breaking news
God of Small Things
-
ప్రభుత్వం అయితే మాత్రం!
‘నోరు లేనివాళ్లు ఉండరు. నోరు మెదపని వాళ్లే ఉంటారు..’ అంటారు అరుంధతీ రాయ్. ప్రస్తుతం జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు రాయ్. ప్రభుత్వం అయితే మాత్రం! మనకు అనంగీకారాలు ఉండకూడదా? మనం నోరెత్తకూడదా.. అని ప్రశ్నిస్తున్నారు. అరుంధతీ రాయ్ రచయిత్రి. 1997లో ఆమె రాసిన తొలి నవల ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’తోనే ఇప్పటికీ ఆమె గుర్తుకు వస్తారు. ముఖ్యంగా ఆమె ఉద్యమ రచయిత్రి. మార్పు కోసమే ఆమె చేసే ప్రతి రచనా, రాసే ప్రతి వ్యాసం, మాట్లాడే ప్రతి మాటా! ఆమెను గుర్తు చేసే అంతకుముందరి విషయం మరొకటి కూడా ఉంది. 1989లో ‘ఇన్ విచ్ యానీ గివ్స్ ఇట్ దోజ్ వన్స్’ అనే టీవీ చిత్రానికి స్క్రీన్ ప్లే రైటర్‌గా ఆమెకు జాతీయ అవార్డు వచ్చింది. ఆ అవార్డును 2016లో ఆమె ప్రభుత్వానికే తిరిగి ఇచ్చేశారు! దేశంలో పెరిగిపోతున్న మతపరమైన అసహనాన్ని నిరసిస్తూ ఆమె అలా చేయడం కూడా రాయ్‌ని సామాజిక బాధ్యత స్వీకరించిన రచయిత్రిగా నిలబెట్టింది. తాజాగా ఆమె సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించడంతో మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ‘‘పోరు జరుగుతున్నప్పుడు, ఆందోళన వ్యక్తం అవుతున్నప్పుడు, ప్రదర్శనల నినాదాలు మిన్నంటుతున్నప్పుడు, కొందరు చనిపోతున్నప్పుడు.. మౌనం వహించడం నేరం’’ అంటారు అరుంధతీ రాయ్. ఇప్పుడు ఆమె మాట్లాడుతున్నది కచ్చితంగా రైతు ఉద్యమం గురించే. నోరు విప్పని ప్రముఖుల గురించే. పౌరస్వేచ్ఛను, మానవ హక్కులను రాజకీయ నిర్ణయాలు ఎలా ధ్వంసం చేస్తున్నాయో ఒక సామాజిక, ఉద్యమ కార్యకర్తగా ఆమె నిరంతరం తన వ్యాసాలలో, ప్రసంగాలలో వివరిస్తూ ఉంటారు. అరుంధతి ప్రజానుకూలవాది. గత రెండున్నర దశాబ్దాలుగా ఆమె పార్లమెంటు బయట.. ‘ఏకవ్యక్తి విపక్షం’గా వ్యవహరిస్తున్నారు! ఆమెలో బెరుకుదనం ఉండదు. ఆమె మాటలో మృదుత్వం ఉండదు. మంచి అనుకున్నదాన్ని ఎంత బలంగా ప్రచారం చేస్తారో.. చెడు అనుకున్నదాన్ని అంత ఘాటుగా విమర్శిస్తారు. అరుంధతీ రాయ్ తండ్రి బెంగాలీ హిందువు. తల్లి మలయాళీ సిరియన్ క్రిస్టియన్. కలకత్తాలో ఉండేవారు. ఆమెకు రెండేళ్లప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రిని వదిలి తమ్ముడితో పాటు తల్లితో కేరళ వచ్చేసింది. తర్వాత కొన్నాళ్లు ఊటీలో అరుంధతి తాతగారి ఇంట్లో ఉంది ఆ కుటుంబం. అక్కడి నుంచి మళ్లీ కేరళకు. అరుంధతి చదువు కూడా ఆమె కుటుంబం లాగే ఒక చోట స్థిరంగా సాగలేదు. కొట్టాయంలో కొంత, నీలగిరులలో కొంత పూర్తయింది. ఢిల్లీ ‘స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్’ నుంచి పట్టా తీసుకుంది. అక్కడే