breaking news
Elation
-
పశు వైద్య కళాశాల మంజూరుపై హర్షం
మామునూరు : హన్మకొండ మండలం మామునూరులో పశు వైద్య కళాశాల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వరంగల్ 6వ డివిజన్ కార్పొరేటర్ చింతల యాదగిరి ఆధ్వర్యంలో ఆదివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం యాదగిరి మాట్లాడుతూ జిల్లాలో పశు వైద్యకళాశాల ఏర్పాటుకు కృషి చేసిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బి.జయశంకర్, డానియల్, రమేష్, అనంత్, బాబు, శ్రీశైలం, కుమార్, హన్మన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సురేశ్ ప్రభుకు సీటుపై వెంకయ్య హర్షం
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సురేశ్ ప్రభు పోటీ చేస్తున్నందుకు కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. తన మిత్రుడు సురేశ్ ప్రభు అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చిన టీడీపీకి కృతజ్ఞతలు తెలిపారు.