breaking news
golden days
-
రానున్నది వైఎస్ఆర్ స్వర్ణయుగం
– ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కల్లూరు: ఏడాది పాటు కష్టపడితే వైఎస్ఆర్ స్వర్ణయుగం తథ్యమని పాణ్యం ఎమ్మెల్యే తెలిపారు. మంగళవారం స్థానిక పాతకల్లూరులోని శ్రీసాయిశ్రీనివాస గార్డెన్లో వైఎస్సార్సీపీ జిల్లా అధికారప్రతినిధి తోట వెంకటకృష్ణారెడ్డి అధ్యక్షతన పాణ్యం నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ బూత్ కమిటీ కన్వీనర్ ఆధ్వర్యంలో నవరత్నాల గురించి ప్రతి ఇంటికి తెలియజేయాలన్నారు. వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని పగడ్బందీగా చేపట్టాలన్నారు. వైఎస్ఆర్ హయాంలోని సంక్షేమ పథకాలును వివరిస్తూ, చంద్రబాబు సాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలనను ప్రజలకు వివరించాలన్నారు. అన్ని వర్గాలను ఎలా మోసం చేశారో తెలియజేయాలన్నారు. రాజన్న ఆశయసాధనకు శ్రమిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట ప్రతిఒక్కరూ నడిచేలా చైతన్యం చేయాలన్నారు. బీవై రామయ్య మాట్లాడుతూ నైతిక విలువలకు తిలోదకాలిచ్చి ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాంపులను ప్రోత్సహించడం టీడీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. అధికారంలోకి వచ్చింది ప్రజలకు సేవలందించడానికే గాని పార్టీ ప్రయోజనాలకు కాదని వైఎస్సార్ చెప్పేవాడని గుర్తు చేశారు. జిల్లా అధికార ప్రతినిధి తోట వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు చూశాయని గుర్తుచేశారు. ఓర్వకల్లు మండల నాయకుడు సంజీవరెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేసి చూపించిన ఘనత వైఎస్ఆర్కే దక్కిందన్నారు. మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్, కల్లూరు అర్బన్ కన్వీనర్ బెల్లం మహేశ్వరరెడ్డి, పాణ్యం ఎంపీపీ చిన్న సంజీవ, పాణ్యం మండల కన్వీనర్ పాలం చంద్రశేఖరరెడ్డి, గడివేముల మండల కన్వీనర్ సత్యనారాయణ రెడ్డి ప్రసంగించారు. అనంతరం బూత్ కమిటీ కన్వీనర్లకు వైఎస్ఆర్ కుటుంబం కిట్లను అందజేశారు. కార్యక్రమంలో ఓర్వకల్లు, గడివేముల, కల్లూరు అర్బన్, రూరల్, పాణ్యం మండలాల బూత్ కమిటీల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం అంతర్జాలం
రేపు ‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’పై జాతీయ సదస్సు l బొమ్మూరు సాహిత్యపీఠం, మనోజ్ఞ అకాడమీల నిర్వహణ ∙ వివిధ రాష్ట్రాల నుంచి రానున్న పరిశోధకులు, ప్రొఫెసర్లు రాజమహేంద్రవరం కల్చరల్ : ‘చిన్నతనంలో వీధి బడులలో పలకలు పట్టుకుని చదువుకున్నాం. నేడు విద్యార్థులు లాప్‌టాప్‌లతో చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే తరాలు కంప్యూటర్ పరిజ్ఞానంతో తెలుగుభాషా సాహిత్యాలను స్వర్ణయుగంలోకి తీసుకు వెళ్లాలి. ఈ లక్ష్యంతోనే ఈనెల 11న బొమ్మూరు తెలుగు సాహిత్యపీఠంలో మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడమీతో కలసి ‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’ అనే అంశంపై జాతీయస్థాయి సదస్సును నిర్వహిస్తున్నాం’ అని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్యపీఠం డీ¯ŒS ఆచార్య ఎండ్లూరి సుధాకర్ ‘సాక్షి’కి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ఉన్న ఆయన ఈ విషయంపై ‘సాక్షి’తో ప్రత్యేకం ఫోనులో మాట్లాడారు..