ఆమెకు సహ ఆర్కిటెక్ట్ గెరాడ్ డా కన్హాతో పరిచయం అయింది. ఇద్దరూ కొన్నాళ్లు ఢిల్లీలో, గోవాలో సహజీవనం చేశారు. తర్వాత విడిపోయారు. తిరిగి ఢిల్లీ వచ్చాక, 1984లో ఆమెకు ప్రదీప్ క్రిషన్ కలిశారు. ప్రదీప్‌కు సినిమాలు తీయాలని. ఈమెకు సమాజాన్ని మార్చాలని. ఇద్దరూ కలిసి సమాజాన్ని మార్చే సినిమా ఒకటి తీశారు. ‘మెస్సీ సాహిబ్’. దానికి అవార్డు వచ్చింది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొద్దికాలానికే అరుంధతికి సినిమాలు, టీవీ సీరియళ్లు బోర్ కొట్టేశాయి. వాటిని వదిలేసి రకరకాల ఉద్యోగాలు చేశారు. ఏరోబిక్ క్లాసులు నడిపారు. ప్రదీప్‌తో విడిపోయారు. బాల్యంలోని తన జ్ఞాపకాలను రాయడం మొదలుపెట్టారు. ఆ జ్ఞాపకాలే చివరికి ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ అయ్యాయి. -
గీటురాయ్
బయోగ్రఫీ ‘ఆడవాళ్లు అభిప్రాయం కలవారు’ అని ఒప్పుకోడానికి మగవాళ్లకి ఎన్ని శకాలైనా సరిపోవు. సమాజం మాట దేవుడెరుగు.. ఇంట్లో కూడా వారి అభిప్రాయాలకు విలువ కష్టమే. కానీ.. అరుంధతీరాయ్ తన అభిప్రాయాలను తెగువతో రాసి వడబోస్తోంది. బండరాయి మీద బట్టల్ని బాది బాది ఉతికినట్టు తన విమర్శలతో సమాజాన్ని కడిగి ఆరేస్తోంది. మహిళలకు అభిప్రాయాలు ఉండకూడదు అన్న అభిప్రాయం ఇప్పుడు చెల్లదు. ‘ఊహు.. కుదరదు.. చెల్లాల్సిందే’ అనుకున్నవాళ్లు రాయ్‌తో కొట్టుకోవాల్సిందే. అరుంధతీరాయ్.. దీటైన వ్యక్తిత్వానికి గీటురాయి. ‘మంచి’ అనే మాటను గనుక ‘విమర్శించ ని’ అనే అర్థంలో చూస్తే.. అరుంధతీరాయ్ గురించి చెప్పుకోడానికి మంచి విషయాలేమీ ఉండవు! ‘విమర్శ’ అనే మాటను గనక ‘మంచి’ అనే అర్థంలో చూస్తే అరుంధతీరాయ్ గురించి మాట్లాడుకోడానికి ఒక్క వ్యతిరేక విషయం కూడా కనిపించదు! ఎందుకంటే.. ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ పుస్తకంతో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బుకర్ ప్రైజ్ గెలుచుకున్న ఈ భారతీయ రచయిత్రి ఇంతవరకు ఏ ఒక్క పెద్ద మనిషిని గానీ, ఏ ఒక్క పెద్ద వ్యవస్థనిగానీ విమర్శించకుండా వదల్లేదు. అరుంధతి కోసం ప్రస్తుతం దేశమంతటా పోలీసు యంత్రాంగం అప్రమత్తమై ఉంది. ఆమె గనుక ఈ నెల 25 లోగా తన ఆరోపణలపై వివరణ ఇవ్వకపోతే ముంబై హైకోర్టు ఆదేశాలపై ఆమెను కోర్టు ధిక్కార నేరం కింద అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణతో ముంబై కోర్టు ఆయనకు బెయిలు ఇవ్వకపోవడాన్ని ఖండిస్తూ, గత ఏడాది మే నెలలో ప్రముఖ ఆంగ్ల వార పత్రిక ‘ఔట్లుక్’లో అరుంధతి రాసిన వ్యాసంలో పోలీసుల మీద, ప్రభుత్వం మీద, న్యాయ వ్యవస్థ మీద తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. దానిపైనే ఇప్పుడు ఆమె కోర్టుకు వివరణ ఇవ్వవలసి ఉంది. డెవిల్ ఆఫ్ బిగ్ థింగ్స్ అరుంధతికి వ్యతిరేకంగా ఎవరైనా ఆమె బయోగ్రఫీని రాయదలిస్తే బహుశా ఆ పుస్తకానికి వారు పెట్టాలని అనుకునే పేర్లలో ‘డెవిల్ ఆఫ్ బిగ్ థింగ్స్’ అనేది కూడా ఒకటి అయ్యే అవకాశాలున్నాయి. అంతగా ఆమె ఈ సమాజాన్ని ‘విసిగిస్తున్నారు’. ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ని అరుంధతి 1997లో రాశారు. ఆ తర్వాత ఆమె మళ్లీ ఆ స్థాయి ఫిక్షన్ రాయలేదు. ఇప్పటి వరకు రాసినవీ, రాస్తున్నవీ అన్నీ వ్యాసాలే. చిన్న చిన్న విషయాలు మానవ జీవితాల్లో ఎలా పెనుమార్పులను తెస్తాయో ఆ నవలలో రాశారు అరుంధతి. పౌరస్వేచ్ఛను, మానవ హక్కులను, పర్యావరణాన్ని రాజకీయ నిర్ణయాలు ఎలా ధ్వంసం చేస్తున్నాయో ఒక సామాజిక, ఉద్యమ కార్యకర్తగా ఇప్పుడామె తన వ్యాసాలలో, ప్రసంగాలలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అనుకూలవాది.. అరుంధతి అరుంధతి ప్రజానుకూలవాది. గత రెండు దశాబ్దాలుగా ఆమె పార్లమెంటు బయట.. ‘ఏకవ్యక్తి విపక్షం’గా వ్యవహరిస్తున్నారు! ఆమెలో బెరుకుదనం ఉండదు. ఆమె మాటలో మొహమాటం ఉండదు. మంచి అనుకున్నదాన్ని ఎంత బలంగా ప్రచారం చేస్తారో.. చెడు అనుకున్న దాన్ని అంత ఘాటుగా విమర్శిస్తారు. నరేంద్రమోదీ ప్రధాని అభ్యర్థిగా నామినేషన్ వేశారన్న వార్త తెలియగానే అరుంధతి మొదట అన్న మాట... ‘ట్రాజెడీ’ అని! ‘అతడు సైనికప్రియత్వం గల దుడుకుమోతు’ అని కూడా అమె అన్నారు. అన్నా హజారే కూడా అరుంధతి విమర్శలనుంచి తప్పించుకోలేకపోయారు. ‘అన్నా అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని వెనుక నుండి ్రైపైవేటు రంగ సంస్థలు నడిపిస్తున్నాయి’ అని ఆమె అన్నారు. మావోయిస్టులపై భారత ప్రభుత్వం చేపట్టిన సాయుధ చర్యను ‘దేశంలో అతి నిరుపేదలైన వారిపై చేస్తున్న యుద్ధం’గా అరుంధతి అభివర్ణించారు. కాశ్మీర్ విషయంలోనైతే అత్యంత దుస్సాహమైన ప్రకటననే ఆమె చేశారు. ‘కాశ్మీర్ ఏనాడూ ఇండియాలోని భాగం కాదు. ఈ సంగతి భారత ప్రభుత్వానికి కూడా తెలుసు’ అని అన్నారు! శ్రీలంక ప్రభుత్వాన్నైతే తమిళుల ఊచకోతపై ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ‘స్వయంగా శ్రీలంకే ఈ మారణహోమం జరిపించింది’ అని వ్యాఖ్యానించారు అరుంధతీ రాయ్. ఆంటోనీకి బహిరంగ లేఖ అన్నిటికన్నా పెద్ద ఎటాక్... 2008 నాటి ముంబై దాడులపై అరుంధతి వెలిబుచ్చిన అభిప్రాయం. ‘దేశ విభజన, కాశ్మీర్ వివాదం, గుజరాత్ హింస, దేశంలో ముస్లింలకు అందని న్యాయం... ఇన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే ముంబై దాడుల కేసును విచారించాలి’ అని అరుంధతి అన్నారు. పార్లమెంటు భవనంపై జరిగిన దాడిలో ప్రధాన నిందితుడైన మహమ్మద్ అఫ్జల్ ఉరిశిక్షపై స్టే ఇవ్వాలని కూడా ఆమె బహిరంగంగానే డిమాండ్ చేశారు! ఆ ఘటనలో దర్యాప్తు సజావుగా జరగలేదని అరుంధతి ఆరోపణ. ఇక కేరళలో 2003 నాటి ‘మాథుంగ సంఘటన’లో 48 ఏళ్లుగా ఆక్రమణలో ఉన్న తమ భూములను స్వాధీనం చేసుకోడానికి స్థానిక ఆదివాసీలు ప్రాణాలకు తెగించినప్పుడు వారి నాయకులను జైల్లో పడేయడంపై అరుంధతి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. నాటి కేరళ ముఖ్యమంత్రి ఎ.