-
Sagubadi: విపత్తులకు తట్టుకునే ప్రకృతి సేద్యం.. గొప్పేంటి?
2023 డిసెంబర్ 4,5 తేదీల్లో విరుచుకుపడిన మిచాంగ్ తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో పంటలను, ముఖ్యంగా వరి పంటను, నేలమట్టం చేసింది. అయితే, ఆ తీవ్రమైన గాలులు, వర్షాన్ని తట్టుకొని నిలబడే ఉన్నాయి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగవుతున్న వరి పొలాలు. రసాయనిక వ్యవసాయ పద్ధతిలో సాగవుతున్న వరి చేలు నేలకు వాలిపోయి, నీట మునిగి ఉంటే.. వీటి పక్కన పొలాల్లో ఉన్న ప్రకృతి వ్యవసాయ వరి పంట మాత్రం చెక్కుచెదరకుండా దర్జాగా నిలబడి ఉండటం గురించి అప్పట్లోనే వార్తా కథనాలు చదివిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. మిచాంగ్ తుపానే కాదు అంతకుముందు కూడా అనేక విపత్కర పరిస్థితుల్లోనూ ఇది స్పష్టంగా కళ్లకు కట్టిన వాస్తవం. అయితే, ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. ‘రీజెనరేట్ ఎర్త్’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులైన ఆస్ట్రేలియన్ సాయిల్ మైక్రోబయాలజిస్టు డాక్టర్ ఫిల్ లీ ఈ నెల మొదటి వారంలో ఏపీలో పర్యటించారు. అనంతపురం తదితర జిల్లాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు తుపానును, కరువును దీటుగా తట్టుకొని నిలబడుతూ సుభిక్షంగా, ఉత్పాదకంగా నిలవటానికి వెనుక గల శాస్త్రీయ కారణాలను డా. ఫిల్ లీ అన్వేషించారు. అనేక కోస్తా జిల్లాల్లో మిచాంగ్ తుపానుకు నేలకొరిగిన రసాయనిక వరి పొలాల్లో గడ్డికి, పక్కనే పడిపోకుండా నిలబడిన వరి పొలాల్లో గడ్డికి మధ్య ఉన్న వ్యత్యాసాలేమిటో తన వెంట తెచ్చిన అధునాతన మైక్రోస్కోప్ ద్వారా పరిశోధించారాయన. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన వరి మొక్క కాండంలో కణ నిర్మాణం రసాయనిక వ్యవసాయంలో కన్నా బలంగా, ఈనెలు తేలి ఉండటాన్ని ఆయన గుర్తించారు. రసాయనాలతో సాగు చేసిన వరి పొలం మిచాంగ్ తుపానుకు నేలకొరిగింది (ఎడమ ఫైల్), ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన వరి పొలం మిచాంగ్ తుపానుకు తట్టుకుంది (కుడి ఫైల్) "మిచాంగ్ తుపాను నాటి రసాయనిక, ప్రకృతి సేద్య వరి పంటలపై ఆస్ట్రేలియా శాస్త్రవేత్త డా. ఫిల్ లీ అధ్యయనం" "ప్రకృతి సేద్యంతో ఒనగూడుతున్న అద్భుత ఫలితాలను కళ్లకు కట్టిన అధ్యయన ఫలితాలు" "ప్రకృతి వ్యవసాయం వల్ల మట్టిలో జీవశక్తి, సూక్ష్మజీవరాశి వైవిధ్యత పెరుగుతుంది. అందువల్లనే ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి ఈ పంటలకు వస్తోందనడానికి ఇప్పుడు విస్పష్టమైన రుజువులు దొరికాయి". – డాక్టర్ ఫిల్ లీ, ఆస్ట్రేలియన్ సాయిల్ మైక్రోబయాలజిస్టు, ‘రీజెనరేట్ ఎర్త్’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ‘ప్రకృతి వ్యవసాయంలో పండించిన వరి మొక్కలు చాలా బలంగా ఉన్నాయి. ఇది ప్రకృతి సేద్య బలానికి నిదర్శనం’ అన్నారు డా. ఫిల్ లీ. అదేవిధంగా, ఏప్రిల్ మొదటి వారంలో అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన రసాయనిక, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగవుతున్న పంటలను పరిశీలించారు. ఆయా పొలాల్లో మట్టి నమూనాలను కూడా సేకరించి అధ్యయనం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన వరి కాండం (మైక్రోస్కోప్ ఎడమ చిత్రం), రసాయనాలతో పండించిన వరి కాండం (కుడి చిత్రం) బంతి పూలను ఏకపంటగా సాగు చేస్తున్న రసాయనిక పొలంలోని మట్టిలో జీవం తక్కువగా ఉందని గుర్తించారు. ఆ పొలం పక్కనే బంతితో పాటు 12 పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న పొలంలోని