ఫ్యామిలీ జోక్స్
మేనేజర్ మహాలింగం: ఆఫీసుకి వేళకు రావాలని తెలీదా..? ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు?
గుమస్తా గుర్నాథం: ఉల్లిపాయలు తరుగుతుంటే వేలు తెగిందండీ..
మేనేజర్ మహాలింగం: ఛ... సిగ్గు లేకపోతే సరి!
గుమస్తా గుర్నాథం: నిజమే చెబుతున్నా సార్...
మేనేజర్ మహాలింగం: ముప్పయ్యేళ్లుగా వంట చేస్తున్నా నా చేతికి ఒక్క గాటు కూడా పడలేదు..
నీకు వంట కూడా చేతకాదన్న మాట...
అప్పారావు: కాశీకి వెళ్లొచ్చావట.. ఏం వదిలేసి వచ్చావు?
సుబ్బారావు: చక్కెర
అప్పారావు: అదేంటి..? ఎవరైనా ఏదో పండో కాయో వదిలేస్తారు కదా?
సుబ్బారావు: నాకు ఎలాగూ చక్కెర జబ్బు ఉంది. ఎటూ కలిసొస్తుంది కదా అని...
రోగి: రోజూ కళ్లు తిరుగుతున్నాయి... ఏదైనా మందులు రాసివ్వండి డాక్టర్..
డాక్టర్: కాస్త ఆగవయ్యా... నీకు ఏ మందులు రాయాలో తెలీక నాకు కళ్లు తిరుగుతున్నాయి.