breaking news
Dr.Venati Shoba
-
అలా అయితే... నేను పెళ్లికి పనికిరానా?
సందేహం నా వయసు 33. ఇద్దరు పిల్లలు. ఇప్పటికీ నేను, మావారు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొంటాం. ఆ సమయంలో అంగచూషణను బాగా ఎంజాయ్ చేస్తుంటాం. అలాంటప్పుడు ఒక్కోసారి నేను వీర్యం మింగేస్తుంటాను. దానివల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా? - సుజీ, ప్రకాశం జిల్లా అంగచూషణ చేసేటప్పుడు ఒక్కోసారి మగవారి అంగం మీద ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే... అది మీ నోటి ద్వారా లోనికి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే మీ నోటిలో, దంతాల్లో, చిగుళ్లలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే... అది మీవారికి సోకే అవకాశమూ ఉంది. సాధారణంగా వీర్యంలో కొద్దిగా చీము కణాలు ఉంటాయి. కొందరిలో హర్పిస్, గనోరియల్, సిఫిలిస్, ఫంగల్ ఇంకా ఇతరత్రా సుఖవ్యాధులకు సంబంధించిన క్రిములు కూడా ఉండవచ్చు. ఆడవారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు.... నోటిలో పుండ్లు, పగుళ్లు వంటివి ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్లు వారికి కూడా సోకే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు పై కారణాలు లేకుండా కూడా ఇన్ఫెక్షన్ సోకుతుంది. దాంతో నోటిలో పొక్కులు, కురుపులు, పుండ్లు ఏర్పడతాయి. జ్వరంతో పాటు మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఒకవేళ మగవారిలో హెచ్ఐవీ, హెపటైటిస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ఉంటే అవి కూడా సోకవచ్చు. అందువల్ల అంగచూషణ పూర్తిగా సురక్షితమని చెప్పడానికి లేదు. మీరిద్దరూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి, కండోమ్ వాడుకోవడం ఇద్దరికీ మంచిది. నా వయసు 24. ఈమధ్యనే పెళ్లి కుదిరింది. అప్పట్నుంచీ నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే నాకు హస్తప్రయోగం అలవాటు ఉంది. అది చేసే సమయంలో కొన్ని రకాల వస్తువులు కూడా వాడేదాన్ని. దానివల్ల నా యోని వదులైపోయి ఉంటుందేమో, కన్నెపొర చిరిగిపోయిందేమో అని అనుమానంగా ఉంది. మొదటి రాత్రి నా భర్తతో కలిసినప్పుడు రక్తం రాకపోతే అతడు నన్ను అనుమానిస్తాడేమోనని కంగారుగా ఉంది. ఇప్పుడేం చేయాలి? - వందన, హైదరాబాద్ హస్తప్రయోగం వల్ల యోని వదులైపోవడం అనేది ఉండదు. కాకపోతే కొన్ని వస్తువులు వాడారు కాబట్టి కన్నెపొర చిరిగే అవకాశం ఉంది. సాధారణంగా కొందరిలో కన్నెపొర చిన్నతనంలో ఆటలాడేటప్పుడు, సైకిల్ తొక్కడం లాంటివి చేసినప్పుడు చిరిగిపోతుంది. మరికొందరి కన్నెపొరకు సాగే గుణం ఉంటుంది. అలాంటివారికి మొదటిసారి కలిసినప్పుడు రక్త రావడం జరగదు. అయినా మొదటిరాత్రి అందరికీ రక్తం రావాలన్న నియమం ఏమీ లేదు. కాబట్టి మీరు అనవసరంగా కంగారు పడకండి. పెళ్లి చేసుకోబోతున్న ఆనందాన్ని హాయిగా ఆస్వాదిస్తూ, సంతోషంగా ఉండండి. నా వయసు 20. ఇంకా పెళ్లి కాలేదు. నాకు మొదట్నుంచీ నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. ఎడమకాలు కూడా బాగా లాగుతూ ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నవారికి పెళ్లయ్యాక చాలా ఇబ్బందులు వస్తాయని, పిల్లలు కూడా సరిగ్గా పుట్టరని నా ఫ్రెండ్ అంటోంది. అది నిజమేనా? నేను పెళ్లి చేసుకోవడానికి పనికిరానా? - పూర్ణిమ, డోర్నకల్ కొంతమందికి నెలసరి సమయంలో ఎలాంటి సమస్యా లేకపోయినా కూడా నొప్పి