కె.ఆంటోనీకి బహిరంగ లేఖ రాశారు. ‘మీ చేతులకు రక్తం అంటింది. చూసుకున్నారా?’ అని ప్రశ్నించారు. ఇలా భారతదేశంలో జరుగుతోందనుకున్న ప్రతి తప్పునూ అరుంధతి ఖండించారు. అమెరికా సహా ప్రతి దేశాన్ని వేలెత్తి చూపించారు. మన న్యూక్లియర్ విధానాలను, నర్మద ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా యుద్ధాన్ని, ఇజ్రాయెల్ ‘ప్రభుత్వ ఉగ్రవాదాన్నీ’ తప్పుపట్టారు. ఎవరీ అమ్మాయి? మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో జన్మించారు అరుంధతి. తండ్రి రజిబ్ రాయ్ బెంగాలీ హిందువు. తేయాకు తోటల మేనేజర్. తల్లి మేరీ రాయ్. మలయాళీ సిరియన్ క్రిస్టియన్. కేరళలో మహిళల హక్కుల కార్యకర్త. ఇద్దరిదీ ప్రేమ వివాహం. వీళ్ల కుటుంబం కోల్‌కతాలో ఉండేది. అరుంధతికి రెండేళ్లప్పుడు అమ్మానాన్న విడిపోయారు. నాన్నను వదిలి తమ్ముడితో పాటు తల్లితో కేరళ వచ్చేసింది. తర్వాత కొన్నాళ్లు ఊటీలో అరుంధతి తాతగారి ఇంట్లో ఉంది ఆ కుటుంబం. అక్కడి నుంచి మళ్లీ కేరళకు. అరుంధతి చదువు కూడా ఆమె కుటుంబం లాగే ఒక చోట స్థిరంగా సాగలేదు. కొట్టాయంలో కొంత, నీలగిరులలో కొంత పూర్తయింది. ఢిల్లీ ‘స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్’ నుంచి పట్టా తీసుకుంది. అక్కడే ఆమెకు సహ ఆర్కిటెక్ట్ గెరాడ్ డకున్హాతో పరిచయం అయింది. ఇద్దరూ కొన్నాళ్లు ఢిల్లీలో, గోవాలో సహజీవనం చేశారు. తర్వాత విడిపోయారు. తిరిగి ఢిల్లీ వచ్చాక, 1984లో ఆమెకు ప్రదీప్ క్రిషన్ కలిశారు. ప్రదీప్‌కు సినిమాలు తీయాలని. ఈమెకు సమాజాన్ని మార్చాలని. ఇద్దరూ కలిసి సమాజాన్ని మార్చే సినిమా ఒకటి తీశారు. ‘మెస్సీ సాహిబ్’. దానికి అవార్డు వచ్చింది. అందులో అరుంధతి గొర్రెల కాపరిగా చిన్న పాత్ర వేశారు. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొద్దికాలానికే అరుంధతికి సినిమాలు, టీవీ సీరియళ్లు బోర్ కొట్టేశాయి. వాటిని వదిలేసి రకరకాల ఉద్యోగాలు చేశారు. ఏరోబిక్ క్లాసులు నడిపారు. ప్రదీప్‌తో విడిపోయారు. ఎక్కడా ఆమెకు సంతృప్తి లభించలేదు. బాల్యంలోని తన జ్ఞాపకాలను రాసుకుంటూ కూర్చున్నారు. ఆ జ్ఞాపకాలే చివరికి ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ అయ్యాయి. డబ్బు తెచ్చి పెట్టాయి. అరుంధతి ఆకాశంలోని ఒక నక్షత్రం. ఈ అరుంధతి మాత్రం భూమి మీది సెలయేరు. అచ్చం సెలయేరులానే ప్రవహిస్తోంది