breaking news
DIG Gangadhar
-
పోలీసు సర్వీస్ రూల్స్‌లో మార్పులు!
ఉమ్మడి సర్వీసు రూల్స్ కారణంగా సమస్యలు ⇒ అనవసరపు విభాగాలకు స్వస్తి చెప్పాలని సర్కారు యోచన ⇒ కొత్త రూల్స్‌కోసం రిటైర్డ్ డీఐజీ గంగాధర్ నేతృత్వంలో కమిటీ సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖలో సర్వీసు నిబంధనలను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రూల్స్‌నే అన్వయించుకున్న పోలీసు శాఖ.. తాజాగా కొత్త సర్వీసు నిబంధనలతో ముందుకు రానుంది. డీజీపీ అనురాగ్‌శర్మ దీనికి సంబం ధించి రిటైర్డ్ డీఐజీ గంగాధర్ నేతృత్వంలో రిటైర్డ్ అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, రిటైర్డ్ ఏవోలు వెంకయ్య, దశరథ్‌రెడ్డి, ఆదినారా య ణ, యూసఫ్ మొయినుద్దీన్, రిటైర్డ్ సూపరిం టెండెంట్ విశ్వం సభ్యులుగా ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ ప్రస్తుత సర్వీసు రూల్స్‌ను పరిశీలించి.. మార్పులు, కొత్త నిబం ధనల రూపకల్పనకు సిఫార్సులు చేస్తుంది. ఆ రూల్స్‌తో ఇబ్బందులు: రాష్ట్ర విభజన తర్వాత అన్వయించుకున్న ఏపీ పోలీసు సర్వీసు రూల్స్‌తో పలు సమస్యలు నెలకొన్నాయి. నియామకాలు, పదోన్నతులు, సర్వీసు ప్రయో జనాలు, ఇంక్రిమెంట్లు వంటి 16 రకాల సమస్యలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హోం శాఖ సర్వీసు రూల్స్‌ను సమీక్షించి.. రాష్ట్ర పోలీసు అడ్మిన్ వ్యవహా రాలు, ఆపరేషన్స్ వ్యవహారాలకు తగ్గట్టుగా రూపొందించుకోవాలని నిర్ణయించింది. అనవసరపు విభాగాలకు స్వస్తి ఉమ్మడి రాష్ట్రంలో 256కు పైగా ఐపీఎస్ అధికారులు పనిచేసే పోస్టులుండేవి. దాంతో అవసరమున్నా, లేకపోయినా ప్రతి విభాగా నికి ఐజీ నుంచి డీజీ స్థాయి హోదా వరకు ఉన్న అధికారులకు పోస్టులు ఏర్పాటు చేయా ల్సి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ ఇదే సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో సర్వీసు రూల్స్‌పై ఏర్పాటు చేసిన కమిటీకే.. పోలీసు శాఖలోని అనవసరపు విభాగాలను తొలగించే పని కూడా అప్పగిం చారు. ఒకే తరహా పనులు చేసే రెండు మూడు విభాగాలుంటే వాటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సూచించారు. తొలగిపోనున్న కీలక సమస్యలు రాష్ట్ర విభజనలో ఇప్పటివరకు సివిల్ డీఎస్పీ, అదనపు ఎస్పీలు, నాన్ కేడర్ ఎస్పీల విభజన పూర్తి కాలేదు. డీఎస్పీ స్థాయి అధికారుల సీనియారిటీ జాబితా తప్పులతడకగా ఉండటంతో ఇప్పటివరకు కమల్‌నాథన్ కమిటీ విభజన చేయలేక పోయింది. పైగా కొందరు అధికారులు కోర్టుల నుంచి స్టే తీసుకువచ్చారు. సర్వీసు రూల్స్‌లో లోపాలే ఈ పరిస్థితికి కారణమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల రూల్స్ మారిస్తే సమస్యలు తొలగిపోయే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. కమిటీ దృష్టి సారించే అంశాలివే... సర్వీసు రూల్స్ కమిటీ మొత్తం 34 అంశాలను సమీక్షించి, నూతన నిబంధ నలను రూపొందించనుంది. స్పెషల్ పోలీస్ బెటాలియన్లలోని కానిస్టేబుల్ నుంచి డీఐజీ వరకు ఉన్న రూల్స్ మార్పు; ఆర్మ్డ్ రిజర్వ్‌లోని రిజర్వ్ ఇన్స్పెక్టర్ నుంచి కమాండెంట్ వరకు రూల్స్ సమీక్ష, మార్పు; పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్‌లో ఇన్స్పెక్టర్ నుంచి డైరెక్టర్ హోదా వరకు ఉన్న నిబంధనలు, సివిల్ విభాగంలో కానిస్టేబుల్ నుంచి నాన్ కేడర్ ఎస్పీ వరకు రూల్స్‌ను సమీక్షించనున్నారు. అదే విధంగా సీపీఎల్ అంబర్పేట్, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, ఇంటలిజెన్స్ విభాగం, ప్రింటింగ్ విభాగం, పోలీసు అకాడమీ, పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్, పోలీస్ లీగల్ అండ్ మెడికల్ సర్వీ సెస్, పోలీస్ సెక్రటేరియట్ ఎస్టాబ్లిష్మెం ట్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ), పోలీస్ కమ్యూనికేషన్స్, సబార్డి నేట్ రూల్స్, పీటీవో సబార్డినేట్ రూల్స్, ఇంటలిజెన్స్ సబార్డినేట్ రూల్స్, ఏపీ పోలీస్ మాన్యువల్, స్పెషల్ పోలీస్ మాన్యువల్, కంప్యూటర్స్, సీఐడీ అడ్‌హక్ రూల్స్ 1981, ఏపీ మినిస్టీరియల్ సర్వీసు రూల్స్‌లను పూర్తి స్థాయిలో సమీక్షించి నూతన నిబంధనలను సిఫారసు చేసే అవకాశముంది. -