వస్తుంది. ఆ సమయంలో ప్రొస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లు ఎక్కువ మోతాదులో విడుదలవడం వల్ల, బ్లీడింగ్ బయటకు రావడానికి గర్భాశయంలోని కండరాలు కుదించుకున్నట్లు అయ్యి... పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి, వికారం వంటివి కలుగుతాయి. ఇవి ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు ఉండవచ్చు. ఇలాంటి వారిలో పెళ్లయ్యాక ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. వేరే ఏ సమస్యలూ లేనప్పుడు పిల్లలు పుట్టడంలోనూ సమస్యలు ఏర్పడవు. అయితే కొందరిలో మాత్రం గర్భాశయంలో గడ్డలు, ఎండోమెట్రియాసిస్, అడినోమయోసిస్ వంటి కొన్ని సమస్యల కారణంగా పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఆ సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే కొన్నిసార్లు పిల్లలు పుట్టడానికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరోసారి గైనకాలజిస్టును సంప్రదించి స్కానింగ్‌తో పాటు అవసరమైన పరీక్షలన్నీ చేయించుకోండి. సమస్య ఏంటో తెలిశాక తగిన చికిత్స తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఏ సమస్యా లేకపోతే కనుక, నొప్పి తగ్గడానికి పీరియడ్స్ సమయంలో రెండు నుంచి మూడు రోజులు మందులు వాడితే సరిపోతుంది. నా వయసు 29. ఇద్దరు పిల్లలు. రెండుసార్లూ నార్మల్ డెలివరీయే. కాకపోతే యోని దగ్గర కుట్లు పడ్డాయి. అప్పట్నుంచీ నా యోని వదులుగా అయిపోయింది. కలయిక సమయంలో అంగప్రవేశం జరిగినట్టు కూడా తెలియడం లేదు. మావారు కూడా విసుక్కుంటున్నారు. మళ్లీ నా యోని బిగుతుగా అవ్వాలంటే ఏం చేయాలి? - సునీత, చాదర్‌ఘాట్ కొందరి శరీర తత్వాన్ని బట్టి... సాధారణ కాన్పు సమయంలో బిడ్డ బరువు, సైజును బట్టి యోని కండరాలు సాగి, బిడ్డను బయటకు నెట్టుతాయి. కొందరిలో మాత్రం యోని కింది భాగంలో కొద్దిగా కట్ చేసి, బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కుట్లు వేయడం జరుగుతుంది. కొందరికి కాన్పు తర్వాత యోని కండరాలు పూర్తిగా కాకపోయినా, చాలావరకు సాధారణ స్థితికి వచ్చేస్తాయి. కానీ కొందరిలో, సాగిన యోని కండరాలు వాటి పటుత్వాన్ని కోల్పోతాయి. దానివల్ల యోని వదులవుతుంది. మీకు కలయిక సమయంలో మరీ ఇబ్బందిగా ఉంటే కనుక ఓసారి గైనకాలజిస్టును కలవండి. పెరినియోరఫీ అనే ఆపరేషన్ ద్వారా కండరాలను దగ్గరగా లాగి కుట్టేస్తారు. తద్వారా యోని మళ్లీ బిగుతుగా అయిపోతుంది. నా వయసు 32. పెళ్లై అయిదేళ్లు అయ్యింది. మూడు నెలల క్రితం మావారు అనారోగ్యం బారినపడితే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను. హెచ్ఐవీ పాజిటివ్ అని వచ్చింది. ఆయన చెడ్డవారు కాదు. కాకపోతే కాలేజీలో చదువు కున్నప్పుడు ఎవరో అమ్మాయికి దగ్గరయ్యారట. అలా వచ్చిందేమో అంటున్నారు. ఇన్నాళ్లూ కాపురం చేశాను కాబట్టి నాకూ ఎయిడ్స్ వచ్చి ఉంటుందా? వెంటనే తెలియాలంటే ఏ పరీక్ష చేయించుకోవాలి? ఒకవేళ నాకు వచ్చి ఉండక పోతే ఇకపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - పార్వతి, విజయనగరం మీవారికి హెచ్ఐవీ పాజిటివ్ ఉంది అంటే, ఆయన రక్తంలో హెచ్ఐవీ వైరస్ ఉందన్నమాట. ఈ వైరస్ రక్తం ద్వారా లేదా కలయిక ద్వారా మీకు వచ్చివుండే అవకాశాలు చాలానే ఉన్నాయి. కాబట్టి మీరు వెంటనే హెచ్ఐవీ రక్తపరీక్ష చేయించుకోండి. దానివల్ల మీకు హెచ్ఐవీ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. అదృష్టం కొద్దీ లేకపోతే... కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్ఐవీకి మందులు అందుబాటులో ఉంటున్నాయి. మీవారికి ఆ మందులు ఇప్పించండి. కలయిక సమయంలో మాత్రం తప్పనిసరిగా కండోమ్ వాడండి. అలాగే ఈ పరీక్షలో హెచ్ఐవీ లేదని తేలినా... ఆరు నెలల తర్వాత మరోసారి హెచ్ఐవీ పరీక్ష తప్పకుండా చేయించుకోండి. నా వయసు 18. చదువుకుంటున్నాను. ఎందుకో మొదట్నుంచీ నా వక్షోజాలు చాలా వదులుగా ఉంటాయి. మొన్నీమధ్య ఫ్రెండ్సందరం మాట్లాడుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకమ్మాయి ఒక మాట అంది. జారిపోయినట్టుగా ఉండే వక్షోజాలను చూస్తే మగవాళ్లకు అనుమానం వస్తుందట. అంతకుముందే ఎవరితోనో సంబంధం ఉందని అనుకుంటారట. అది నిజమేనా? రేపు నా భర్త కూడా నన్ను అలానే అనుమానిస్తే నా పరిస్థితి ఏమిటి? పరిష్కారం చెప్పండి. - మీనా, విజయవాడ మీరు ఎంత బరువు ఉన్నారో రాయలేదు. వక్షోజాలు వారి వారి శరీర తత్వాన్ని బట్టి కొందరికి బిగుతుగాను, బలహీనత వల్ల కొందరిలో వదులుగాను ఉంటాయి. అంతేకానీ ఎవరితోనో సంబంధం ఉండటం వల్ల అవి వదులు కావు. అనవసరమైన మాటలు విని కంగారు పడకుండా చదువు మీద శ్రద్ధ పెట్టండి. వక్షోజాల్లో పాలగ్రంథులు, కనెక్టివ్ టిష్యూ, కొవ్వు ఉంటాయి. కొవ్వు సరిపడినంత లేకపోవడం వల్ల కూడా పటుత్వం లేక వక్షోజాలు వదులుగా ఉండ వచ్చు. ఒకవేళ మీరు బరువు తక్కువగా ఉంటే... పాలు, పెరుగు, పప్పుధాన్యాలు, డ్రైఫ్రూట్స్, పండ్లతో కూడిన పౌష్టికాహారం తీసుకోండి. దానివల్ల అవి మళ్లీ బిగుతుగా తయారయ్యే అవకాశం ఉంది. నా వయసు 25. రెండేళ్లక్రితం పెళ్లయ్యింది. ఇంతవరకూ గర్భం దాల్చలేదు. ఈ మధ్యనే డాక్టర్‌కి చూపిస్తే... నా గర్భాశయంలో నీటి బుడగలు ఉన్నాయన్నారు. ఏవో మందులు వాడమంటే వాడుతున్నాను. అయితే ఎన్నాళ్లు ఇలా వాడాలి, ఎప్పటివి అవి తగ్గుతాయి అని అడిగితే డాక్టర్ కచ్చితంగా చెప్పడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. అసలు నాకు పిల్లలు పుడతారా? - వనజ, గుంటూరు గర్భాశయానికి ఇరువైపులా ఉండే అండాశయాల్లో హార్మోన్ల అసమతుల్యత, అధిక బరువు, జీవనశైలిలో మార్పులు, మానసిక ఒత్తిడి, జన్యుపరమైన మార్పులు... ఇలా ఎన్నో కారణాల వల్ల పాలిసిస్టిక్ ఓవరీస్ (నీటి తిత్తులు) ఏర్పడతాయి. ఇవి పదేళ్ల వయసు నుంచి నలభయ్యేళ్ల వయసు వారి వరకు ఎవరిలోనైనా ఏర్పడవచ్చు. వాటి వల్ల ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన లక్షణాలు కనిపిస్తాయి. పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, అవాంఛిత రోమాలు, గర్భం దాల్చడంలో ఇబ్బంది, అబార్షన్ అయిపోవడం వంటి సమస్యలు రావొచ్చు. సమస్యను బట్టి చికిత్స ఎంతకాలం అవసరం అనేది తెలుస్తుంది. ఎవరికీ కూడా మందుల వల్ల నీటి బుడగలు తగ్గిపోవు. కాకపోతే ఆరు నెలల పైన వాడటం వల్ల అవి ఇంకా పెరగకుండా చూడొచ్చు. వాటివల్ల వచ్చే హార్మోన్ల అసమతుల్యత కూడా తగ్గే అవకాశం ఉంది. మీరు ఎంత బరువు ఉన్నారో రాయలేదు. నీటి బుడగల వల్ల కొందరిలో అండం సక్రమంగా పెరగదు. కాబట్టి మీరు వ్యాయామం చేస్తూ, నీటి బుడగలు పెరగకుండా మందులు వాడుతూ ఉండాలి. అండం తయారవడానికి మందులు, అవసరమైతే ఇంజెక్షన్లు తీసుకుంటూ ఆరు నుంచి పన్నెండు నెలల వరకూ ప్రయత్నించవచ్చు. అయినా కూడా గర్భం రాకపోతే... లాపరోస్కోపి అనే చిన్న ఆపరేషన్ ద్వారా నీటి బుడగలను తొలగించుకుని, తర్వాత మందులు వాడితే గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి. - డా॥వేనాటి శోభ -
ఆ సమయంలో నొప్పి ఎందుకు?!