వివరాలు ఆయన మాటల్లోనే... రాతియుగంనుంచి అంతర్జాలయుగంలోకి ప్రవేశించిన ఉజ్వలయుగంలో నేడు మనం ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అంతర్జాలం వేదికపై కలుసుకుంటున్నారు. తెలుగు సాహిత్యానికి వెయ్యేళ్ళ పైబడ్డ చరిత్ర ఉంది. అద్దంకి శాసనంనుంచి అంతర్జాల సాహిత్యం వరకు తెలుగు వాజ్ఞ్మయం వివిధ ధోరణులకు, పరిణామాలకు గురి అయింది. తెలుగు ఎంఏలో అంతర్జాలం ఒక పాఠ్యాంశంగా మారింది. కంప్యూటర్ను ధారణాయంత్రమని అంటున్నాం. మిగతా భాషల కన్నా, సాహిత్యానికి సంబంధించినంతవరకు అంతర్జాల వినియోగంలో బెంగాలీ, హిందీ, తెలుగు భాషలు ముందున్నాయి. రాబోయే తరాల కోసం ఈ సదస్సు ఒక దశను, దిశను నిర్ధారిస్తుంది. ఒక్క క్లిక్‌తో విశ్వసాహిత్యం నేటికీ అంతర్జాలం అనే పదం చాలామందికి పరిచయం లేదు. ఇంటర్నెట్ అంటేనే వారికి తెలుస్తుంది’ అన్నారు జాతీయ సదస్సులో భాగస్వామి అయిన మనోజ్ఞ సాంస్కృతిక అకాడమీ వ్యవస్థాపకురాలు డాక్టర్ పుట్ల హేమలత. 11న జరిగే సదస్సులో మాత్రమే కాదు, నిజజీవితంలో కూడా ఎండ్లూరి సుధాకర్, పుట్ల హేమలతలు భాగస్వాములే. 11వ తేదీన జరగనున్న జాతీయ సదస్సుగురించి పుట్ల హేమలత విశ్లేషణ.. ‘అంతర్జాలం ద్వారా అద్భుతమైన సాహిత్యానికి దగ్గర కావచ్చునని నేటి యువత తెలుసుకోవాలి. గతంలో ఒక పుస్తకం కావలసి వస్తే వెతుకులాట తప్పేది కాదు. నేడు ఒక క్లిక్‌తో ఏ దేశసాహిత్యమైనా చదువుకునే సౌలభ్యం ఏర్పడింది. మన భాషను ఇతర భాషలలోకి తీసుకువెళ్ళడానికి అంతర్జాలం ఉపయోగపడుతోంది. విద్యార్థులు ఫేస్ బుక్‌లకు, ఛాటింగులకు పరిమితం కారాదు. పద్యరచనకు ఛందోనియమాలను తెలిపే సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చింది. మీరు తప్పురాస్తే అది చూపుతుంది. పుస్తకాలు చదువుకోవడంలో ఉన్న సౌలభ్యం అంతర్జాలాన్ని ఉపయోగించడంలో లేదని అంటున్నారు. కానీ, జనరేష¯ŒS గ్యాప్‌ను మనం అర్థం చేసుకోవాలి. నేటి యువతరం ఉద్యోగం చేస్తూ, విరామసమయాల్లో సోషల్ సైట్లలోకి వెళ్ళి సాహిత్య చర్చల్లో పాల్గొంటున్నారు. మొదటఆసక్తి చూపని నిన్నటి తరం కూడా నేడు ఆసక్తి చూపుతోంది. ఇది మంచి పరిణామమే.. సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు అంతర్జాలంలో తెలుగు టైపింగ్‌కు యూనికోడ్ మాత్రమే ఉపయోగపడుతోంది. అందులో కొన్ని అక్షరాలకోసం చాలా కష్టపడవలసి వస్తోంది. ఉదాహరణకు ‘ఠ’. ఇటీవల ప్రభుత్వం 18 రకా ల ఫాంట్లను విడుదల చే యడంతో పరిస్థితి కాస్తమెరుగయింది. అయిదు అంశాలపై సదస్సులు ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, బెనారస్ హిందు విశ్వవిద్యాలయంనుంచి సుమారు 150 మంది పరిశోధకులు, ప్రొఫెసర్లు సదస్సులో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు జరిగే ప్రారంభ సదస్సుకు డీ¯ŒS ఆచార్య ఎండ్లూరి సుధాకర్ అధ్యక్షత వహిస్తారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఎస్వీ సత్యనారాయణ, విజయనగరం ఆంధ్రవిశ్వవిద్యాలయ ప్రాంగణం ప్రత్యేక అధికారి ఆచార్య జి.యోహా¯ŒSబాబు తదితరులు పాల్గొంటారు. 11 గంటలకు ‘తెలుగు భాష–సాంకేతిక పరిజ్ఞానం–ఆవశ్యకత’ అనే అంశంపై సదస్సుకు హైదరాబాద్ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహిస్తారు. బెంగళూరుకు చెందిన కవి, డిజిటల్ ప్లానెట్ ఎం.డి. డాక్టర్ ఇక్బాల్ చంద్ ‘డయస్పోరా సాహిత్యం–వెబ్సైట్లు–బ్లాగులు’ అనే అంశంపై జరిగే సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. భోజన విరామానంతరం ‘విహం గ’ అంతర్జాల మహిళాపత్రిక వార్షికోత్సవం జరుగు తుంది. అనంతరం ‘సోషల్ నెట్ వర్కింగ్‌సైట్లు–సాహిత్య చర్చలు’ అనే అంశంపై మూడో సదస్సు, ‘అంతర్జాలంలో తెలుగు పత్రికల కృషి’ అనే అంశంపై నాలుగో సదస్సు, ‘అంతర్జాలంలో బాల సాహిత్యం’ అనే అంశంపై అయిదో సదస్సు జరుగుతాయి. సమాపనోత్సవంలో ఆచార్య కాత్యాయనీ విద్మహే, కొలకలూరి ఆశాజ్యోతి, ఇతర ప్రముఖులు పాల్గొంటారు.