మావోయిస్టుల కదలికలు లేవు
నల్లగొండ క్రైం : జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేవని హైదరాబాద్ రేంజ్ డీఐజీ గంగాధర్ తెలిపారు. అక్కడక్కడ మావోయిస్టుల పేరు తో వెలుస్తున్న పోస్టర్లు సానుభూతిపరుల పనేనని, ప్రజలు ఆందోళన చెందవద్దన్నా రు. గురువారం జిల్లా పరిశీలనకు వచ్చిన ఆయన ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నేరాలను అదుపు చేసేందుకు పోలీస్‌శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే నగరాలు, జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోని ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. సీసీ కెమెరాలతో నిందితులను త్వరితగతిన గుర్తించేందుకు వీలుంటుందన్నారు. ఇందు కు ఇటీవల రాష్ట్ర రాజధాని సీసీ కెమెరాలతో ఛేదించిన కేసులను ఉదహరించారు. వీటి తో రోడ్డు ప్రమాదాల తీరును కూడా తెలుసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ప్రజలతో స్నే హపూర్వకంగా వ్యవహారించాలని సూచి ంచారు. మహిళలపై అత్యాచారాలను నిరోధించేందుకు ‘షి’ కమిటీ నియమించినట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా నూతనచట్టం తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తామన్నారు. పోలీస్స్టేషన్లను ఏబీసీడీలుగా విభజించి వాటి నిర్వహణకు నిధులు కేటాయిస్తామన్నారు. సమావేశంలో ఎస్పీ.ప్రభాకర్‌రావు, ఓఎస్డీ రాధాకిషన్‌రావు, డీఎస్పీలు ఉన్నారు. ప్రతి పోలీసు బాధ్యతగా వ్యవహరించాలి ప్రతి పోలీసు బాధ్యతగా వ్యవహరించాలని డీఐజీ పోలీసు అధికారులను ఆదేశించారు. డీఎస్పీలు, సీఐలతో ఆయన సమావేశం నిర్వహించి శాంతిభద్రతలు నేరాల సంఘటనలపై సమీక్ష నిర్వహించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రైవేటు సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. నేర సంఘటనలను నిరోధించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.అంతకు ముం దు ఎస్పీ కార్యాలయంలో పోలీసులతో గౌరవ వందనం స్వీకరించారు. సమావేశంలో డీఎస్పీ, సీఐలు పాల్గొన్నారు. విద్యుదుత్పాదక కేంద్రాల సందర్శన నాగార్జునసాగర్ : సాగర్‌లోని విద్యుదుత్పాదక కేంద్రాలను గురువారం సాయంత్రం డీఐజీ గంగాధర్, ఎస్పీ ప్రభాకర్‌రావు సందర్శించారు. రాయలసీమ ప్రాతానికి చెందిన రాజకీయ నాయకులు విద్యుదుత్పాదక కేంద్రాలను బ్లాక్చేస్తావ ఇటీవల హెచ్చరించడంతో ఎగువన ఉన్న శ్రీశైలం,జూరాల ప్రాంతాల్లో సెక్యురిటీని భారీగా పెంచారు. నిఘా విభాగం సమాచారం మేరకు నాగార్జునసాగర్‌లో సెక్యురిటీ అవసరాలను పరిశీలించడానికి డీఐజీ సందర్శించినట్లు సమాచారం. ముందుగా ప్రధాన విద్యుదుత్పాదక కేంద్రాన్ని సంద ర్శించి విద్యుదుత్పాదన వివరాలు, సెక్యురిటీ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎడమ కాలువపై ఉన్న విద్యుదుత్పాదక కేంద్రంతో పాటు హెడ్‌రెగ్యులేటర్ తదితర ప్రాంతాలను సందర్శించారు. ఈయన వెంట మిర్యాలగూడ డీఎస్పీ సందీప్, హాలియా సీఐ పార్థసారథి, ఎస్ఐ రజనీకర్ దేవరకొండ ఎస్బీ హెడ్‌కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి ఉన్నారు.