breaking news
E voting
-
Khammam: ఇంటి నుంచే ఓటేయొచ్చు.. దేశంలోనే తొలిసారి ‘ఈ ఓటింగ్’
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సంక్షోభం ప్రపంచాన్ని డిజిటల్ ఆధారిత కార్యకలాపాలకు నెట్టివేసిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం ‘ఈ ఓటింగ్’విధానాన్ని అభివృద్ధి చేసింది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేసిన స్మార్ట్ ఫోన్ ఆధారిత ఈ ఓటింగ్ విధానాన్ని ఇప్పటికే ఎస్ఈసీ పరీక్షించింది. క్షేత్రస్థాయిలో దీనిని ప్ర యోగాత్మకంగా పరీక్షించేందుకు ఖమ్మం జిల్లాను ఎంపిక చేసింది. ‘టీఎస్ఈసీ ఈఓట్’గా పిలిచే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఆధారిత యాప్ ద్వారా ఈ నెల 8 నుంచి 18 వరకు ఆసక్తి ఉన్న ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ఖమ్మం జిల్లాలోని ఓటర్లందరూ ఈ ప్రయోగంలో భాగస్వాములు అయ్యేందుకు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదైన ఓటర్లు అదే ఫోన్ నంబరు ద్వారా 20న జరిగే నమూనా ఓటింగ్‌లో పాల్గొనాలి. చదవండి: తెలంగాణపై ఫ్రెంచ్ ఫోకస్.. మరో అద్భుత అవకాశం ఎమర్జింగ్ టెక్నాలజీ సాయంతో ‘ఈ ఓటింగ్’ రాష్ట్ర ఐటీ శాఖకు చెందిన ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సిడాక్) భాగస్వామ్యంతో ఎస్ఈసీ ‘ఈ ఓటింగ్’విధానాన్ని అభివృద్ధి చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతిక సలహాదారు, ఐఐటీ భిలాయ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రజత్ మూనా నేతృత్వంలోని ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్లతో కూడిన నిపుణుల బృందం నూతన ఓటింగ్ విధానానికి సాంకేతిక మార్గదర్శనం చేసింది. దివ్యాంగులు, వయోవృద్ధులు, అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసే వారు, అనారోగ్యంతో బాధపడేవారు, పో లింగ్ సిబ్బంది, ఐటీ నిపుణులు తదితర వర్గాల కో సం ‘ఈ ఓటింగ్’విధానం అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ఎస్ఈసీ ఈ యాప్‌ను రూపొందించింది. చదవండి: చోరీ మామూలే..కానీ ఈ దొంగకు ఓ ప్రత్యేకత ఉంది ఏఐ, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ సాయంతో.. ఓటర్లను గుర్తించేందుకు కృత్రిమ మేథస్సు (ఏఐ), వేసిన ఓట్లను భద్రపరచడం, తారుమారు కాకుండా చూసేందుకు బ్లాక్ చెయిన్ సాంకేతికత ఆధారంగా యాప్ పనిచేస్తుంది. ఆధార్ కార్డులోని పేరుతో ఓటరు పేరు సరిచూడటం, ఎన్నికల సంఘం డేటా బేస్తోని ఫొటోతో ఓటరు ఫొటోను సరిచూడటం వంటి వాటిలో ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఓటర్లు సులభంగా ఈ యాప్‌ను ఉపయోగించేలా తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఉంటుంది. యాప్‌ను ఎలా ఉపయోగించాలో ఓటర్లకు తెలియజేసేందుకు ఈ యాప్‌లో వీడియోలు, హెల్ప్‌లైన్ నంబర్లు కూడా ఉంటాయి. -
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ- ఓటింగ్
కర్నూలు (ఆదోని) : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (2019లో జరిగే ఎన్నికలు) ఈ-ఓటింగ్ జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఆయన శనివారం కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహిస్తున్న ఓటరు కార్డుకు ఆధార్ సీడింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్ఆర్ఐలకు ఈ-ఓటింగ్ ద్వారా అవకాశం కల్పించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. ఎన్ఆర్ఐల కోసం ప్రవేశ పెట్టిన ఈ-ఓటింగ్ విధానాన్ని స్థానిక ఓటర్ల కోసం కూడా అమలు చేయవచ్చన్నారు. అత్యంత వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఈ-ఓటింగ్ విధానం అమలు చేయడం వల్ల ఖర్చు ఆదా అవుతోందని, పోలింగ్‌లో పారదర్శకత పెరుగుతుందన్నారు. జనాభా కన్నా ఓటర్లు ఎక్కువగా ఉన్నారనే ప్రచారంలో నిజం లేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 75 శాతం ఆధార్ సీడింగ్ పూర్తయిందని, ఈ నెల చివరిలోగా వందశాతం పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆగస్టు 1న తప్పులు లేని ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన ఏపీలో అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాల్సి ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాల రీత్యా స్థానాలను పెంచే అధికారం ఎన్నికల సంఘానికి లేదన్నారు. పార్లమెంట్ మాత్రమే ఈ విషయమై తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.