మట్టి నమూనాలను పరిశోధించగా.. మట్టి కణాల నిర్మాణం, ఆ మట్టిలో వైవిధ్యపూరితమైన సూక్ష్మజీవరాశి ఎంతో సుసంపన్నంగా ఉన్నట్లు గుర్తించానని డా. ఫిల్ లీ వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల మట్టిలో పెరుగుతున్న జీవశక్తి, సూక్ష్మజీవరాశి వైవిధ్యత వల్లనే పంటలకు వైపరీత్యాలను తట్టుకునే శక్తి వస్తోందనడానికి విస్పష్టమైన రుజువులు దొరికాయని ఆయన తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వీడియోలు ‘ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిటీ నాచురల్ ఫార్మింగ్’ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. తిరుపతిలో 20,21 తేదీల్లో ఆర్గానిక్ మేళా.. తిరుపతి టౌన్ క్లబ్ కూడలిలోని మహతి ఆడిటోరియంలో ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఉ. 10.30 గం. నుంచి రాత్రి 8 గం. వరకు స్వచ్ఛంద సంస్థ ‘కనెక్ట్ 2 ఫార్మర్’ ఆధ్వర్యంలో సేంద్రియ ఆహారోత్పత్తులు ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. రైతులు నేరుగా తమ ఆర్గానిక్ పంట ఉత్పత్తులను వినియోగదారులకు అమ్ముకోగలిగే ఏర్పాటు చేయటం.. దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు కూడా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని కనెక్ట్ 2 ఫార్మర్ వ్యవస్థాపకులు శిల్ప తెలిపారు. 20న కషాయాల తయారీపై గంగిరెడ్డి, దేశవాళీ పండ్లు / పూల మొక్కల గ్రాఫ్టింగ్‌పై జె.ఎస్. రెడ్డి శిక్షణ ఇస్తారు. కంపోస్టింగ్‌పై డా.సింధు అవగాహన కల్పిస్తారు. 21న 5 దొంతర్ల పండ్లు, కూరగాయల సాగుపై, ఇంకుడుగుంతల నిర్మాణంపై విజయరామ్ ప్రసంగిస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రకృతివనం ప్రసాద్ ప్రసంగిస్తారు. వివరాలకు.. 63036 06326. ఇవి చదవండి: Sagubadi: మనసుపెట్టి ఇష్టంగా.. ఏడాదికి మూడు పంటలు! -
6న రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావం కారణంగా 2023 ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన కరువుతో పాటు 2023–24 రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుపాన్‌తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ రెండు విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతులకు రూ.1,294.58 కోట్లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈమేరకు ఈ నెల 6వ తేదీన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి బాధిత రైతుల ఖాతాలకు నేరుగా సాయాన్ని జమ చేయనున్నారు. వైఎస్సార్ రైతు భరోసాతో పాటు సున్నా వడ్డీ రాయితీ కింద రైతన్నలకు రూ.1,294.34 కోట్లు అందించి వారం తిరగకముందే మరోసారి అన్నదాతలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆరు ప్రామాణికాల ఆధారంగా కరువు మండలాలు ప్రకృతి వైపరీత్యాల వేళ పంటలు కోల్పోయిన రైతులకు ఆ సీజన్ ముగియకుండానే పరిహారాన్ని అందజేస్తూ ఐదేళ్లుగా సీఎం జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పైసా కూడా బకాయి పెట్టకూడదన్న సంకల్పంతో ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని అదే సీజన్ ముగిసేలోగా అందజేస్తోంది. వర్షాభావంతో గతేడాది ఖరీఫ్‌లో 84.94 లక్షల ఎకరాలకు గానూ 63.46 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఆరు ప్రామాణికాల (వర్షపాతం, పంట విస్తీర్ణం, ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి, జలప్రవాహం, భూగర్భ జలాలు, జలాశయాల స్థాయిలు) ఆధారంగా ఏడు జిల్లాల్లో 103 మండలాలు కరువుబారిన పడినట్లు గుర్తించి సీజన్ ముగియకుండానే ప్రకటించారు. బెట్ట పరిస్థితులతో 14,23,995.5 ఎకరాల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట నష్టపోయినట్లు గుర్తించారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత 6.96 లక్షల మంది రైతులకు రూ.847.22 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించాలని లెక్క తేల్చారు. 