన్ని రకాల ట్యాక్సులు కలుపుకొని రేట్లు ఇలా ఉన్నాయి. ద్విచక్రవాహనాలకు రూ.245, త్రీ వీలర్ (ఆటో తదితర వాహనాలు)కు రూ. 282, లైట్ మోటార్ వెహికల్ కార్లు తదితర వాహనాలకు రూ.619, ఇతర హెవీ ట్రాన్స్‌పోర్టు, వాణిజ్య వాహనాలకు రూ.649 చెల్లించి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను బిగించుకోవాల్సి ఉంటుంది. దీనికిగాను వాహనదారు వారం రోజులు ముందుగానే ఆర్టీఏ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికైతే కొత్తవాహనాలకే హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల ఏర్పాటు బాధ్యతను ఆర్టీఏ పర్యవేక్షిస్తున్నప్పటికీ ప్లేట్ల బిగింటం, అవి తయారు చేసే బాధ్యతను ఆర్టీసీకి అప్పగించారు. ఇప్పటి వరకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించేందుకు 150ప్రొసీడింగ్స్ సిద్ధంచేసి వారికి అందజేశాం. శుక్రవారం నుంచి ప్రక్రియ ప్రారంభమయ్యింది. పది మంది వరకు వాహనదారులు దరఖాస్తులు చేసుకున్నారు. వారి వాహనాలకు వారం రోజుల్లో నంబర్ ప్లేట్లను బిగిస్తారు. ముందుగా కొత్త వాహనాలకు మాత్రమే ఏర్పాటు చేస్తాం. పాత వాహనాల విషయంలో ఇంకా ఎలాంటి ఆదేశాలూ అందలేదు. - శ్రీనివాస్‌రెడ్డి, ఎంవీఐ, పరిగి