అరుంధతి జీవితం. ఎక్కడా ఆగింది లేదు. ఒకేలా సాగిందీ లేదు. అరుంధతి.. ఎన్డీటీవీ అధినేత ప్రణయ్ రాయ్ మేనకోడలు. ఉండడానికైతే ఇప్పుడు ఆమె ఢిల్లీలో ఉంటున్నారు కానీ, ఉన్నచోటైతే ఉండడం లేదు. ప్రపంచంలోని ప్రజాసమస్యలన్నీ ఆమెవే! ప్రపంచంలోని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలన్నీ ఆమెకు శత్రువులే. నేనెందుకు తిరిగి ఇచ్చేశానంటే... (అరుంధతి రాయ్‌కి బుకర్ ప్రైజ్ కంటే ముందు 1989లో ‘ఇన్ విచ్ యానీ గివ్స్ ఇట్ దోజ్ ఒన్స్’ అనే టీవీ ఫిల్మ్‌కు బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డు వచ్చింది. దేశంలోని మతపరమైన అసహనంపై నిరసన వ్యక్తం చేస్తూ ఇటీవల ఆ అవార్డును ఆమె ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు.) మొదట నేనొక మాట చెప్తాను. ‘అసహనం’ అనేది చిన్నమాట. సాటి మనిషిని కొట్టి చంపడం, తుపాకీతో కాల్చేయడం, తగలబెట్టడం అనేవి అసహనం అనే మాట సరిపోనంత అమానుషమైనవి. రెండో మాట. ముందు ముందు మనం ఇంతకన్నా ఘోరమైన పరిణామాలను చూడ్డానికి సిద్ధం కావాలి! మెజారిటీ ఉన్న ప్రభుత్వం కదా, ఏమైనా జరగొచ్చు. దేశంలోని లక్షలాది మంది దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, క్రిస్టియన్లు.. భవిష్యత్తులో భయం నీడలో గడపవలసిన రోజులకు ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు సంకేతాలు. బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కూడా లేదు. ఘటనా స్థలం నుంచి నేరం జరిగిన ఆధారాలను సేకరించడం అంటే ఈ ప్రభుత్వానికి ఫ్రిజ్‌లో గొడ్డు మాంసం ఉందా లేదా అని చూడడం తప్ప, చావుదెబ్బలకు మరణించిన వ్యక్తి దేహాన్ని ఫోరెన్సిక్ పరీక్షకు పంపడం కాదు! ఈ ధోరణిపై దేశంలోని సృజనశీలురంతా...రచయితలు, సినీదర్శక నిర్మాతలు, విద్యావేత్తలు... కలిసి తమ అవార్డులు తిరిగి ఇచ్చేయడం ద్వారా తమ ధర్మాగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. వారికి మద్దతు పలకడం నా ప్రథమ ధర్మం. అందుకే నా అవార్డును తిరిగి ఇచ్చేయడం సబబు అనిపించింది. కోపం రాలేదంటే మనుషులం కాదని..! (నా జీవితమే నా సందేహం అని గాంధీజీ అన్నట్లు... అరుంధతి రాయ్ మాటలే ఆమె జీవనశైలి)ఉద్వేగాన్ని, కోపాన్ని, ఆగ్రహాన్ని ప్రదర్శించే శక్తిని కోల్పోయామంటే మనం మనుషులం కాదు. రోబోలం. నేను చేసేది చేస్తాను. నేను రాసేది రాస్తాను. ఏదీ లెక్కేసుకుని చేయను.నాకేం గొప్పదాన్నైపోవాలని లేదు. మనిషిగా నాకు ఉండాల్సిన స్వేచ్ఛ నాకు ఉంటే చాలు. ఇంకేదీ కోరుకోను. సంపద వద్దు. సత్కారాలు వద్దు. మావోయిస్టులంటే నాకు సానుభూతి ఉంది. అలాగని మావోయిస్టు సిద్ధాంతానికి మద్దతు ఇవ్వలేను. పెట్టుబడిదారీ విధానంలా చరిత్రలోని కమ్యూనిస్టు విధానాలు కూడా విధ్వంసకరమైనవే.