22 జిల్లాల్లో మిచాంగ్ ప్రభావం మిచాంగ్ తుపాన్ వల్ల 22 జిల్లాల్లో 6,64,380 ఎకరాల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. 4.61 లక్షల మంది రైతులకు రూ.442.36 కోట్లు పెట్టుబడి రాయితీ చెల్లించాలని అంచనా వేశారు. ఖరీఫ్ సీజన్లో ఐదు వేల ఎకరాల్లో పంట నష్టపోయిన 1892 మంది రైతులకు రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని అంచనా వేశారు. మొత్తం 20,93,377 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న 11,59,126 మంది రైతులకు రూ.1,294.58 కోట్ల పరిహారం చెల్లించాలని లెక్క తేల్చారు. భారమైనా పెట్టుబడి రాయితీ పెంపు కేంద్రం నిర్ణయించిన దాని కంటే ఎక్కువ సాయం అందించాలన్న లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడి రాయితీని ప్రభుత్వం పెంచింది. వ్యవసాయ భూముల్లో మట్టి, ఇసుక మేటలు తొలగించేందుకు గతంలో హెక్టారుకు రూ.12 వేలు ఇవ్వగా దాన్ని రూ.18 వేలకు పెంచింది. దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టార్‌కు రూ.6800 చొప్పున ఇస్తున్న పరిహారాన్ని రూ.8500కు పెంచారు. నీటి పారుదల భూములైతే గతంలో రూ.13,500 చొప్పున చెల్లించిన పరిహారాన్ని రూ.17 వేలకు పెంచారు. వరి, వేరుశనగ, పత్తి, చెరకు తదితర పంటలకు గతంలో హెక్టార్‌కు రూ.15 వేల చొప్పున ఇస్తుండగా దాన్ని రూ.17 వేలకు పెంచారు. ఉద్యాన పంటలకు రూ.7500 నుంచి రూ.17 వేలకు పెంచారు. మామిడి, నిమ్మ జాతి తోటలకు రూ.20 వేల నుంచి రూ.22,500 చొప్పున, మల్బరీకి రూ.4800 నుంచి రూ.6వేలకు పెంచి ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వంపై భారం పడినప్పటికీ కష్టాల్లో ఉన్న రైతులకు ఎంత చేసినా తక్కువే అనే ఉద్దేశంతో పెట్టుబడి రాయితీని పెంచి మరీ ప్రభుత్వం చెల్లిస్తోంది. ఐదేళ్లలో రూ.3,271 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగా పరిహారం చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కరువు, మిచాంగ్ తుపాన్ వల్ల 2023–24 సీజన్లో పంటలు దెబ్బతిన్న 11.59 లక్షల మంది రైతులకు ఈనెల 6వతేదీన రూ.1,294.58 కోట్ల పెట్టుబడి రాయితీని సీఎం జగన్ బటన్ నొక్కి ఖాతాలకు జమ చేస్తారు. గత 57 నెలల్లో 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.44 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని అందించింది. తాజాగా చెల్లించే సాయంతో కలిపితే 34.44 లక్షల మంది రైతులకు రూ.3,271 కోట్లు అందించినట్లవుతుంది. –చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
తుపాను బాధితులకు అండగా ఉండాలి
సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్/రాజమహేంద్రవరం: రాష్ట్రంలోని తుపాను ప్రభావిత జిల్లాల్లో కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సాంకేతిక నిపుణుల బృందం గురువారం పర్యటించింది. బాపట్ల, పశ్చిమ, తూర్పు గోదావరి, తిరుపతి జిల్లాల్లో వర్షాల కారణంగా దెబ్బతిన్న ధాన్యాన్ని పరిశీలించి నమూనాలు సేకరించింది. శుక్రవారం మిగిలిన జిలా్లల్లో పర్యటన అనంతరం నమూనాలను విశ్లేషించి కేంద్రానికి నివేదిక పంపనుంది. పౌరసఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ సాక్షితో మాట్లాడుతూ.. కేంద్ర