సందేహం నా వయసు 31. నేను కొన్ని నెలల క్రితం వ్యక్తిగత కారణాల వల్ల నాలుగవ నెలలో అబార్షన్ చేయించుకున్నాను. ఆ తర్వాతి నుంచి నా వక్షోజాలు కాస్త బాధ పెడుతున్నాయి. నిజానికి అబార్షన్ అయ్యేవరకూ అవి చాలా నొప్పిగా ఉన్నాయి. అబార్షన్ అయ్యాక నొప్పి తగ్గింది కానీ ఒక్కోసారి చురుక్కు చురుక్కుమంటున్న ఫీలింగ్. నిపుల్స్ కూడా లాగుతున్నట్టు, మండుతున్నట్టు అనిపిస్తోంది. ఇదేమైనా అనారోగ్యమా? క్యాన్సర్ లాంటి వ్యాధుల లక్షణమా? నాకు చాలా భయంగా ఉంది. కలయిక సమయంలో నేను వాటిని ముట్టుకోనివ్వడం లేదని మావారు విసుక్కుంటున్నారు కూడా. ఇప్పుడు నన్నేం చేయమంటారు? - సౌజన్య, భద్రాచలం గర్భం దాల్చిన రెండు మూడు నెలల వరకు చాలామందిలో హార్మోన్ల మార్పుల వల్ల రొమ్ములు బరువుగా, నొప్పిగా ఉండటం అన్నది సాధారణమే. అబార్షన్ తర్వాత కొంతమంది రొమ్ముల్లో పాలు తయారయ్యే అవకాశం కూడా ఉంది. దానివల్ల కొన్ని రోజులు నొప్పిగా ఉంటాయి. తర్వాత పాలు బయటికి వచ్చేస్తాయి. కొందరిలో లోపలే కరిగిపోతాయి. కాబట్టి మీ నొప్పి కొన్ని రోజులు ఉండి తగ్గిపోతుంది. భయపడాల్సిన అవసరం లేదు. అలాగే కొందరిలో పీరియడ్స్ వచ్చే పది, పదిహేను రోజుల ముందు నుంచి ప్రొజెస్టరాన్ మరియు ఇతర హార్మోన్లలో మార్పుల వల్ల రొమ్ముల్లో నీరు చేరుతుంది. దానివల్ల రొమ్ములు బరువుగా, నొప్పిగా, సలపరంగా ఉండవచ్చు. కొందరిలో ఫైబ్రో అడినోమా అనే చిన్న చిన్న హాని లేని గడ్డలు ఉండవచ్చు. మరికొందరిలో ఇన్ఫెక్షన్ లేక ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ ఉండవచ్చు. కాబట్టి ఒక్కసారి డాక్టర్ని సంప్రదించండి. అవసరమైతే అల్ట్రా సౌండ్ బ్రెస్ట్, మామోగ్రామ్ చేయించుకుని, కారణాన్ని బట్టి చికిత్స చేయించుకోవచ్చు. మీ ఇబ్బంది తెలియక మీవారు విసుక్కుంటున్నారేమో. ముందు ఆయనకి విషయం అర్థమయ్యేలా చెప్పండి. నా వయసు 29. ఉద్యోగరీత్యా నేను, మావారు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నాం. నెలకి ఒకసారో రెండుసార్లో కలుస్తాం. ఒక్కోసారి రెండేసి నెలలు కూడా అవుతుంటుంది. అయితే కలుసుకున్నప్పుడు చాలా సంతోషంగా గడుపుతాం. రోజుకు రెండు మూడుసార్లు కూడా శారీరకంగా కలుస్తాం. అయితే ఈ మధ్య నాకొక సమస్య వచ్చింది. మొదటిసారి సెక్స్ చేస్తున్నప్పుడు ఎందుకో చాలా నొప్పిగా ఉంటోంది. యోని సలుపుతున్నట్టుగా అనిపిస్తోంది. మళ్లీ రెండోసారి అలా ఉండటం లేదు. మొదటిసారే అలా అవుతోంది. దానికి కారణం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఇదేమైనా అనారోగ్యమా? - నీరజ, విజయవాడ ఏ వస్తువు అయినా చాలా రోజులు వాడకపోతే ఎలా బిగుతుగా అయిపోతుందో... యోని కూడా అలాగే అయిపోతుంది. చాలా రోజులు కలవకుండా ఉండటం వల్ల కొందరిలో యోని కండరాలు బిగుసుకున్నట్లు అయిపోతాయి. లోపల