గోదావరి స్నానానికి వెళ్లి ఇద్దరి గల్లంతు
వాడపల్లి (ఆత్రేయపురం), న్యూస్‌లైన్ : ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామం గౌతమీ గోదావరి గట్టు పుష్కరరేవులో ఇద్దరు స్నానానికి వెళ్లి మంగళవారం సాయంత్రం గల్లంతయ్యారు.
రాజమండ్రి లాలాచెరువు పోలీస్ క్వార్టర్స్ వెనక వైపు నివాసం ఉండే దొడ్డ శ్రీనివాస్ (28) అతని మేనల్లుడు సూరన్నపూడి నానిబాబు (20) ఆత్రేయపురం మండలం వాడపల్లి పెయింటింగ్ పనుల నిమిత్తం వచ్చారు. సహకార సంఘ ఉద్యోగి సాదనాల రామకృష్ణ ఇంటికి పెయింటింగ్ వేసిన అనంతరం మంగళవారం సాయంత్రం గోదావరి వద్ద పుష్కరరేవులోకి స్నానానికి వెళ్లారు.
స్నానం చేస్తూ ఇద్దరూ కాలుజారి గల్లంతయ్యారు. రాత్రి 8 గంటల వరకు వారి అచూకీ కోసం గోదావరిలో పడవల సాయంతో స్థానికులు గాలించారు. ఫలితం లేక పోవడంతో సమాచారాన్ని రాజమండ్రిలోని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దొడ్డి వీరన్నకు ఒక కుమారుడు ఉన్నారు.