బృందం పరిశీలనలో వచ్చిన ఫలితాల ఆధారంగా ధాన్యం సేకరణలో ప్రత్యేక సడలింపులు కోరతామన్నారు. తద్వారా ధాన్యం రైతులకు ఎటువంటి తగ్గింపులు లేకుండా సంపూర్ణ మద్దతు ధర అందిస్తామన్నారు. ఆహార అవసరాలకు పనికిరాని ధాన్యాన్ని ఇథనాల్ ఉత్పత్తికి కోసం కొనుగోలు చేసేలా కేంద్రాన్ని కోరతామన్నారు. మిచాంగ్ తుపాను బాధితులకు అండగా ఉండాలంటూ గూడూరు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు వెలగపల్లి వరప్రసాద్‌రావు, కిలివేటి సంజీవయ్య కేంద్రబృందాన్ని కోరారు. గురువారం తిరుపతి జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తుపాను నష్టాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మీనా హోడాతో కూడిన బృందం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధానంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించింది. రాష్ట్రం నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ, రోడ్డు, భవనాల మంత్రిత్వశాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ రాకే‹Ùకుమార్, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ పెంచల కిశోర్, ఆర్డీఓలు కిరణ్‌కుమార్, చంద్రముని తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాలను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సాయాన్ని ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు, భోజన వసతుల గురించి వివరించారు. ఒక్కో వ్యక్తికి రూ.1,000, కుటుంబానికి రూ.2500 ఇవ్వడమే కాకుండా నిత్యావసర సరకులను అందించామని వివరించారు. పెద్ద ఎత్తున ఆస్తుల నష్టం జరిగినా, ప్రాణ నష్టం లేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు. విద్యుత్, రోడ్లు, ఇరిగేషన్, మత్స్యశాఖ, పంచాయతీరాజ్‌లకు తీవ్రమైన నష్టం జరిగినట్లు తెలియజేశారు. స్థానిక రైతులు, అధికారులు, ఎమ్మెల్యేలు చెప్పిన అన్ని అంశాలను కేంద్ర బృందం నమోదు చేసుకుంది. ఆ మేరకు కేంద్రానికి నష్టాల నివేదికను సమర్పించి అందరికి పూర్తిస్థాయిలో సాయం చేసేలా కృషి చేస్తామని తెలిపింది. ఉమ్మడి తూర్పు గోదావరిలో.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు గురువారం పర్యటించాయి. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం, సంగాయగూడెం, కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి, కేఈ చిన్నయ్యపాలెం, కోటనందూరు, అల్లిపూడి, తొండంగి మండలం ఎ.కొత్తపల్లి, రావికంపాడు, పీఈ చిన్నాయపాలెం, ఏవీ నగరం, గొల్లప్రోలు మండలం మల్లవరం, కొత్తపల్లి మండలం రమణక్కపేట, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామాల్లో తుపానుకు దెబ్బ తిన్న వరి, అరటి తదితర ఉద్యాన పంటలు, ఇళ్లను బృందం అధికారులు పరిశీలించారు. రైతులు, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నష్టాల వివరాలు నమోదు చేశారు. పలు ప్రాంతాల్లో ధాన్యం నమూనాలు సేకరించారు. తుపాను నష్టాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని కేంద్ర బృందం తెలిపింది. -
రైతులకు అండగా కొడాలి నాని మరియు పేర్ని నాని
-
డెల్టాలను ముంచి ఉల్టా రాతలా!?