తడి కూడా తగ్గిపోతుంది. దాంతో కలయిక సమయంలో మొదట కాస్త నొప్పిగా ఉంటుంది. తర్వాత కండరాలు వదులయ్యి నొప్పి తగ్గుతుంది. కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు. కలిసిన ప్రతిసారీ నొప్పి ఉండటం లేదు కాబట్టి భయపడాల్సిన అవసరమూ లేదు. నా వయసు 38. ఏడేళ్ల క్రితం నా భర్త చనిపోయారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లని పెంచడానికి నేనేవో తంటాలు పడుతుంటే మా బంధువు ఒకాయన సాయంగా నిలిచారు. ఆయనకు నేనంటే చాలా ఇష్టం. నాకూ తనంటే అభిమానమే. అందుకే ఇద్దరం శారీరకంగా దగ్గరయ్యాం. కానీ ఎందుకో ఈ మధ్య కలిసినప్పుడల్లా పొత్తి కడుపులో నొప్పి వస్తోంది. కారణం ఏమై ఉంటుంది? - ఓ సోదరి, నిజామాబాద్ పొత్తి కడుపులో నొప్పి రావడానికి గర్భాశంయలో ఇన్ఫెక్షన్ లేక గడ్డలు ఉండటం, అండాశయంలో గడ్డలు ఉండటం, లేదంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వంటివేవైనా కారణం కావచ్చు. పరీక్ష చేస్తే తప్ప ఆ కారణం ఏమిటో తెలియదు. కాబట్టి ఓసారి గైనకాలజిస్టును కలిసి రక్త, మూత్ర పరీక్షలు, స్కానింగ్ చేయించుకోండి. కారణం తెలిశాక చికిత్స చేయించుకోవచ్చు. అయితే ఒకటి. ఇలాంటి సంబంధాలు అంత మంచివి కావు. ఒకవేళ ఆయనకు మీతో మాత్రమే కాక వేరేవారితో కూడా శారీరక సంబంధం ఉంటే, తద్వారా ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరికి సోకుతాయి. సుఖ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. లేక ఆయన మంచివారు, మీరు తప్ప ఆయన జీవితంలో ఎవరూ లేరు అనుకుంటే మీ వాళ్లందరినీ ఒప్పించి చక్కగా పెళ్లి చేసుకోండి. అది మీకు అన్నివిధాలా మంచిది. నాకు ఈ మధ్యనే పెళ్లయ్యింది. మేమిద్దరం సెక్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ మావారు ఆనల్ సెక్స్ కావాలని అడుగుతున్నారు. కానీ నాకు ఎందుకో ఇష్టం లేదు. ఆ విషయం చెప్పినా ఆయన బలవంతం చేస్తున్నారు. అసలు ఆనల్ సెక్స్ చేయవచ్చా? దానివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? - మాధురి, భీమవరం ఆనల్ సెక్స్ (మలద్వారం ద్వారా రతి జరపడం) అనేది విపరీత కోరికలకు తార్కాణం. అంటే పర్వెర్షన్ అన్నమాట. దీనివల్ల మొదట్లో బ్లీడింగ్, నొప్పి ఉండవచ్చు. తర్వాత కాస్త ఫ్రీ అయినా కూడా మగవారికి తప్ప ఆడవారికి పెద్దగా అనుభూతి కలగదనేది వాస్తవం. అది మాత్రమే కాక... దీనివల్ల బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పాటు సుఖవ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకూ ఆనల్ సెక్స్ జోలికి పోకపోవడమే మంచిది. మీవారికి బహుశా దానివల్ల వచ్చే సమస్యలు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి ఆయనకు అన్నీ వివరించండి. కన్విన్స్ కాకపోతే ఓసారి కౌన్సెలింగ్ ఇప్పించండి. డా॥వేనాటి శోభ