breaking news
haryana godman
-
స్వామీజీ అరెస్ట్‌కు పోలీసుల యత్నం, భక్తుల దాడి
-
స్వామీజీ అరెస్ట్‌కు యత్నం, పోలీసులపై కాల్పులు
చండీగఢ్ : హిస్సార్ జిల్లా బర్వాలాలోని వివాదాస్పద స్వామి రాంపాల్ సత్యలోక్ ఆశ్రమంలో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులుపై రాంపాల్ చెందిన ప్రైవేటు ఆర్మీ కాల్పులకు తెగబడింది. ఈ సందర్భంగా పోలీసులకు, భక్తులకు మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు టియర్ గ్యాస్‌తో పాటు లాఠీఛార్జ్ చేశారు. ఇటీవల కోర్టు ధిక్కార కేసులో రాంపాల్‌పై నాన్ బెయిలబుల్ వారంటు జారీ అయిన విషయం తెలిసిందే. హత్యకు కుట్ర పన్నడం, ప్రజలను రెచ్చగొట్టడం లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాంపాల్‌ను కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే మూడుసార్లు చెప్పినా కూడా ఆయన కోర్టు ముందుకు రాలేదు. దాంతో రాంపాల్‌ను అరెస్టు చేసి కోర్టుకు తీసుకురావాలని హైకోర్టు గతవారమే పోలీసులకు సూచించింది. ఆయన కోర్టుకు హాజరు కావడానికి సోమవారం చివరి తేది. అయితే కొన్ని గంటలు పోయిన తర్వాత ఆయన తరపు న్యాయవాది ఆయన హాజరు కాలేకపోయిన కారణాన్ని వివరిస్తూ కోర్టుకు తెలియచేశారు. ఈ నేపథ్యంలో రాంపాల్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రావటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు వైద్య చికిత్స నిమిత్త 63 ఏళ్ళ రాంపాల్‌ను గుర్తు తెలియని ప్రాంతంలోని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు ఆశ్రమం తరపు ప్రతినిధి తెలిపారు. -
వారంటు ఉన్నా.. కోర్టుకు రానన్న స్వామీజీ!
నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ అయినా కూడా.. పంజాబ్ హర్యానా హైకోర్టుకు హాజరయ్యేందుకు వివాదాస్పద స్వామి రాంపాల్ నిరాకరిస్తున్నారు. చండీగఢ్‌లోని హైకోర్టుకు హాజరయ్యేందుకు ఆయన ఆరోగ్యం సహకరించడంలేదని సత్లోక్ ఆశ్రమ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ఆశ్రమం హర్యానాలోని బర్వాలా పట్టణంలో ఉంది. ఆయనను ఈనెల 19వ తేదీ వరకు విశ్రాంతి తీసుకోవల్సిందిగా డాక్టర్లు చెప్పారని, కోర్టులో ఆ మెడికల్ సర్టిఫికెట్లు సమర్పిస్తామని ఆ ప్రతినిధి అన్నారు. వందలాది మంది భద్రతా సిబ్బంది ఆశ్రమం చుట్టుపక్కల మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వేలాది మంది రాంపాల్ భక్తులు కూడా అక్కడ గుమిగూడారు. హత్యకు కుట్ర పన్నడం, ప్రజలను రెచ్చగొట్టడం లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాంపాల్‌ను కోర్టు ఎదుట హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. మూడుసార్లు చెప్పినా కూడా ఆయన కోర్టు ముందుకు రాలేదు. ఆయనను అరెస్టు చేసి కోర్టుకు తీసుకురావాలని హైకోర్టు గతవారమే పోలీసులకు సూచించింది. ఆయన బంకర్లో దాక్కున్నా కూడా పొగబెట్టి బయటకు తీసుకురావాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.