breaking news
first president
-
Dr Asima Chatterjee: సైన్స్ కాంగ్రెస్ తొలి అధ్యక్షురాలు
భారతీయ విశ్వవిద్యాలయాల నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టా అందుకున్న మహిళ, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన స్త్రీమూర్తి, మహిళా శాస్త్రవేత్తగా రాజ్యసభ సభ్యులు కావడం వంటి ప్రత్యేకతలు అసీమా చటర్జీ (Dr Asima Chatterjee) (1917– 2006) సొంతం. ప్రకృతి ఉత్పత్తులైన అల్కలాయిడ్స్, కామెరిన్స్, టెర్పనాయిడ్స్ విషయంలోఆమె కృషి విశేషమైనది. భారతీయ ఔషధ మొక్కలకు సంబంధించి వి.విశ్వాస్ గ్రంథానికి చాలా రకాలుగా అదనపు సమాచారాన్ని జోడించి ‘ట్రీటైస్ ఆన్ మెడిసినల్ ప్లాంట్స్’ను ఆరు భాగాల గ్రంథంగా వెలువరించారు.అసీమా చటర్జీ 1917 సెప్టెంబరు 23న బెంగాల్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1944లో పి.కె. బోస్ సారథ్యంలో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి తొలి భారతీయ మహిళగా డీఎస్సీ పొందారు. వృక్ష ఉత్పత్తులకు సంబంధించి, సేంద్రియ రసాయనాలపై అధ్యయ నమే ఆవిడ పరిశోధన. ఆ సిద్ధాంత గ్రంథాన్ని నోబెల్ బహుమతి గ్రహీత ఎ.ఆర్. టాడ్ పరీక్షించి గొప్పగా అభినందించారు. ఆమె భర్త వరదానంద చటర్జీ భౌతిక రసాయనశాస్త్రంలో దిట్ట.1947లో ఆమె అమెరికా వెళ్లి నాలుగేళ్లలో ముగ్గురు వేరు వేరు విశ్వవిద్యాలయాల ఆచార్యుల దగ్గర పరిశోధన చేశారు. ఇందులో నోబెల్ బహుమతి గ్రహీత పాల్ కారర్ ఒకరు. 1950లో భారతదేశానికి తిరిగి వచ్చి కలకత్తా విశ్వవిద్యాలయంలో ఉద్యోగ జీవితాన్ని కొనసాగించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తూ ఈ విజ్ఞాన శాస్త్ర మహా సభలకు ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా, 1975లో ప్రధాన అధ్యక్షులుగా వ్యవహరించారు. భారతీయ ఔషధ మొక్కలు, ఆయుర్వేదానికి సంబంధించి సాల్ట్ లేక్ (కలకత్తా)లో, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రీజనల్ రీసర్చి ఇన్స్టిట్యూట్ రావడానికి కృషి చేశారు. మూర్ఛవ్యాధికి విరుగుడుగా ఆయుష్ –56, అలాగే మలేరియాను నిర్మూలించేందుకు ఔషధాలను తయారు చేశారు. అసీమా పొందిన ఎన్నో గౌరవాలు, పురస్కారాలలో 1975లో లభించిన పద్మ విభూషణ్ ఒకటి.ప్రజావళిలో శాస్త్రీయ అభినివేశం లేకపోతే ఫలితం శూన్యమని ఆమె నమ్మే వారు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి పట్టణాల వద్దే ఆగిపోతే మంచిది కాదనీ, గ్రామ సీమలలోనూ అది వ్యాప్తి కావాలనీ అనేవారు. రాజ్యసభ సభ్యురాలిగా 1982 నుంచి 8 ఏళ్ల పాటు సేవలు అందించారు. విజ్ఞానమాతకు ఆభరణంగా భాసి ల్లిన అసీమా చటర్జీ 2006 నవంబర్ 22న తన 89వ యేట కన్ను మూశారు.– డా.నాగసూరి వేణుగోపాల్‌ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి -
ఫస్ట్ ఉమన్: అమెరికా యూనివర్శిటీకి మన మహిళే ప్రెసిడెంట్
