breaking news
Divyangula
-
దివ్యాంగులపై మానవత్వం లేదా బాబూ?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమిటీ, అన్ని జిల్లాల అధ్యక్షుల ఆత్మీయ సమావేశం జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి, దివ్యాంగుల విభాగం నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆయన ఏమన్నారంటే..దివ్యాంగులకు సంబంధించిన ప్రతి సమస్యపై వైఎస్ జగన్ క్షుణ్ణంగా తెలుసుకుంటూనే ఉన్నారు. వైఎస్ జగన్ హయాంలో నిస్సహాయులుగా ఉన్న వర్గాలకు, దివ్యాంగులకు సమాన హక్కులు కల్పించడం, అంతిమంగా దివ్యాంగులకు ఎలా లబ్ధిచేయాలని తపించారు. సాంకేతిక కారణాలతో దివ్యాంగులను ఇబ్బంది పెట్టకుండా, నిబంధనలు సరళీకృతం చేయాలని, అవసరమైన సవరణలు చేశారు. క్యాలెండర్ పెట్టుకుని జగనన్న పాలనలో ఏ నెలలో ఏం వస్తుందని సంక్షేమ లబ్ధిదారులకు హక్కుగా లభించేలా చేశారు...పాలన అంటే ఒక సార్ధకత దానిని నాడు వైఎస్సార్.. ఆ తర్వాత వైఎస్ జగన్ హయాంలో చూశారు. అసమానతలు తొలగించి రాజ్యాంగ స్పూర్తిని అమలు చేసింది వైఎస్ జగన్ పాలనలోనే. మానవత్వంతో పాలన సాగించడం అనేది చూశాం. వైఎస్సార్సీపీ అనేది ప్రజల్లో నుంచి వచ్చిన పార్టీ కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళుతుంది. వైఎస్ జగన్ పాలనకు పూర్తి వ్యతిరేకంగా చంద్రబాబు పాలన సాగుతుంది. ఏ రకంగా వడపోసి సంక్షేమ పథకాల లబ్ధిదారులను తగ్గించాలనేది చంద్రబాబు లక్ష్యం. చంద్రబాబు సంక్షేమం అంతా తన కోసం, అయిన వారికే తప్ప నిజమైన లబ్ధిదారులకు కాదు. ఎల్లో మీడియా, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు చంద్రబాబు చేతిలో ఉన్నాయి.ఊత కర్రల సాయంతో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. దివ్యాంగుల విషయంలో చంద్రబాబు రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సామాజిక భద్రత అనేది లేకపోతే పేద వర్గాలు ఏమవ్వాలి. దివ్యాంగులకు పింఛన్లు అవసరమా అనే చర్చ లేవనెత్తారు చంద్రబాబు. దానికి ఎల్లో మీడియా బాకా ఊదుతోంది. రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను వేధిస్తున్నారు. వికలాంగుల విషయంలో జగన్ ఏనాడు పార్టీలు చూడలేదు. వారికి ఎలా చేయూత ఇవ్వాలి, వారు ఆత్మగౌరవంతో ఎలా బతకాలి అని ఆలోచించారు. వైఎస్ జగన్ పాలన ఈ ఐదేళ్ళు కొనసాగి ఉంటే ఒక కొత్త జనరేషన్ తయారయ్యేది. ఒక మంచి వ్యవస్థలను జగన్ రూపొందిస్తే.. చంద్రబాబు దానిని కుప్పకూల్చారు.వైఎస్ జగన్ పాలనలో నాడు-నేడు పేరుతో స్కూల్స్ అభివృద్ధి జరిగితే ఇప్పుడు ఏం జరుగుతుంది. కురుపాం, తురకపాలెం ఘటనలే ఇందుకు నిదర్శనం. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదా.? ప్రభుత్వం దృష్టికి ఇవి రాలేదా..? ఇవి వైఫల్యాలు కావా..? పాలన అనేది ఒక యజ్ఞంలా వైఎస్ జగన్ భావించారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాల డెలివరీ పెడితే చంద్రబాబు లిక్కర్ షాప్‌లు, బెల్ట్ షాపులు పెట్టి లిక్కర్ డెలివరీ చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను కూడా రెడ్ బుక్ పేరుతో నాశనం చేశారు. మళ్ళీ అధికారం రాదని తెలిసి చంద్రబాబు ఆయన కుమారుడు బరితెగించి వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఒక బలీయమైన శక్తిగా రూపొందింది. అందుకు ఉదాహరణే జగన్ పర్యటనలకు వస్తున్న లక్షలాది మంది జనమే. కోటి సంతకాల సేకరణలో మీ విభాగం కూడా సమన్వయంతో పనిచేయాలి. మీ పరిధిలో ఉన్నంత మేరకు వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషిచేయండి.కూటమి సర్కార్ దివ్యాంగులను మోసగించింది: మేరుగ నాగార్జునదేశ చరిత్ర లోనే దివ్యాంగులకు భరోసా, ఆత్మస్ధైర్యం కల్పించింది జగనన్న పాలనలోనే. ఏపీలో కూటమి ప్రభుత్వం దివ్వాంగులను మోసగించింది. వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను ఆసుపత్రుల చుట్టు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు. పెన్షన్ల రీవెరిఫికేషన్ పేరుతో వారికి నరకయాతన చూపుతున్నారు. చంద్రబాబు ఇదేనా మానవత్వం. చంద్రబాబు దివ్యాంగుల పట్ల నువ్వు చేస్తున్నది మోసం, దగా కాదా అని ప్రశ్నిస్తున్నాం.దివ్యాంగులకు ఇచ్చిన హామీ ఏంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి?: పులిపాటి దుర్గారెడ్డిచంద్రబాబు దివ్యాంగులను నిలువునా మోసం చేశారు. దివ్యాంగుల పెన్షన్లలో కోతలు, ఆంక్షలతో వేధిస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు నువ్వు దివ్యాంగులకు ఇచ్చిన హామీ ఏంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి. లక్షల మంది దివ్యాంగలకు నోటీసులు ఇచ్చి మా దివ్యాంగులను దొంగలుగా చిత్రీకరిస్తున్నావు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశావ్. జగన్ హయాంలో తలెత్తుకు తిరిగిన మేమంతా ఇప్పుడు ఆత్మాభిమానం దెబ్బతిని బతుకీడుస్తున్నాం. అనేకమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం మీకు సమంజసమా అని నిలదీస్తున్నాం. -
దేశానికి కాంగ్రెస్ చోర్ టీం
సాక్షి, హైదరాబాద్: దేశానికి కాంగ్రెస్ పార్టీ ‘సీ టీం’ (చోర్ టీమ్) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు ఆరోపించారు. తమ పార్టీ బీజేపీకి ‘బీ–టీం’ అన్న కాంగ్రెస్ విమర్శలపై ఆయన మండిపడ్డారు. కుంభకోణాలతో ఆకాశం నుంచి పాతాళం దాకా దోచుకున్న చరిత్ర కాంగ్రెస్‌దని దుయ్యబట్టారు. గురువారం తెలంగాణ భవన్లో జరిగిన ‘దివ్యాంగుల కృతజ్ఞత సభ’లో కేటీఆర్ మాట్లాడారు. ‘రాహుల్ గాంధీ రామప్ప గుడికి వచ్చి గొంగడిలో వెంట్రుకలు ఏరినట్లు కుటు ంబ పాలన గురించి మాట్లాడారు. ఆయన లీడర్ కాదు.. ఇతరులు రాసింది చదివే రీడర్. రేవంత్ లాంటి ఒక 420ని, గజదొంగను పక్కన పెట్టుకొని రాహుల్ మాట్లాడటం సిగ్గుచేటు. దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్‌ను మించిన గజదొంగ రేవంత్. నాడు నోటుకు ఓటు.. నేడు సీటుకు రేటు. ఒకవేళ ఎన్నికల్లో 10, 12 మంది ఎమ్మెల్యేలు గెలిచినా రాష్ట్ర కాంగ్రెస్‌ను బీజేపీకి గంపగుత్తగా రేవంత్ అమ్మేయడం ఖాయం’ అని కేటీఆర్ విమర్శించారు. రూ. 80 వేల కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో విపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఎక్కడైనా రూ. లక్ష కోట్ల అవినీతి జరుగు తుందా? అని ప్రశ్నించారు. అవినీతి కేసుల్లో సోనియా, రాహుల్ విచారణ ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. మోదీ, రాహుల్‌కు తెలంగాణ పౌరుషం చూపాలి.. ‘తెలంగాణ ఉద్యమంలో ప్రజల మీదకు తుపాకీతో వెళ్లిన రైఫిల్‌రెడ్డి ఒకరైతే... రాజీనామా చేయకుండా అమెరికా పారిపోయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మరొకరు. ఇలాంటి వారితో కేసీఆర్‌కు పోటీనా? ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి బుద్ధిచెప్పేలా తెలంగాణ పౌరుషం చూపాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ ఈ శతాబ్దంలో ఒకే ఒక్కడు.. ‘రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నా రు. కేసీఆర్ లాంటి నాయకుడు శతాబ్దానికి ఒకరు వస్తారు. ఆయన ప్రభుత్వాన్ని వదులుకోవద్దు. దివ్యాంగుల సంక్షేమానికి తొమ్మిదిన్నరేళ్లలో రూ. 10,300 కోట్లు ఖర్చు చేశాం. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్ గఢ్‌లో దివ్యాంగులకు రూ. 200 చొప్పున, మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో రూ. 500 నుంచి రూ. వె య్యి వరకు మాత్రమే పింఛన్ ఇస్తున్నారు. మేం మ ళ్లీ అధికారంలోకి రాగానే ప్రస్తుతమున్న రూ. 4,016 పింఛన్‌ను రూ. 6,016కు పెంచుతాం. దివ్యాం గులకు ఊత కర్రలా నిలిచిన కేసీఆర్‌కు ఎన్నికల్లో అండగా నిలవండి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కె.వాసుదే వరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, సుధీర్‌రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నా థం, మాజీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్
రాష్ట్రంలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది. ఇందుకు తగ్గ ఉత్తర్వులు మంగళవారం జారీ అయ్యా యి. ఈ మేరకు అంధులకు ఒక శాతం, బధిరులకు ఒక శాతం, డిసేబుల్డ్, మానసిక వికలాం గులకు ఒక్కొక్క శాతం అమలు చేయనున్నారు. ► అమల్లో రిజర్వేషన్ ► ప్రభుత్వం ఉత్తర్వులు సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉద్యోగ నియామకాల్లో మూడు శాతం రిజర్వేషన్ వర్తింప చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అమ్మ ఆశయ సాధన లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం ఆ రిజర్వేషన్ పెంపునకు చర్యలు తీసుకుంది. దివ్యాం గుల హక్కుల చట్టం 2016 మేరకు వారికి నాలుగు శాతం రిజర్వేషన్ వర్తింప చేయడానికి నిర్ణయించారు. ఇందుకు తగ్గ కసరత్తులు ముగియడంతో సీఎం పళని స్వామి ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకు తగ్గ ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ మేరకు..1981 నుంచి రాష్ట్రం లోని దివ్యాంగుల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్‌ను అమలు చేస్తూ వస్తున్నట్టు వివరించారు. దివ్యాంగులకు సంక్షేమ బోర్డు, వారికి సదుపాయాల మెరుగు లక్ష్యంగా ముందుకు సాగడమే కాకుండా, ఆ బోర్డు, శాఖలకు ప్రత్యేకంగా కొత్త భవనాల నిర్మాణం సాగినట్టు పేర్కొన్నారు. ఉద్యోగ పరంగా దివ్యాంగులకు మరింత అవకాశం కల్పించడం లక్ష్యంగా ప్రస్తుతం నాలుగు శాతం రిజర్వేషన్ అమల్లోకి తీసుకొచ్చామన్నారు. దీనిని నాలుగు విభాగాలు విభజించడం జరిగిందని వివరించారు. అంధులకు ఒక శాతం, బధిరులకు మరో శాతం, కాళ్లు, చేతులు దెబ్బ తిన్న వారికి, మానసిక వికలాంగులకు తలా ఓ శాతం చొప్పున రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ఈ రిజర్వేషన్ అమలు వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ప్రకటించారు. ముందుగా, సచివాలయంలో సీఎం పళనిస్వామి నేతృత్వంలో ప్రత్యేక పథకాలు, గ్రామీణాభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమ శాఖ విభాగాలతో సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో ఆయా శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ పాల్గొన్నారు.