breaking news
EAMCET-2014 exam
-
వెబ్సైట్లో ఎంసెట్ తాజా షెడ్యూలు
మే 22న రాతపరీక్ష.. జూన్ 9న ర్యాంకుల వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2014 తాజా షెడ్యూల్‌ను ఎంసెట్ కమిటీ తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఫీజు చెల్లింపు, హాల్‌టికెట్ల డౌన్లోడ్, రాత పరీక్ష సమయాలకు సంబంధించిన పూర్తి వివరాలను పొందేలా ఏర్పాట్లు చేసింది. తొలుత మే 17న ఎంసెట్‌ను నిర్వహించాలని నిర్ణయించినా, ఎన్నికల కౌంటింగ్ 16న ఉండటం.. కొన్నిచోట్ల 17న కూడా కొనసాగే పరిస్థితులుంటాయనే ఆలోచనతో పరీక్షను మే 22కి వాయిదా వేసిన సంగతి తెలి సిందే. దీంతో హాల్‌టికెట్ల డౌన్లోడ్, ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ, ర్యాంకు ల వెల్లడి వంటి తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తాజా షెడ్యూల్, ఇతర వివరాలు ఎంసెట్ వెబ్సైట్(http://apeamcet.org) నుంచి పొంద వచ్చు. కాగా మే 22న బిట్‌శాట్ ఆన్లైన్ పరీక్ష ఉన్నప్పటికీ, ఎంసెట్ పరీక్ష తేదీని మార్చే అవకాశం లేదని ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలి పారు. అయితే రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలదృష్ట్యా బిట్‌శాట్ పరీక్షను మరో తేదీకి వాయిదా వేయాలని సంబంధిత అధికారులకు లేఖ రాస్తామన్నారు. ఇదీ ఎంసెట్ తాజా షెడ్యూల్... 4-4-2014: ఆలస్యరుసుము లేకుండా దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 6-4-14 నుంచి 13-4-14 వరకు: సబ్మిట్ చేసిన దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం 18-4-14: రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుల సబ్మిషన్కు చివరి రోజు 25-4-14: పరీక్ష కేంద్రాల ఖరారు, హాల్‌టికెట్ల జనరేషన్ 25-4-14: రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుల సబ్మిషన్కు తుది గడువు 8-5-14 నుంచి 19-5-14 వరకు: వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్ 8-5-14: రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తుల సబ్మిషన్కు తుది గడువు 19-5-14: 10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుల సబ్మిషన్కు చివరి రోజు 22-5-14: ఎంసెట్ రాత పరీక్ష ఉదయం 10 గంటల నుంచిఒంటి గంట వరకు ఇంజనీరింగ్ మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంట ల వరకు అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ 24-5-14: ప్రాథమిక కీ విడుదల 31-5-14 వరకు: కీపై అభ్యంతరాల స్వీకరణ 9-6-14: ర్యాంకుల వెల్లడి -
రేపటి నుంచి ఆన్లైన్లో ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
మే 2 నుంచి హాల్‌టికెట్ల జారీ సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది మే 17న జరిగే ఎంసెట్-2014 పరీక్షకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 20 నుంచి ఆన్లైన్లో సమర్పించవచ్చని ఎంసెట్ కన్వీనర్ ఎన్వీ రమణారావు మంగళవారం తెలిపారు. ఈసేవ/మీసేవ/ ఏపీ ఆన్లైన్/ క్రెడిట్/ డెబిట్ కార్డుల ద్వారా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఏప్రిల్ 6 నుంచి 13 వరకు దరఖాస్తుల్లో తప్పులను ఆన్లైన్లోనే సవరించుకోవచ్చని, రిజిస్ట్రేషన్ కోసం ఇంజనీరింగ్ అభ్యర్థులు రూ.250, అగ్రికల్చర్ అండ్ మెడికల్ అభ్యర్థులు రూ. 250 చొప్పున, రెండింటికీ హాజరయ్యేవారు రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మే 2 నుంచి 15 వరకు హాల్ టి కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 వరకు, రూ. 1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు పంపవచ్చన్నారు. అదేవిధంగా రూ. 5 వేల ఆలస్య రుసుముతో మే 5వరకు, రూ. 10 వేల ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తులు పంపవచ్చని వివరించారు.