breaking news
GVS Anjaneyulu
-
టీడీపీ కార్యకర్తల శిక్షణ శిబిరం ముగింపు
ముగింపు సభకు హాజరైన మూడు జిల్లాల పార్టీ అధ్యక్షులు నాయకత్వ లక్షణాలు పెంపొందించే శిక్షణ అన్న నాయకులు కందుకూరు: ఏడాదిగా స్థానిక ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న మూడు జిల్లాల టీడీపీ కార్యకర్తల శిక్షణ శిబిరం శనివారంతో ముగిసింది. దాదాపు ఏడాది కాలం పాటు 100 బ్యాచ్‌లకు బ్యాచ్‌కి 100 మంది లెక్కల నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఇచ్చారు. శనివారం 100వ బ్యాచ్ ముగింపు సందర్భంగా ముగింపు సభను స్థానిక ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల పార్టీ అధ్యక్షులు దామచర్ల జనార్ధన్, జివిఎస్ ఆంజనేయులు, బీద రవిచంద్రయాదవ్ మాట్లాడుతూ రాష్ట్రం కష్టాల్లో ఉన్నా అనేక సంక్షేమ పథకాలను అమలు చే స్తోందన్నారు. పింఛన్లు, రుణామాఫీ, పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం వంటి వివిధ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. అలాగే రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు. గతంలో కంటే ప్రస్తుతం సభ్యత్వం దాదాపు 50 లక్షల వరకు ఉందన్నారు. ఈ సందర్భంగా శిక్షణ శిబిరాన్ని నిర్వహించిన శిబిరం డైరెక్టర్ దాసరి రాజామాస్టర్, కన్వీనర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, జెడ్పీటీసీ సభ్యుడు కంచర్ల శ్రీకాంత్, కంచర్ల రామయ్య, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు, పమిడి రమేష్, బెజవాడ ప్రసాద్, కాకర్ల మల్లికార్జున, శ్యామ్సన్ తదితరులు పాల్గొన్నారు. -
బిహార్ ఎన్నికల తర్వాత తీపి కబురు
హోదాపై వైఎస్ జగన్‌కు టీడీపీ నేత లేఖ సాక్షి, హైదరాబాద్: బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి తీపి కబురు అందుతుందని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. హోదాపై రూట్‌మ్యాప్ తయారు చేయాలని ప్రధాని నీతి ఆయోగ్‌ను ఆదేశించారన్నారు.ఈ సమావేశంలో మంత్రి వెంక య్య పాల్గొని హోదాపై కసరత్తు చేశారని వివరించారు. -
ప్రతి కులానికి రూ.10 లక్షల పంపిణీ
గుంటూరు: చిలకలూరిపేటలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ఓటర్లకు డబ్బు పంపిణీ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి కులానికి రూ.10 లక్షల చొప్పున పంపిణీ చేశారని ఎన్నికల అధికారులకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. వినుకొండలో టీడీపీ అభ్యర్థి జీవీఎస్ ఆంజనేయులు యథేచ్ఛగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలపై విచ్చలవిడిగా కరపత్రాల అంటించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు.