breaking news
Curry can be done
-
కూర వండలేదని కుమారుడి హత్య
► భూపాలపల్లి మండలంలో ఓ తండ్రి ఘాతుకం భూపాలపల్లి: కూర వండలేదని కుమారుడిని ఓ తండ్రి హత్య చేసిన ఘటన భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక సీఐ సీహెచ్ రఘునందన్‌రావు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొడ్డు సమ్మయ్య, అతని కుమారుడు దేవేందర్(22) కూలీ పని చేస్తుంటారు. సమ్మయ్య భార్య రెండేళ్ల క్రితం మృతి చెందగా కూతురు స్వరూపకు ఏడాది క్రితం వివాహం చేశాడు. దీంతో తండ్రీ కొడుకు ఇంట్లో ఉంటున్నారు. సమ్మయ్య మంగళవారం ఉదయం కూలీ పనికి వెళ్తున్న సమయంలో కూర లేక కారంపొడి వేసుకుని భోజనం బాక్సు తీసుకెళ్లాడు. సాయంత్రానికి కూర వండమని కుమారుడు దేవేందర్‌కు డబ్బులు ఇచ్చి వెళ్లాడు. అయితే దేవేందర్ కూర వండకపోగా, డబ్బు ఖర్చు చేశాడు. ఇదేమిటని ప్రశ్నించగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన సమ్మయ్య దేవేందర్ నిద్రిస్తున్న సమయంలో రోకలి బండతో తలపై మోది చంపి పరారయ్యాడు. బుధవారం ఉదయం దేవేందర్‌ను కూలీ పనికి పిలిచేందుకు గ్రామస్తులు రాగా అతడు ఇంట్లో శవమై కనిపించాడు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
‘నాటుకోడి’ కూరతో సెట్ దోసె!
విధాన పరిషత్‌లో ఆసక్తికర చర్చ బెంగళూరు : ‘నాటుకోడి కూర, గింజల కూర, బోటి, సెట్‌దోసె....వహ్వా ఏమా రుచులు’ ఈ తరహా ఆసక్తికర చర్చ విధానపరిషత్‌లో గురువారం చోటుచేసుకుంది. విధానపరిషత్ కార్యకలాపాల్లో భాగంగా పరిషత్ సభ్యుడు రామచంద్రగౌడ ప్రస్తావించిన అంశంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమాధానం ఇచ్చే సందర్భంలో ఈ చర్చ చోటుచేసుకుంది. సిద్ధరామయ్య మాట్లాడుతూ...‘మైసూరులో 12 పైసలకు రెండు సెట్ దోసెలు ఇచ్చేవారు. నాటుకోడి కూర, గింజల కూర, బోటిలతో ఈ సెట్‌దోసెలు అందించేవారు. మైసూరులోని చడ్డి హోటల్, మైలారి హోటల్, రాజుహోటల్ల దగ్గర పొద్దుపొద్దున్నే క్యూలో జనాలు కనిపించేవాళ్లు. అప్పటి రుచులే వేరు. ఇప్పుడు ఆ రుచి కనిపించడం లేదు’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో విధానపరిషత్‌లో ప్రతిపక్ష నేత ఈశ్వరప్ప కలగజేసుకుంటూ....‘ఇలా నాటుకోడి కూర, బోటి అంటూ మీరు చెబుతుంటే మాకు నోరూరుతోంది. ఇలాంటి ఆహారపదార్థాలన్నీ మేం కూడా రుచి చూసేందుకు ఏదైనా ఏర్పాటు చేయకూడదా?’ అంటూ చమత్కరించారు. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ...‘మైసూరుకు రండి, నాటుకోడి కూరతో పాటు బోటి, తలమాంసం ఇలా అన్ని రకాల పదార్థాలు వండి, వడ్డిస్తాం’ అంటూ ఆహ్వానించారు. ఇక ఈ సంభాషణల మధ్య జేడీఎస్ సభ్యుడు ముజీర్ ఆగా కలగజేసుకుంటూ...‘కేవలం ఈశ్వరప్పనేనా మమ్మల్ని కూడా ఆహ్వానించేదేమైనా ఉందా’? అంటూ సిద్ధరామయ్యను ప్రశ్నించారు. దీనిపై సిద్ధరామయ్య స్పందిస్తూ...‘మిమ్మల్ని వదిలి పెట్టి వేరే ఎవరినైనా ఆహ్వానించడం అసలు సాధ్యమేనా’ అనడంతో సభలో నవ్వులు విరబూశాయి.