ఎల్లలు దాటి ఏ దేశమేగినా మన సాధనే తొలి అడుగు గా ఉంటే విజయం దానంతట అది మనల్ని వరించక తప్పదనే విషయాన్ని తన విజయం ద్వారా రుజువు చేసి చూపుతున్నారు నీలి బెండపూడి. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ చరిత్రలో తొలి మహిళా ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెందిన ఒక మహిళ ఎన్నిక కావడం గర్వించదగినదిగా సర్వత్రా అభినందనలు అందుకుంటున్నారు నీలి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన నీలి బెండపూడి ఉన్నత చదువుల కోసం ముప్పై ఐదేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. ఆమె విజయ సోపానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం అమెరికాలోని లూయిస్విల్లేలో ఉంటున్న నీలి బెండపూడి విశాఖపట్నం వాసి. ఆంధ్రాయూనివర్శిటీలో ఎంబీఎ చేసిన ఆమె. పీహెచ్‌డి కోసం అమెరికాలో కాన్సస్ యూనివర్శిటీకి వెళ్లారు. అలా 1986లో పై చదువుల రీత్యా విశాఖపట్నం నుంచి వెళ్లిన నీలి బెండపూడి 30 ఏళ్లుగా అంచెలంచెలుగా ఎదిగారు. నాలుగేళ్లుగా యూనివర్శిటీ ఆఫ్ లూయిస్విల్లేకు 18వ ప్రెసిడెంట్‌గా విధులను నిర్వరిస్తున్నారు. దీనిలో భాగంగా యూనివర్శిటీ పరిధిలోని పన్నెండు విద్యా కళాశాలలు, విద్యా ఆరోగ్య వ్యవస్థలో భాగంగా ఐదు ఆసుపత్రులు, ఒక అథ్లెటిక్ ప్రోగ్రామ్, 200 మంది వైద్యులు, నాలుగు వైద్య కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఆమె తన విధుల్లో కొనసాగుతారు. గత అనుభవాలే గురువులు విధి నిర్వహణలో సమర్థత, కార్యదక్షతలో భాగంగా ఆమె ప్రతియేటా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూనే ఉన్నారు. కాన్సాస్ విశ్వవిద్యాలయంలో ఎగ్జిక్యూటివ్ వైస్‌ఛాన్సలర్‌గా, స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ వంటి అడ్మినిస్ట్రేటివ్ పదవులను నిర్వహించడంలో ఆమెకు అపార అనుభవం ఉంది. ఓహియో స్టేట్ యూనివర్శిటీలో ఇనిషియేటివ్ ఫర్ మేనేజింగ్ సర్వీసెస్ వ్యవస్థాపక డైరెక్టర్‌గానూ పనిచేశారు. ‘గతం గతః అనుకునే నైజం కాదు నాది. గత అనుభవాలు నాకు పాఠాలు. అవే నా గురువులు. నా ప్రతి అడుగులో తోడుగా ఉండి విజయావకాశాలు అందుకునేలా చేశాయి. అందుకే, నాకు అలసట అన్నదే రాదు’ అంటూ నడిచొచ్చిన మెట్ల గురించి సవినయంగా వివరిస్తారు నీలి బెండపూడి. ప్రతిష్ఠాత్మక ప్రెసిడెంట్ రాబోయే నూతన సంవత్సర ప్రారంభంలో ప్రతిష్ఠాత్మక పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ (పీఎస్‌యు) కి 19వ ప్రెసిడెంట్‌గా నీలి బెండపూడి బాధ్యతలు స్వీకరించనున్నారు. యూనివర్శిటీ అధ్యాపకులు, సిబ్బంది, సభ్యులు, విద్యార్థులు, ట్రస్టీ ప్రతినిధులతో కూడిన 18 మంది సభ్యుల బృందం నీలి బెండపూడిని ప్రెసిడెంట్‌గా ఎంపిక చేసింది. యూనివర్శిటీకి ప్రెసిడెంట్‌గా ఎంపికైన తర్వాత పీఎస్యూలోని ట్రæస్టీకి ధన్యవాదాలు తెలిపిన బెండపూడి ఈ అవకాశాన్ని అందుకోవడానికి తాను పనిచేసిన ప్రతి