breaking news
gold bag lost
-
పోయిన బంగారం తిరిగివస్తే.. ఉద్యోగి నిజాయితీకి కాళ్లు మొక్కిన దంపతులు
సాక్షి, బెంగళూరు: తనకు దొరికిన నగల బ్యాగ్‌ను సొంతదారుకు అప్పగించి ఓ కోర్టు ఉద్యోగి నిజాయితీ చాటాడు. శివమొగ్గ వినోబా నగరానికి చెందిన అర్పిత చింతామణిలో బంధువుల ఇంటిలో పెళ్లికి వెళ్తూ ఈక్రమంలో శివమొగ్గ రైల్వే స్టేషన్లో బ్యాగ్‌ను పోగొట్టుకుంది. పనిపై శివమొగ్గకు వెళ్లిన తుమకూరు కోర్టు ఫస్ట్‌క్లాస్ అసిస్టెంట్ గురురాజ్‌కు ఆ బ్యాగ్ దొరికింది. అంతలోనే రైలు రావడంతో బ్యాగ్‌తో తుమకూరు చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నగల బ్యాగును అందజేస్తున్న గురురాజ్ అర్పితా కూడా బ్యాగ్ మిస్ అయినట్లు శివమొగ్గ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. బ్యాగ్ దొరికిందని తెలియడంతో అర్పితా కుటుంబం తుమకూరు తాలూకా వక్కోడికి రాగా గురురాజ్ దంపతులు నగల బ్యాగ్ అందజేశారు. అర్పితా కుటుంబ సభ్యులు గురురాజ్ దంపతుల కాళ్లకు నమస్కరించి బ్యాగును స్వీకరించారు. -
పోయిన నగలు ‘భలే’గా దొరికాయి.. సుందరి ప్రాణం లేచొచ్చింది
అరుదైన ఘటనలు అంటారు కదా! ఆ జాబితాలో ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన కచ్చితంగా ఉంటుంది. బంగారం తాకట్టు పెట్టి బాకీలు తీర్చాలనుకున్న ఓ తల్లికి.. ఊహించని కష్టం వచ్చిపడింది. ఆమె మంచి మనసే.. ఆమెతో కన్నీళ్లు పెట్టించింది. చివరకు పోలీసుల ప్రయత్నంతో కథ సుఖాంతం కావడమే కాదు.. పోయిన ఆమె పది తులాల బంగారం ఓ డ్రైనేజీలో ‘భద్రం’గా దొరికింది కూడా. ఆమె అదృష్టం చేజారిపోలేదని నిరూపించిన ఘటన.. మహారాష్ట్ర ముంబై ఆరే కాలనీలో జరిగింది. స్థానిక నివాసి అయిన 45 ఏళ్ల సుందరి ప్లనిబెల్.. గోరేగావ్ గోకుల్ ధామ్ కాలనీలోని ఇళ్లలో పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. తనకున్న పది తులాల బంగారు నగలను.. బ్యాంకులో డిపాజిట్ చేసి అప్పులు తీర్చాలని అనుకుందామె. జూన్ 13వ తేదీన పని ముగించుకుని బ్యాంకుకు వెళ్తున్న టైంలో.. ఓ ఇంటి ఓనర్ మిగిలిపోయిన కడక్ పావ్‌ను సుందరికి ఇచ్చింది. అయితే సుందరి బ్యాంకుకు వెళ్తున్న మార్గంలో.. ఓ తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని కనిపించింది. బిడ్డ ఆకలితో ఉందేమో అనుకుని తన దగ్గరున్న కడక్పావ్ సంచిని ఆ తల్లికి ఇచ్చేసిందామె. తీరా బ్యాంకుకు వెళ్లి చూడగా, తన వద్ద ఉండాల్సిన నగలు కనిపించలేదు. రోడ్డు మీద కనిపించిన ఆ తల్లికి ఇచ్చిన సంచిలోనే నగలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చింది. పరుగున వెళ్లి ఆ తల్లీబిడ్డల కోసం చూసింది. కానీ, వాళ్లు కనిపించలేదు. ఆలస్యం చేయకుండా.. దిన్దోషి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిందంతా చెప్పి విలపించింది సుందరి. ఆ నగలు లేకపోతే అప్పులు తీర్చలేనని, తనకు చావే శరణ్యమని పోలీసులను వేడుకుంది. దీంతో ఆమె కన్నీళ్లకు కరిగిపోయి.. పోలీసులు రంగంలోకి దిగారు. కనిపించకుండా పోయిన ఆ తల్లీబిడ్డల ఆచూకీ కోసం ఏరియాలో అందరినీ అడిగారు. చుట్టుపక్కల గల్లీలన్నీ జల్లెడ పట్టారు. రెండు గంటల వెతుకులాట తర్వాత.. మొత్తానికి వాళ్లను దొరకబుచ్చుకున్నారు. అయితే.. ఆ బ్రెడ్డు మీద ఆసక్తి లేకపోవడంతో అక్కడే చెత్త కుప్పలో దానిని పడేశామని ఆ తల్లి చెప్పడంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవేళ చెత్త వ్యాను గనుక దానిని ఎత్తేసి ఉంటే పరిస్థితి ఏంటని అనుకుంటూనే.. ఆ ప్రాంతానికి చేరుకున్నారు. చెత్తలో ప్రతీ సంచినీ క్షుణ్ణంగా వెతికి చూశారు. లాభం లేకపోయింది. ఈ సమయంలో.. అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాపై ఏఎస్సై సూరజ్ రౌత్ కన్నుపడింది. దానిని పరిశీలించాడాయన. అయితే అందులో ఓ సంచి దానికి అదే కదులుతూ వెళ్లడం ఆయన్ని ఆశ్చర్యపరిచింది. అందులో బ్రెడ్డు ఉండడంతో అది ఎలుకల పనే అని నిర్ధారించుకున్నారు. వెంటనే.. దగ్గర్లోని ఎలుకల కలుగులను పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. చెత్త కుప్పకు కాస్త దగ్గర్లో.. మురికినీరు పోయే ఓ రంధ్రంలో ఎలుకలు అటు ఇటు కదలాడుతున్నాయి. ఆ రంధ్రం నుంచి తొంగి చూసిన పోలీసులకు ఓ బ్యాగ్ కనిపించింది. వెంటనే దానిని బయటకు తీసి చూడగా.. అందులో నగలు భద్రంగానే ఉన్నాయి. ఆ నగలను అలాగే అప్పగించిన దిన్దోషి పోలీసులకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపింది ఆ తల్లి. నమ్మశక్యంగా లేదు కదూ!. -
రైల్లో కిలోన్నర బంగారం చోరీ!
ఖరీదైన రైలు.. అందులోనూ ఖరీదైన బోగీ.. ఎలాంటి సమస్యా ఉండబోదని దాదాపు కిలోన్నర బంగారాన్ని బ్యాగులో పెట్టుకుని తీసుకెళ్తున్నారు. దాన్ని కూడా దొంగలు కొట్టేశారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు దురంతో ఎక్స్‌ప్రెస్ ఫస్ట్‌క్లాస్ బోగీలో వస్తున్న ప్రయాణికురాలి నుంచి 1.49 కిలోల బంగారం ఉన్న బ్యాగును దొంగలు కొట్టేశారు. 50 ఏళ్ల వయసున్న నాగశేషు వేణు అనే మహిళ బంగారం ఉన్న బ్యాగును తన తలగడ కింద పెట్టుకుని నిద్రపోయారు. కానీ వరంగల్ స్టేషన్‌కు చేరుకునే సమయానికి మెలకువ వచ్చి చూసుకుని, బ్యాగు పోయిన విషయం తెలిసింది. దాంతో వెంటనే ఆమె టీటీఈకి చెప్పారు. రైలు సికింద్రాబాద్ చేరుకున్న తర్వాత ఫిర్యాదు నమోదు చేశారు. ఈ రైలు విశాఖ తర్వాత కేవలం విజయవాడలోనే ఆగుతుంది. బహుశా అక్కడే బ్యాగు ఎవరో కొట్టేసి ఉంటారని రైల్వే పోలీసులు భావిస్తున్నారు.