breaking news
dbt scheme
-
డిజిటల్ సంస్కరణలకు జగన్ మోడల్‌ను అప్లై చేస్తే..
సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసే రూపాయిలో.. ప్రజలకు చేరేది కేవలం 15 పైసలు మాత్రమే. మధ్యలో అవినీతి, పరిపాలనా ఖర్చులే అందుకు కారణాలుగా ఉన్నాయ్.. ఈ మాట ఒకప్పడు ప్రధాని హోదాలో రాజీవ్ గాంధీ చేసింది. తరువాతి దశాబ్దాల్లో, సంక్షేమ పథకాలలో లీకేజీలను తగ్గించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇన్నేళ్లు గడిచాక డిజిటల్ విప్లవం కారణంలో ఆ పరిస్థితిలో క్రమక్రమంగా మార్పు కనిపిస్తోంది.తప్పుడు క్లెయిమ్స్, ప్రజా సంక్షేమ పథకాలలో అవినీతి.. అర్హత లేని లబ్ధిదారులు అనేవి ఇందులో ప్రదానంగా సమస్యలు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1–3 ట్రిలియన్ డాలర్ల వరకు ఆ నష్టం జరుగుతోంది. అయితే.. దీనిని తగ్గించడానికి భారత్ సహా అనే దేశాలు ఏఐ, డిజిటల్ ఐడెంటిటీ, ప్రాసెస్ రీడిజైన్ వంటి పద్ధతులను పాటిస్తూ మెరుగైన ఫలితాలు రాబట్టుకోలుగుతున్నాయి.ఆయా దేశాల్లో..ఈ ఏడాది బీసీజీ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. యూఎస్ మెడికెయిడ్(అమెరికా ఫెడరల్ ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం) ఏఐని ఉపయోగించి తప్పుడు క్లెయిమ్స్‌ను తప్పించుకుని 1 శాతం ఖర్చు.. అంటే దాదాపు 9 బిలియన్ డాలర్ల దాకా ఆదా చేసుకోగలిగింది. ఆసియా-ఫసిఫిక్ రీజియన్లలో డాక్టర్లు పేషెంట్లకు అత్యధికంగా యాంటీబయటిక్స్ను సూచించిన విషయాన్ని డాటా బేస్ ఆధారంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తించింది. ఆ వెంటనే వైద్యులను కంపేరిజన్ లేఖల ద్వారా అప్రమత్తం చేసింది. దీంతో ఒక ఏడాదిలోనే అలాంటి ప్రిస్క్రిప్షన్లలో 12 శాతం తగ్గుదల కనిపించింది.సింగపూర్‌లో ప్రజా సంక్షేమ పథకాల కోసం ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ (చాట్‌బాట్/డిజిటల్ సహాయకుడు) ప్రవేశపెట్టారు. దీంతో కాల్ సెంటర్లకు కాకుండా.. ప్రజలు ఏఐ అసిస్టెంట్ ద్వారా నేరుగా సమాధానాలు పొందగలిగారు. ఈ ప్రభావంతో ఫోన్ కాల్స్ సంఖ్య 50 శాతానికి తగ్గింది. ప్రభుత్వానికి ఖర్చు తగ్గడంతో పాటు ప్రజలకు సమాచారం అందడం సులభతరం అయింది.కెనడా రెవెన్యూ ఏజెన్సీ.. ఏఐను ఉపయోగిస్తూ ట్యాక్స్ మోసాలకు చెక్ పెడుతోంది. యునైటెడ్ కింగ్డమ్లో డిపార్ట్మెంట్ ఫర్ వర్క్ అండ్ పెన్షన్స్(DWP) డేటా ఆధారిత ప్లాట్‌ఫారమ్‌ను అందుబాటులోకి తెచ్చుకుంది. ఈ డాటా ద్వారా తప్పుగా జరిగే చెల్లింపులను (overpayments) తగ్గించుకుని.. ఈ ఒక్క ఏడాదిలోనే 500 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.5,000 కోట్లకు పైగా) నష్టం జరగకుండా చూసుకుంది.మరి భారత్ విషయానికొస్తే..భారత్‌లో సంక్షేమ పథకాల లభ్ధిదారుల సంఖ్యలో తగ్గుదల కనిపించడం లేదు. అయితే వీటిల్లో లీకేజీలని తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం సత్పలితాలనే ఇస్తున్నాయి. భారత్‌లో బయోమెట్రిక్, ఆధార్ తరహా డిజిటల్ ఫస్ట్ ఐడీ.. వాటి అనుసంధానాలతో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఈ డిజిటల్ చెల్లింపుల సంస్కరణలతో ఈ ఏడాది సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తున్న ధనంలో దాదాపు 13% లీకేజీలు తగ్గాయని బీసీజీ నివేదిక ఇచ్చింది. అంటే.. అప్పటిదాకా వెళ్ళిన నిధుల్లో కొంత అర్హత లేని/నకిలీ లబ్ధిదారులకు వెళ్ళిందని సూచించినట్లే కదా.జగన్ మోడల్ కలిస్తే..ప్రజా సంక్షేమంలో భారత్ పూర్తిస్తాయి లీకేజీలను అరికట్టాలంటే .. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించిన డీబీటీ వ్యవస్థ(Direct Benefit Transfer) కచ్చితంగా అవసరమనే చర్చ నడుస్తోంది. అందుకు సహేతుకమైన కారణాలను వివరిస్తున్నారు. డీబీటీ మన దేశానికి కొత్తది కాదు. ఇది 2013లోనే ప్రారంభమైంది. అయితే ఇన్నేళ్ల కాలంలో సంపూర్ణంగా.. అదీ సమర్థవంతంగా అమలు చేసింది మాత్రం ఒక్క జగన్ ప్రభుత్వమే!.2019లో వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని సంక్షేమ పథకాలను (అమ్మ ఒడి, రైతు భరోసా.. ఇలా పథకాలెన్నో) వంద శాతం డీబీటీ ఆధారంగా మార్చింది. ఆధార్ అనుసంధానం(తప్పనిసరి), బయోమెట్రిక్ ధృవీకరణలకు బ్యాంక్ ఖాతా లింక్ తప్పనిసరి చేసింది. తద్వారా నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరేలా చేసింది. అలా.. జగన్ స్వయంగా బటన్ నొక్కడం ద్వారా ఐదేళ్ల కాలంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేసిన నగదు.. అక్షరాల రూ.2.70 లక్షల కోట్లు.వైఎస్సార్సీపీ హయాంలో మధ్యవర్తుల అవసరం లేకుండా పోయింది. లంచాల రూపంలో అవినీతికి ఆస్కారం కనిపించలేదు. నేరుగా అర్హత ఉన్నవాళ్ల ఖాతాల్లోకే వెళ్తున్నందునా.. ఒక్క పైసా కోత పడేది కాదు. ఆఖరికి కరోనా టైంలోనూ డీబీటీ ద్వారానే సంక్షేమం అందించడం ఇక్కడ మరో రికార్డు. కాబట్టి.. జగన్ డీబీటీ మోడల్‌ను అనుసరిస్తూనే ఏఐ, బయోమెట్రిక్ ఆధారిత వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తే ప్రజా సంక్షేమంలో లీకేజీలను తగ్గించి ప్రతీ రూపాయి కూడా అర్హులైన వారికి చేరగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పేదలకు పండగ..డీబీటీ నిధుల విడుదల
-
ఏపీలో డీబీటీ నిధులు విడుదల
-
AP: డీబీటీలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
సాక్షి, విజయవాడ: రైతుల ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన నిధులను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ రైతులు, విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. డీబీటీలపై వాదనలు ముగియగా, తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.కాగా, నిధుల విడుదలకు నిరాకరించిన ఈసీ.. పోలింగ్ తర్వాత నిధుల విడుదలకు అనుమతిస్తామని పేర్కొంది. కోడ్ వచ్చాక కొనసాగుతున్న పథకాలైనా, కొత్త పథకాలైన ఒక్కటే.. కోడ్ వచ్చాక నిధులు విడుదల చేస్తే ఓటర్లపై ప్రభావం ఉంటుందని ఈసీ తెలిపింది.అయితే, ఇప్పటివరకు వేర్వేరు రాష్ట్రాల్లో అనుసరించిన విధానాన్ని కొనసాగించాలని పిటిషనర్లు కోరారు. నోటిఫికేషన్ కంటే ముందు అమల్లో ఉన్న అన్ని పథకాలు అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయన్న పిటిషనర్లు.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోకుండా ఈసీకి ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరారు. -
డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు
-
కరోనా కాలంలో పేదలను కాపాడిన డీబీటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న డీబీటీ పద్ధతి కరోనా సమయంలో మంచి ఫలితాలను ఇచ్చిందని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీలో పేదలకు ప్రభుత్వ సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరిందని చెప్పారు. తాడేపల్లిలో సోమవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. దళారులు, అవినీతికి తావులేని టెక్నాలజీయే ఏపీ సర్కారు ఆయుధం అని ఆయన చెప్పారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఆర్థికంగా కుంగిపోయిన సామాన్యులను ఆదుకోవడం, సంక్షేమ పథకాల వల్ల ప్రత్యక్షంగా వారికి మేలు చేయాలనే ఉద్దేశం సీఎం జగన్ ప్రభుత్వం ప్రధాన అజెండా అన్నారు. నవరత్నాలు సహా అనేక సంక్షేమ పథకాల అమలుకు డీబీటీ విధానం అక్కరకొచ్చిందని తెలిపారు. వలంటీర్లతో పాటు సచివాలయ వ్యవస్థ పాలనలో పారదర్శకత తీసుకొచ్చిందన్నారు. గ్రామంలో, వార్డు స్థాయిలో లబ్ధిదారుల జాబితాలు అందుబాటులోకి వచ్చాయి. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ఇంతటి విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఏపీ సర్కారు నిజంగా పేదలకు, టెక్నాలజీకి అనుకూలమైనదని రుజువైందన్నారు. తానో హైటెక్ సీఎంగా ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు ఈ వాస్తవాలు కనిపించవా? అని ప్రశ్నించారు. మూడేళ్లలో డీబీటీ విధానంలో నేరుగా రూ. 2 లక్షల కోట్లు తమ ఖాతాల్లో జమచేసిన ప్రభుత్వంపై టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మరని ఆయన చెప్పారు. -
విద్యుత్ సబ్సిడీలు: ముందు చెల్లిస్తే.. తర్వాత నగదు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంతో సహా ఏదైనా కేటగిరీ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రాయితీలు ఇవ్వాలనుకుంటే, నగదు బదిలీ (డీబీటీ) విధానంలో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవసాయానికి ఉచితంగా, గృహాలు, ఇతర వినియోగదారులకు రాయితీపై తక్కువ టారిఫ్‌తో విద్యుత్ సరఫరా కోసం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు విద్యుత్ సబ్సిడీలను చెల్లిస్తున్నాయి. డీబీటీ విధానం వస్తే ముందుగా రైతులు, ఇతర వినియోగదారులు పూర్తి స్థాయిలో విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు విద్యుత్ సబ్సిడీ మొత్తాలను బదిలీ చేస్తాయి. విద్యుత్ విధానంలో కీలక సిఫారసులు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటిం చిన ముసాయిదా జాతీయ విద్యుత్ విధానం– 2021లో పలు కీలక సిఫారసులు చేసింది. కాలుష్య రహిత, సుస్థిర విద్యుదుత్పత్తిని ప్రోత్సహించడం, అవసరాలకు తగ్గట్టు విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను అభివృద్ధి పరచడం, డిస్కంలకు పునరుజ్జీవనం కల్పించడం, విద్యుత్ రంగంలో వ్యాపారాలను ప్రోత్సహించడం, విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ రంగాలకు సంబంధించిన పరికరాల ఉత్పత్తిని దేశంలో ప్రోత్సహించడం, నిబంధనలను సరళీకరించడం వంటి లక్ష్యాలతో ఈ ముసాయిదాకు కేంద్రం రూపకల్పన చేసింది. రాష్ట్రాలతో సంప్రదింపుల అనంతరం రానున్న ఐదేళ్లలో దీనిని అమలుపరచనుంది. ఇందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. డిసెంబర్ 22లోగా మీటర్ల అనుసంధానం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఫీడర్లు అన్నింటికీ కమ్యూనికబుల్ మీటర్లు్ల/ ఏఎంఆర్ మీటర్లను బిగించి, వాటిని నేషనల్ పవర్ పోర్టల్ (ఎన్పీపీ)తో డిసెంబర్ 22లోగా అనుసంధానం చేయాలని కేంద్రం రాష్ట్రాలకు గడువు విధించింది. నాన్–కమ్యూనికబుల్ మీటర్లు ఉన్న స్థానంలో కమ్యూనికబుల్ మీటర్లు బిగించాలని స్పష్టం చేసింది. కచ్చితమైన విద్యుత్ సరఫరా లెక్కలు, ఆడిటింగ్ కోసం రానున్న మూడేళ్లలో 100 శాతం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగించాలని కోరింది. ఇక రెండు టారిఫ్‌ల విధానం... విద్యుత్ డిమాండ్ అత్యధికం (పీక్), అత్యల్పం (ఆఫ్–పీక్) ఉన్న సమయాల్లో వేర్వేరు విద్యుత్ టారిఫ్‌లను వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టాలి. విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్న వేళల్లో తక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించాలి. ఏటా గడువులోగా క్రమం తప్పకుండా విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కంలు సమర్పించేలా ఈఆర్సీలు చర్యలు తీసుకోవాలి. విద్యుత్ సరఫరాకు అవుతున్న మొత్తం వ్యయాన్ని విద్యుత్ చార్జీల రూపంలో రాబట్టుకునేలా టారిఫ్‌ను ఈఆర్సీలు ఖరారు చేయాలి. ప్రైవేటీకరణే శరణ్యం.. విద్యుత్ పంపిణీ రంగంలో సుస్థిరత, అభివృద్ధి కోసం పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యాన్ని (పీపీపీ) ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. విద్యుత్ పంపిణీ రంగం ప్రైవేటీకరణతో వినియోగ దారులకు మెరుగైన సేవలు లభించడంతో పాటు పోటీతత్వం వృద్ధి చెందుతుంది. ప్రైవేటు ఫ్రాంచైజీల ఏర్పాటు ద్వారా ప్రైవేటీకరణను ప్రవేశపెట్టాలి. ఇందుకు డిస్కంల పరిధిలోని కొంత ప్రాంతంలో విద్యుత్ పంపిణీ బాధ్యతలను థర్డ్‌పార్టీకి కాంట్రాక్టు పద్ధతిలో అప్పగించాలి. రాష్ట్ర ఈఆర్సీ ఆమోదంతో సబ్ లైసెన్సీల ఏర్పాటు ద్వారా కూడా ప్రైవేటీకరణను ప్రవేశపెట్టవచ్చు. 10 వేల మెగావాట్ల అణు విద్యుదుత్పత్తి ప్రస్తుతం దేశం 6,780 మెగావాట్ల అణు విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగి ఉండగా, రానున్న 10 ఏళ్లలో మరో 10 వేల మెగావాట్ల అణు విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు ఉన్న అవకాశాలపై పరిశీలన జరపాలని నిర్ణయించింది. స్మార్ట్ మీటర్లతో చాలా చేయొచ్చు విద్యుత్ చౌర్యం నివారణ కోసం విద్యుత్ ఆడిటింగ్ వ్యవస్థలో భాగంగా స్మార్ట్ మీటర్లను వినియోగించాలి. వ్యవసాయ వినియోగ దారులకు మీటర్లు ఏర్పాటు చేయడంలో ఆశించిన పురోగతిని రాష్ట్రాలు సాధించలేదు. ఈ విధానాన్ని ప్రకటించిన తర్వాత ఏడాదిలోగా వ్యవసాయ వినియోగదారులతో పాటు అన్ని రంగాల వినియోగదారులకు 100 శాతం మీటర్లు బిగించాలి. 3 ఏళ్లలోగా 100 శాతం వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించాలి. దీని ద్వారా పీక్, ఆఫ్ పీక్ టారిఫ్ విధానాన్ని అమలు చేయవచ్చు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను వినియోగంలోకి తీసుకొస్తే సుదూర ప్రాంతం (రిమోట్) నుంచి మీటర్ రీడింగ్, బిల్లింగ్, బిల్లుల కలెక్షన్, బిల్లులు చెల్లించకుంటే డిస్ కనెక్షన్ వంటి పనులను డిస్కంలు నిర్వహించవచ్చు. ఇకపై విడుదల చేసే కొత్త కనెక్షన్లకు తప్పనిసరిగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలి. -
కొత్త తరహాలో ఎరువుల సబ్సిడీ బదిలీ
న్యూఢిల్లీ: ఎరువులకు సంబంధించి రూ.70 వేల కోట్ల సబ్సిడీని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసేందుకు కేంద్రం 3 కొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎరువుల సరఫరా, లభ్యత, అవసరం తదితర వివరాలతో కూడిన ప్లాట్‌ఫాం, అభివృద్ధిపరిచిన పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) సాఫ్ట్వేర్, డెస్క్‌టాప్ పీవోఎస్ వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి (డీబీటీ) ఎరువుల సబ్సిడీ బదిలీ చేసే పథకం రెండో విడతలో భాగంగా ఈ మేరకు ఈ సాంకేతికతలను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఎరువుల సబ్సిడీ డీబీటీ మొదటి విడతను కేంద్రం 2017 అక్టోబర్‌లో ప్రవేశపెట్టింది. ఈ విడతలో పీవోఎస్ మెషీన్లలో నిక్షిప్తమైన డేటాను సరిచూసి సబ్సిడీ మొత్తాన్ని కంపెనీలకు బదిలీ చేసేవారు. ‘తాజా సాంకేతికతతో నేరుగా రైతులకు చేరువయ్యేందుకు ఎంతో దోహదపడుతుంది. ఎరువుల రంగంలో పారదర్శకత పెరుగుతుంది’అని ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ పేర్కొన్నారు. ఇప్పటివరకు 13 వెర్షన్ల పీవోఎస్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చామని, దేశంలోని 2.24 లక్షల రిటెయిల్ ఎరువుల దుకాణాల్లో పీవోఎస్ సాఫ్ట్‌వేర్‌ను తెచ్చామన్నారు. ల్యాప్టాప్స్, కంప్యూటర్లలో ఎరువుల విక్రయాలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ను వినియోగించొచ్చని చెప్పారు. -
గ్యాస్ నగదు బదిలీతో 14వేల కోట్ల మిగులు
న్యూఢిల్లీ: వంటగ్యాస్ ప్రత్యక్ష నగదు సబ్సిడీ ద్వారా రూ. 14,672 కోట్లు ప్రభుత్వ ఖజానాకు మిగిలిందని కేంద్ర పెట్రోలియం శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 2015 ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉన్న గణాంకాల ప్రకారం దేశంలో రిజిస్టర్ అయిన వంటగ్యాస్ వినియోగదారులు 18.19 కోట్లు ఉన్నారని.. అందులో 14.85 కోట్ల మంది నిజమైన వినియోగదారులని.. 3.34కోట్ల మంది బోగస్ వినియోగదారులన్నారని ఆ ప్రకటనలో తెలిపింది. -
సిలిండర్‌పై రూ.62.50 పెంపు
సాక్షి, సిటీబ్యూరో : ఒకవైపు చుక్కలనంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు... మరోవైపు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తుతున్న సిటీజనులపై వంటగ్యాస్ ధర పెంపు రూపంలో మరో పిడుగు పడింది. వంటగ్యాస్ ధర రూ.62.50కి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల గ్రేటర్ ప్రజలపై సుమారు రూ.11,549 కోట్ల అదనపు భారం పడుతోంది. వంటగ్యాస్ ధర పెంపుతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1024.50కి చేరింది. ఇప్పటికే డీబీటీ పథకం పుణ్యమా అంటూ.. సిలిండర్‌పై రాష్ట్ర ప్రభుత్వం అమ్మకం పన్ను రూపంలో రూ.27.97 అదనంగా వసూలు చేస్తోంది. పైగా, గతంలో రాష్ట్ర ప్రభుత్వం భరించిన సబ్సిడీ రూ.25లకు కూడా ఎగనామం పెట్టింది. ఫలితంగా వినియోగదారులు ఒక్కో రీఫిల్లింగ్‌పై రూ.52.97 అదనంగా భరిస్తున్నారు. తాజాగా పెరిగిన ధర రూ.62.50తో కలుపుకొంటే మొత్తం రూ.115.47 అదనపు భారం పడినట్లయింది. జనంపై అదనపు భారం గ్రేటర్లో పరిధిలోని హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో కలిపి ప్రస్తుతం వినియోగంలో 26.05 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా, అందులో కేవలం 10.75 లక్షల కనె క్షన్లు మాత్రమే ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమయ్యాయి. అయితే అనుసంధానమైన వినియోగదారులపై తాజాగా పెరిగిన గ్యాస్ ధర, అమ్మకం పన్ను వడ్డన, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ ఎగవేతతో సగటున రూ.1241 కోట్ల అదనపు భారం పడుతుంది. ఇకపోతే ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం కాని సుమారు 15.30 లక్షల మంది వినియోగదారులపై సగటున మరో రూ. 10,308 కోట్ల అదనపు భారం పడనుంది. వీరికి కేంద్ర ప్రభుత్వం పక్షాన ఒక్కో రీఫిల్లింగ్‌పై వర్తించే సబ్సిడీ రూ.558.30కి తోడు పెరిగిన ధర, రాష్ట్ర ప్రభుత్వ అమ్మకం పన్ను వడ్డన, సబ్సిడీ ఎగవేత కలుపుకొని మొత్తం మీద సిలిండర్‌కు 673.77 పైసలు చొప్పున అదనపు భారం పడనుంది. దీంతో గ్రేటర్ వాసులు వంటగ్యాస్ అంటేనే బెంబెలెత్తిపోతున్నారు.