చోటూ తన ఉన్నతికి సహాయపడిందని గుర్తు చేసుకుంటున్నారు. అమెరికన్ అడకమిక్ అడ్మినిస్ట్రేటర్ గా, పీఎస్‌యు అధ్యక్షుడిగా పనిచేసిన ప్రెసిడెంట్ ఎరిక్ జె బారన్ తర్వాత ఆమె ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. ‘గతం గతః అనుకునే నైజం కాదు నాది. గత అనుభవాలు నాకు పాఠాలు. అవే నా గురువులు. నా ప్రతి అడుగులో తోడుగా ఉండి విజయావకాశాలు అందుకునేలా చేశాయి. అందుకే, నాకు అలసట అన్నదే రాదు. నీలి బెండపూడి -
కీలక పాత్ర పోషించిన డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్
దేశంలోనే అత్యున్నత పదవిని పొందిన తొలి వ్యక్తి మన దేశ తొలి రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అంతేకాదు ఆయన ఒక గొప్ప గురువుగా, న్యాయవాదిగా, మంచి రచయితగా, స్వాతంత్ర్య సమరయోధుడుగా ఇలా ఎన్నో సేవలను అందించారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బహుముఖ వ్యక్తిత్వం గలవారు. బిహార్ శివాన్ జిల్లాలోని జెర్దాయ్ గ్రామంలో ఆయన 1884 డిసెంబరు 3న జన్మించారు. బాల్యం నుంచే రాజేంద్ర ప్రసాద్ చురుగ్గా ఉండేవారు. బిహార్‌లో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయన ఆ తర్వాత అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ పట్టా పొందారు. కొన్నాళ్లు బిహార్, ఒడిశా హైకోర్టులలో పనిచేశారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. మహాత్మా గాంధీచే బాగా ప్రభావితమైన రాజేంద్ర ప్రసాద్ 1931 నాటి 'ఉప్పు సత్యాగ్రహం' 1942లో జరిగిన 'క్విట్ ఇండియా ఉద్యమం' లో చురుగ్గా పాల్గొన్నారు. అనేకమంది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులతో పాటు ఆయన కూడా జైలు జీవితం గడిపారు. 1946 సెప్టెంబరు 2న జవాహర్ లాల్ నెహ్రూ కేబినెట్లో రాజేంద్ర ప్రసాద్ ఆహార, వ్యవసాయ శాఖకు మంత్రిగా పని చేశారు. జీపీ కృపాలానీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన తరువాత 1947 నవంబరు 17న కాంగ్రెస్ అధ్యక్షునిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. 1950 నుండి 1962 వరకు ఆయన భారత రాష్ట్రపతిగా పని చేశారు. ఆయనకు 1962లో అత్యున్నత పౌర పురస్కారం భరత రత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
తెలంగాణా మూవీ ఛాంబర్ తొలి అధ్యక్షుడు దిల్‌రాజు
తెలంగాణ మూవీ ఛాంబర్ ఆప్ కామర్స్ తొలి అధ్యక్షుడిగా ప్రముఖటాలీవుడ్ దర్శకుడు దిల్ రాజు ఎన్నికయ్యారు. నిర్మాతలందరూ దిల్ రాజును తమ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలంగాణ మూవీ ఛాంబర్ ఆప్ కామర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ను, ఒక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిపింది. ముఖ్యంగా నిర్మాతలను కలిసి, తెలంగాణ సినీ పరిశ్రమలోని సమస్యలు, సవాళ్ల గురించి చర్చించడం తమ తక్షణ కర్తవ్యమని సంస్థ పేర్కొంది.