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో ఆ రెండు డెల్టాల్లో అక్కడక్కడ పల్లపు ప్రాంతాల్లో కొంతమేర పంటలు ముంపునకు గురయ్యాయి. ప్రభుత్వమే ఆ పంటలను ముంచేసినట్లు చిత్రీకరిస్తూ సీఎం జగన్‌పై రామోజీరావు ఇష్టమొచ్చినట్లు రాసిపారేశారు. డ్రెయిన్లు, కాలువల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంవల్లే డెల్టాల్లో పంటలు ముంపునకు గురైనట్లు చేతికొచ్చింది అచ్చేశారు. నిజానికి.. టీడీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణాడెల్టా ఆధునీకరణకు వినియోగించాల్సిన రూ.175 కోట్లను కృష్ణా నది కరకట్టపై తాను నివాసం ఉంటున్న అక్రమ నివాసాన్ని సుందరీకరించేందుకు చంద్రబాబు మళ్లించారు. అలాగే, గోదావరి డెల్టా ఆధునీకరణ నిధులనూ గోదావరి పుష్కరాలకు మళ్లించారు. ఆ పనులు చేయకుండానే కాంట్రాక్టర్ల ముసుగేసుకున్న టీడీపీ నేతలకు రూ.150 కోట్లకు పైగా దోచిపెట్టారు. ఏటా డ్రెయిన్లలో గుర్రపుడెక్క, తట్టెడు పూడిక ఎత్తకుండానే ఎత్తినట్లు చూపి రూ.వందల కోట్లను పచ్చమందకు దోచిపెట్టారు. చంద్రబాబు అవినీతివల్లే కృష్ణా, గోదావరి డెల్టాల్లో డ్రెయిన్లలో పూడిక పేరుకుపోయింది. గత నాలుగున్నరేళ్లుగా కృష్ణా, గోదావరి డెల్టాల్లో ఆయకట్టు చివరి భూములకు నీళ్లందిస్తూ దన్నుగా నిలుస్తున్న సీఎం జగన్‌కు రైతులు అండగా నిలుస్తుండటాన్ని భరించలేక రామోజీరావు నిద్రపట్టడంలేదు. దీంతో చంద్రబాబు అవినీతిని కప్పెట్టి.. ఆ నెపాన్ని సీఎం జగన్‌పై రుద్దుతూ ‘ప్రభుత్వం ముంచింది’ అంటూ ‘ఈనాడు’లో తప్పుడు కథనాన్ని అచ్చేశారు. రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరు.. సీఎం జగన్ ఆదేశాల మేరకు గత నాలుగున్నరేళ్లుగా గోదావరి, కృష్ణా డెల్టాల్లో రబీ పంటల కోతలు పూర్తికాగానే కాలువలకు మరమ్మతులు చేస్తూ.. డ్రెయిన్లలో గుర్రపుడెక్కను తొలగిస్తూ.. ఆయకట్టు చివరి భూములకు అధికారులు నీళ్లందిస్తున్నారు. గోదావరి డెల్టాతోపాటు కృష్ణాడెల్టా చరిత్రలో గత నాలుగేళ్లుగా రబీ పంటకూ నీళ్లందిస్తున్నారు. కాలువలు, డ్రెయిన్లను సమర్థవంతంగా నిర్వహిస్తూ సమృద్ధిగా నీళ్లందిస్తుండటంతో పంటల ఉత్పత్తులు పెరగడం.. గిట్టుబాటు ధరలు దక్కడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. తుపాన్లు, భారీ వర్షాలవల్ల పంటలకు నష్టం వాటిల్లితే.. ఆ సీజన్ ముగిసేలోగానే నష్టపోయిన రైతులకు సీఎం జగన్ పరిహారం చెల్లిస్తూ దన్నుగా నిలుస్తున్నారు. దీంతో సీఎం జగన్‌కు రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఆదరణ పెరుగుతున్నట్లుగానే.. కృష్ణా, గోదావరి డెల్టా రైతుల్లోనూ ఆయనకు నానాటికీ మద్దతు పెరుగుతోంది. డెల్టాల ఆధునీకరణ నిధులు స్వాహా.. కృష్ణా, గోదావరి డెల్టాను ఆధునీకరించడం ద్వారా పంటలకు సమృద్ధిగా నీళ్లందించి రైతులకు బాసటగా నిలవాలని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. జలయజ్ఞం కింద గోదావరి, కృష్ణా డెల్టాల ఆధునీకరణ పనులు చేపట్టారు. తన హయాంలో గోదావరి డెల్టా ఆధునీకరణకు రూ.748.58 కోట్లు, కృష్ణాడెల్టా ఆధునీకరణకు రూ.1,093.77 కోట్లు ఖర్చుచేసి కాలువలు, డ్రెయిన్లను అభివృద్ధి చేశారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన బాబు.. డెల్టాల ఆధునీకరణ నిధులను దోచేశారు. ► కృష్ణాడెల్టా ఆధునీకరణకు 2014–19 మధ్య రూ.1,239.24 కోట్లు ఖర్చుచేస్తే.. ఇందులో రూ.175 కోట్లను తాను నివాసం ఉంటున్న అక్రమ కట్టడం సుందరీకరణకు మళ్లించారు. ► కాలువలు, డ్రెయిన్ల ఆధునీకరణ పనులు తూతూమంత్రంగా చేపట్టి కాంట్రాక్టర్ల ముసుగులోని టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబు దోచేశారు. ► గోదావరి డెల్టా ఆధునీకరణకు 2014–19 మధ్య రూ.813.02 కోట్లు ఖర్చుచేసిన చంద్రబాబు.. అందులో చాలావరకు నిధులను గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు మళ్లించేశారు. ►పనులు చేయకుండానే చేసినట్లు చూపి పచ్చమందకు దోచిపెట్టారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
Advertisement