breaking news
dasserah celerbations
-
సంకల్పమే శక్తి స్వరూపం..!
పల్లెటూరి అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలనుకుంటుంది. కానీ ఎన్నో అడ్డంకులు. ఆటంకాలు. ఆడపిల్లకు అవసరమా అని ప్రశ్నలు. అయితే సంకల్పమే శక్తిగా ఆ అమ్మాయి అనుకున్నది సాధిస్తుంది. ఓటీటీలో విశేష ఆదరణ పొందుతున్న ‘కన్యాకుమారి’లో హీరోయిన్ గీత్ షైనీతన సంకల్పాల గురించి దసరా దాండియా గురించి చెబుతున్న విశేషాలు. ‘నేను చిన్నప్పటి నుంచి ఎంతో బాగా చదువుకున్నాను. స్కూలు ఫస్ట్ వచ్చాను. కాలేజీ ఫస్ట్ వచ్చాను. ఎంసెట్‌లో ర్యాంక్ తెచ్చుకున్నాను. అయినా సరే నా కోరికలు ఏవీ మీరు పట్టించుకోలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతానంటే డిగ్రీలో చేర్పించారు. ఇంత తెలివి పెట్టుకుని చీరల కొట్టులో సేల్స్గర్ల్లా చీరలు అమ్ముకుంటున్నాను’ అని తల్లిదండ్రులను, అన్నయ్యను నిలదీసి తన వేదనను చెప్పుకుంటుంది కన్యాకుమారి అనే అమ్మాయి ‘కన్యాకుమారి’ సినిమాలో.కన్యాకుమారిది ఒకటే కల. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలనేది. కాని ఇంటి పరిస్థితులు, అమ్మాయి అనే కారణంతో చదివించక΄ోవడం... ఇవన్నీ ఆమె కలలను సగంలోనే తుంచేస్తాయి. కాని కన్యాకుమారి తన కలను లోలోపల సజీవంగా ఉంచుకుంటుంది. తను ప్రేమించిన వ్యక్తి ప్రేమను గౌరవిస్తూనే, రైతుగా ఉండాలనే అతని అభిలాషను గౌరవిస్తూనే తన లక్ష్యం తీవ్రతను అందరికీ తెలియచేసి హైదరాబాద్‌కు వెళ్లి సాఫ్ట్వేర్ కోర్సులు చేయడమే కాదు పెద్ద కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని అమెరికాకు కూడా వెళ్లి వచ్చి అప్పుడు పెళ్లి చేసుకుంటుంది.ఇటీవల ఇలాంటి పట్టుదల ఉన్న అమ్మాయి కథ తెలుగులో లేదు. అందుకే ఓటీటీలో ‘కన్యాకుమారి’ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆ పాత్ర పోషించిన గీత్ సైనీకి ప్రేక్షకులు ఫుల్‌మార్కులు వేస్తున్నారు. గీత్‌తో సంభాషణ:మీ పేరు తెలుగు పేరనిపించడం లేదు.గీత్ సైనీ: మా పూర్వికులది రాజస్థాన్. మా తాతల కాలంలోనే అదిలాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. అదిలాబాద్‌లో నేను పుట్టి పెరిగాను. ఆ తర్వాత హైదరాబాద్‌లో మా కుటుంబం సెటిల్ అయ్యింది. మా నాన్న టీచర్. అమ్మ హౌస్ వైఫ్. యాక్టింగ్ మీద ఆసక్తి ఎలా?జ: స్కూల్లో బాగా అల్లరి చేసేదాన్ని. టీచర్లను ఇమిటేట్ చేసి ఫ్రెండ్స్‌ను నవ్వించేదాన్ని. డాన్సర్ కావాలనుకున్నాను. అయితే టెన్త్ క్లాస్ అయ్యాక అందరు ఫ్రెండ్స్ నా ఆటోగ్రాఫ్ బుక్‌లో ‘నువ్వు మంచి నటివి అవుతావు’ అని రాశారు. వారు రాసింది చూశాక నేను నటిని కావాలనుకునే కోరిక నాలో నా చుట్టూ ఉందనిపించింది. తొలి అవకాశం ఎలా వచ్చింది?జ: నేను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివాను. థర్డ్ ఇయర్లో ఉండగా కాలేజీ ఈవెంట్లో డాన్స్ చేస్తే ఒక సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ చూసి ‘అల’ అనే షార్ట్‌ఫిల్మ్ కోసం నన్ను సంప్రదించారు. అయితే ఈ అవకాశం వచ్చినట్టు నాన్నకు చెప్పే ధైర్యం లేక మెసేజ్ చేశాను– ఇలా చాన్స్ వచ్చింది... నో చెప్పేశాను అని. నాన్న కాసేపటికి ఫోన్ చేసి ‘మంచి డైరెక్టర్ అంటున్నావు కదా బేటా చేయి’ అన్నారు. చాలా ఆశ్చర్యపోయాను.