breaking news
gattu srikanta reddy
-
రాష్ట్ర కార్యవర్గంలో త్వరలో భారీ మార్పులు
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గంతో పాటు జిల్లా అధ్యక్ష పదవుల్లో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, శ్రేణులు పనిచేయడం కోసమే ఈ ప్రక్షాళన చేపట్టామని ఆయన తెలిపారు. -
వైఎస్సార్ సీపీ కమిటీల్లో 44మందికి స్థానం
కాజీపేట రూరల్ : వైఎస్సార్ సీపీ కమిటీల్లో పలువురు నాయకులకు స్థానం దక్కింది. రాష్ట్ర, జిల్లా కమిటీలతో పాటు గేటర్, మండల, పట్టణ కమిటీల్లో నాయకులకు స్థానం కల్పించగా ఆ వివరాలను శనివారం వెల్లడించారు. వైఎస్సార్ సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆదేశాలను నియామక పత్రాలు జారీ చేసినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ తెలిపారు. ఈ మేరకు కమిటీల్లో స్థానం దక్కిన వారి వివరాలిలా ఉన్నాయి. రాష్ట్ర కమిటీలో ముగ్గురు.. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ సెక్రటరీగా గౌని సాంబయ్య నియమితులయ్యారు. అలాగే, మైనార్టీ సెక్రటరీగా ఎం.డీ.ఖాన్, మహిళా సెక్రటరీగా ఎస్.కే.ఖాజాబీకి స్థానం దక్కింది. ఇక వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా బీంరెడ్డి స్వప్నరెడ్డి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడిగా చందహరి కృష్ణారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా బొచ్చు రవి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షుడిగా పెరుమల రమేష్, జిల్లా కార్యదర్శిగా నోముల జైపాల్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి బుర్ర రాంనందం నియమితులయ్యారు. ఇంకా వరంగల్ గ్రేటర్ ప్రెసిడెంట్‌గా జీడికంటి శివకుమార్, యూత్ ప్రెసిడెంట్‌గా మైలగాని కళ్యాన్‌కుమార్, స్టూడెంట్ ప్రెసిడెంట్‌గా బత్తుల సంతోష్‌కుమార్, బీసీ సెల్ అధ్యక్షుడిగా నాగవెల్లి రజినీకాంత్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మండల, నగర కమిటీలు వివిధ మండలాలకు వైఎస్సార్ సీపీ కమిటీలను వెల్లడించారు. మహబూబాబాద్ మండల అధ్యక్షుడిగా గుగులోతు రామునాయక్, గూడూరుకు మేకల రవీందర్, కేసముద్రం ఎండీ.బషీర్‌ఖాన్, నెల్లికుదురు గుగులోతు యాకూబ్, నర్సంపేటకు నూనె నర్సయ్య, చెన్నారావుపేటకు డి.భరత్‌రెడ్డి, నల్లబెల్లికి కోల లింగయ్య, నెక్కొండకు అలువాల సాయికుమార్, దుగ్గొండికి నూనావత్ రమేష్, పరకాలకు బొచ్చు భాస్కర్, సంగెం మండల అధ్యక్షుడిగా మెట్టుపెల్లి రమేష్ నియమితులయ్యారు. అలాగే, రేగొండ మండల అధ్యక్షుడిగా పసుల రత్నాకర్, భూపాలపల్లికి ఇటుకల భాస్కర్, చిట్యాలకు జానె రమేష్, శాయంపేటకు ఆలే అర్జున్, పర్వతగిరికి దండెపెల్లి సైదులు, వర్ధన్నపేటకు దొంతి సురెందర్‌రెడ్డి, గోవిందరావుకు మాందాడి వీరారెడ్డి, ఏటూరునాగారానికి ఎండీ. కైసర్ పాషా, వెంకటాపురానికి మెట్టు సురేష్, లింగాలఘణపురానికి దేవరాజు అంజయ్య, రఘునాథపల్లికి బక్క జంపన్న, స్టేషన్ ఘన్పూర్ మండల అధ్యక్షుడిగా ఉరది శ్రీనివాస్, ధర్మసాగర్ మండల అధ్యక్షుడిగా ఖాసీం పాషాను నియమించారు. అలాగే, భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడిగా మన్నెం నాగరాజు, నర్సంపేట పట్టణ అధ్యక్షుడిగా పాలకుర్తి కృష్ణ, మహబూబాబాద్ మండల అధ్యక్షుడిగా సప్పిడి రంజిత్‌కుమార్, జనగాం మండల అధ్యక్షుడిగా రొడ్డ కృష్ణను నియమించినట్లు నాడెం శాంతికుమార్ తెలిపారు. జగన్మోహన్రెడ్డిని కలిసిన శాంతికుమార్ హైదరాబాద్ లోటస్‌పాండ్ నివాస గృహంలో వైఎస్సార్ జాతీయ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డిని జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ కలిశారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్‌తో కలిసి జగన్‌ను కలిసి శాంతికుమార్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితిపై జగన్మోహన్రెడ్డి వారితో ఆరా తీశారు. -
పాలేరు ఉప ఎన్నిక పరిశీలకులుగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకులను నియమించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నూతన రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి, మెండం జయరాం, హబీబ్ అబ్దుల్ రెహమాన్లను ఎన్నికల పరిశీలకులుగా నియమించినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులైన గట్టు శ్రీకాంత్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయనతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఎడ్మ కిష్టారెడ్డి, కె.శివకుమార్ నియమితులవగా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా కొండా రాఘవరెడ్డిని నియమించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నల్లా సూర్యప్రకాశ్, హబీబ్ అబ్దుల్ రెహమాన్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.