breaking news
dmho venkataramana
-
2న పల్స్‌పోలియో
అనంతపురం మెడికల్ : పక్కా ప్రణాళిక రూపొందించుకుని ఏప్రిల్ 2న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిలా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ వెంకటరమణ సూచించారు. శనివారం పల్స్ పోలియోకు సంబంధించి వైద్యాధికారులతో డీఎంహెచ్ఓ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, పీపీ యూనిట్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యులకు ఆయన సూచనలు చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలన్నారు. వేసవి నేపథ్యంలో వ్యాక్సిన్ శీతలీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 7 నుంచి 14 వరకు డీపీటీ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వడదెబ్బ తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆస్పత్రులతో పాటు ఉపాధి పనులు జరిగే ప్రాంతాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అంతకుముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ కర్నూలు విభాగం సర్వెలైన్స్ వైద్యాధికారి పవన్‌కుమార్ వైద్యులకు పలు సూచనలు చేశారు. పోలియో కార్యక్రమం నిర్వహణ, నివేదికలు పంపే తీరును వివరించారు. కార్యక్రమంలో డీటీసీఓ సుధీర్‌బాబు, డీఐఓ పురుషోత్తం, డీపీఎంఓ అనిల్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ యుగంధర్, డెమో హరిలీలాకుమార్, ఎస్ఓ మారుతిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
100.4 శాతం పల్స్‌పోలియో
అనంతపురం మెడికల్ : జిల్లా వ్యాప్తంగా మూడ్రోజుల్లో 100.4 శాతం పల్స్‌పోలియో నమోదైనట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. మొత్తం 4,50,545 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 4,52,334 మందికి వేశామన్నారు. 19,013 మంది చిన్నారులకు వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేసినట్లు తెలిపారు. -
సిబ్బందిని తొలగించం
అనంతపురం సిటీ: అర్బన్ హెల్త్ సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎవరిని తొలగించడం లేదని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి ఉత్తర్వులు అందాయన్నారు. చాలా ప్రాంతాల్లో అర్బన్ హెల్త్ సెంటర్స్ అపోలో హాస్పిటల్స్ చేతికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో అందులో పని చేసే సిబ్బంది ఉద్యోగాలు పోతాయని చెప్పడంతో వారంతా ఆందోళన చెందుతున్న విషయం ముఖ్య కార్యదర్శి దృష్టికి వెళ్లిందన్నారు. దీంతో కేవలం సిబ్బంది ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్న భరోసాను ఇవ్వాలని జిల్లా వైద్యాధికారులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారని చెప్పారు.