తొలి సినిమా అవకాశం?జ: సృజన్ అట్టాడ తన ‘పుష్పక విమానం’ కోసం కాస్టింగ్ కాల్ ప్రకటన ఇస్తే నా ఫ్రెండ్ నా ఫొటోలు పంపింది. అలా ఆ సినిమాలోని రెండు ఫిమేల్ లీడ్ క్యారెక్టర్లలో ఒకటిగా చేశాను. అయితే సృజన్ తీయబోతున్న ‘కన్యాకుమారి’ లో నాకు హీరోయిన్ చాన్స్ వస్తుందనుకోలేదు. శ్రీకాకుళం అమ్మాయిగా మారి ఆడిషన్ ఇచ్చాక ఆయన సంతృప్తి చెంది ఈ అవకాశం ఇచ్చారు. కన్యాకుమారి పాత్రను ఎలా ఓన్ చేసుకున్నారు?జ: నేను బయట మామూలుగా చాలా కామ్‌గా ఉంటాను. ఎవరైనా బాగా పరిచయమైతే ఇక నా వాగుడు తట్టుకోవడం కష్టం. ఆ లోపలి మనిషిని ఈ పాత్ర కోసం బయటకు తెచ్చాను. ఆడపిల్లలు తమ రెక్కలను పూర్తిగా సాచాలి. సీతాకోక చిలుకల్లా ఎగరాలి. అందుకే పోస్టర్లో సీతాకోక చిలుక ఉంటుంది. అలాంటి గట్టి పాత్ర చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అందులో చీరల పేర్లన్నీ చెప్పే క్లిప్ బాగా వైరల్ అవుతోంది. చిన్నపుడు మీరు దసరా ఎలా జరుపుకునేవారు?జ: ఆదిలాబాద్‌లో మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. సరిహద్దు ప్రాంతం కాబట్టి. దసరా వస్తే బాగా దాండియా ఆడేవాళ్లం. బతుకమ్మ కూడా ఆడేదాన్ని. కన్యాకుమారి షూట్ సమయంలో శ్రీకాకుళంలో ఉన్నప్పుడు దసరా వచ్చింది. అక్కడ దసరా సందడి వేరేగా అనిపించింది. వీధి వీధికి దుర్గ మంటపాలు, కోలాటం... చాలా సందడి చేశాం అందరం.నేటి అమ్మాయిలకు ఏం చెబుతారు?జ: ఏ సందర్భంలోనూ ఓటమి ఒప్పుకోవద్దు. కల ముగిసిపోయిందని అనుకోవద్దు. మరుగున పడ్డ లక్ష్యాలను తిరిగి సజీవం చేసుకుని పోరాడాలి. ఏదో ఒకరోజుకు గెలుస్తాం.– సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి (చదవండి: Vijayadashami: స్త్రీ శక్తే విజయ దశమి..) -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు
-
జయజయహే జగన్మాత
నేత్రపర్వంగా మూలా మహోత్సవం వేడుకల్లో పాల్గొన్న పుష్పగిరి, తొగుట పీఠాధిపతులు అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు వర్గల్: వర్గల్ విద్యాధరి క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. శంభుని కొండ దేవీ నామస్మరణతో మార్మోగింది. మహా సరస్వతి రూపిణి అయిన అమ్మవారు నవరత్న ఖచిత స్వర్ణ కిరీటంతో భక్తులను కటాక్షించారు. దసరా శరన్నవరాత్రోత్సవాల్లో ఎనిమిదో రోజు శనివారం ఈ మహోత్సవ ఘట్టం ఆవిష్కతమైంది. వర్గల్ క్షేత్రంలో శనివారం మూలా నక్షత్ర మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పుష్పగిరి, తొగుట పీఠాధిపతులు అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మాజీ గవర్నర్ కె. రోశయ్య, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, గడా అధికారి హన్మంతరావు తదితరులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఓవైపు అర్చనలు, అభిషేకాలు, మరోవైపు సారస్వత మండపంలో భారీగా చిన్నారుల అక్షరాభ్యాసాలతో మూలా నక్షత్ర మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు సామూహిక పుష్పార్చనలో పాల్గొన్నారు. విశేష పంచామతాభిషేకం..గిరి ప్రదక్షిణం తెల్లవారు జామున 5.30 గంటలకు ఆలయ వ్యవస్థాపకులు చంద్రశేఖర సిద్ధాంతి నేతృత్వంలో గణపతి పూజతో మూలా నక్షత్ర మహోత్సవానికి తెరలేచింది. గర్భగుడిలో అమ్మవారి మూల విరాట్టుకు వేదమంత్రోచ్ఛారణలతో విశేష పంచామతాభిషేకం నిర్వహించారు. వివిధ రకాల పూలు, పట్టు వస్త్రాలతో అలంకరించారు. నవరత్న ఖచిత స్వర్ణకిరీటాది ఆభరణాలు ధరింపజేశారు. ఆ వెంటనే ప్రత్యేకంగా అలంకరించిన పూల పల్లకిలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఆసీనురాలిని చేశారు. ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైన అమ్మవారి గిరి ప్రదక్షిణ ఊరేగింపు రెండు గంటల పాటు కన్నుల పండువ చేసింది. నేత్రపర్వంగా లక్ష పుష్పార్చన ఉదయం 10 గంటలకు మూలా పుస్తక రూపిణి సరస్వతి పూజ అనంతరం ఆలయ మహామంటపంలో సువాసినులు బారులు తీరి కూర్చుని అమ్మవారి నామం పఠిస్తూ వివిధ రకాల పూలతో సామూహిక లక్షపుష్పార్చన చేశారు. తరువాత చదువుల తల్లికి మహా పుస్తక పూజ జరిపారు. వేలాది పుస్తకాలను అమ్మకు సమర్పించి అర్చించారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు కొనసాగాయి. పీఠాధిపతులకు పూర్ణకుంభ స్వాగతం మూలామహోత్సవ వేడుకలకు హాజరైన పీఠాధిపతులు విద్యాశంకర భారతీ, మాధవానంద సరస్వతి స్వాములకు ఆలయ అర్చక పరివారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం విద్యాశంకర భారతీ స్వామి వారు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. మాజీ గవర్నర్ రోశయ్య, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి సన్మానం వర్గల్ ఉత్సవాలకు వేర్వేరుగా హాజరైన మాజీ గవర్నర్ రోశయ్య, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని చంద్రశేఖర సిద్ధాంతి అధ్వర్యంలో వేదపండితులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ వర్గల్ క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ క్షేత్రంగా విరాజిల్లాలని ఆకాంక్షించారు. భారీగా అక్షర స్వీకారాలు మూలా మహోత్సవం సందర్భంగా అక్షరస్వీకారానికి పెద్ద సంఖ్యలో చిన్నారులు తరలిరావడంతో అక్షరాభ్యాస ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దేవాలయ రజతోత్సవం సందర్భంగా పుష్పగిరి, తొగిట పీఠాధిపతులు విద్యాశంకర భారతీ స్వామి, మాధవానంద సరస్వతిల సమక్షంలో పలువురు ప్రముఖులకు ఆలయ కమిటి ఘన సన్మానంసింది. రాష్ట్రపతి అవార్డు గ్రహీత వెంకట్రామన్ ఘనాపాఠి, దేవాలయ నిర్మాణ స్ఫూర్తి ప్రదాత ఏకే శ్రీనివాసాచార్య సిద్ధాంతి తరఫున వారి కుటుంబ సభ్యులకు ఆలయం తరఫున పురస్కారాలు అందజేసి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా శాస్త్రుల రఘురామశర్మ, మంచినీళ్ల రాఘురామశర్మ, అయాచితం నటేశ్వరశర్మ, మూటకోడూరు బ్రహ్మం, డాక్టర్ రాధశ్రీ, మరుమాముల దత్తాత్రేయశర్మ, జీఎం రామశర్మ, చిల్లర భావనారాయణశర్మ, మరుమాముల వెంకటరమణశర్మకు పురస్కారాలు అందజేసారు. టీడీపీ నేత బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ నేత మడుపు భూంరెడ్డి, టేకులపల్లి రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి, జెడ్పీటీసీ పోచయ్య తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.