breaking news
coal produce
-
బొగ్గు కొరతపై కేంద్ర హోంమత్రి అమిత్ షా సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరతపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బొగ్గు సరఫరా సరిపోని కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ కొరత ఏర్పడుతుందని అనేక రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖల ఇన్ఛార్జిగా ఉన్న మంత్రివర్గ సహచరులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి సీనియర్ బ్యూరోక్రాట్లతో పాటు ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ లిమిటెడ్ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో దేశంలోని విద్యుత్ ఉత్పత్తికి తీసుకోవాల్సిన చర్యలు, బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. చదవండి: ‘ఈతరం స్త్రీ పిల్లల్ని కనాలనుకోవడం లేదు’ కాగా దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు ఇతర నగరాల్లో తక్షణం ఏర్పడే విద్యుత్ అంతరాయం భయాలను తొలగించడానికి విద్యుత్ ప్లాంట్ల డిమాండ్‌ను తీర్చడానికి తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే విద్యుత్ అంతరాయాల గురించి అనేక రాష్ట్రాలు కేంద్రాన్ని హెచ్చరిస్తున్నాయి. దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ప్రస్తుత ఇంధన నిల్వ దాదాపు 7.2 మిలియన్ టన్నులు ఉందని, నాలుగు రోజులకు సరిపోతాయని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ యాజమాన్యంలోని మైనింగ్ దిగ్గజం కోల్ ఇండియాలో 40 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు నిల్వ ఉన్నాయని, ఇవి విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే భయం పూర్తిగా తప్పని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది. -
వాన జోరుకు బొగ్గు ఉత్పత్తి నిలిపివేత
-
బొగ్గు ఉత్పత్తిలో నంబర్ వన్
సాక్షి, హైదరాబాద్: బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి బొగ్గు గనుల సంస్థ అత్యుత్తమ ఫలితాలు సాధించి దేశంలోనే నంబర్ వన్‌గా నిలవడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్, ఇతర ఉద్యోగులను ముఖ్యమంత్రి అభినందించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో డివిడెండ్‌గా రూ.66.42 కోట్ల చెక్కును సింగరేణి సీఎండీ శ్రీధర్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సింగరేణి కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ మొత్తం రూ.409 కోట్ల లాభాలు గడించింది. రాష్ట్రానికి 7.5 శాతాన్ని డివిడెండ్‌గా నిర్ణయించింది. దీని ప్రకారం 51 శాతం వాటా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి రూ.66.42 కోట్లు, 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి రూ.63.58 కోట్లు లభిస్తాయి. 2014-15 సంవత్సరంలో 520 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సింగరేణి, 2015-16లో 600 లక్షల టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఎనిమిది కోల్ ఇండియా సంస్థల్లో కెల్లా సింగరేణి అత్యధిక ఉత్పత్తి సాధిస్తున్న సంస్థగా నిలిచింది. తెలంగాణలోనే మరో 50 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని, అయినా ఇతర చోట్ల కూడా గనులను నిర్వహించాలని సంస్థ అధికారులను సీఎం కోరారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇంధనశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, సింగరేణి డెరైక్టర్ రమేశ్ బాబు, జీఎం నాగయ్య పాల్గొన్నారు. -
ఆర్కే-5బీ సెక్షన్ మూసివేత!
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-5 ఇంక్లయిన్ పరిధిలోని 5బీ సెక్షన్‌ను ఈ నెల 15 నుంచి మూసివేయడానికి యాజమాన్యం రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి శనివారం గనిపై నోటీస్‌ను కూడా వేశారు. ఇక ఆర్కే-5 ఇంక్లయిన్ నుంచే వర్క్ డిస్ట్రిబూషన్ జరుగుతుందని పేర్కొన్నారు. దీంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మొదట్లో ఆర్కే-5 ఇంక్లయిన్ ఒక్కటే ఉండేది. గని లోపలికెళ్లిన కొద్ది పనిస్థలాలు దూరం అయ్యాయి. దీంతో పదమూడేళ్ల క్రితం యాజమాన్యం మరో టన్నెల్ తవ్వి దానికి 5బీ సెక్షన్‌గా నామకరణం చేసి నడిపిస్తూ వస్తోంది. ఆర్కే-5 ఇక్లయిన్ మేనేజర్ పరిధిలోనే వ్యహారాలు ఉన్న ఈ సెక్షన్‌కు ప్రత్యేక అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు ఉన్నారు. ల్యాంప్‌రూం, మ్యాగ్జిన్ కూడా వేరువేరుగా ఉన్నాయి. రెండు మ్యాన్వేలు, రెండు హాలేజీ వేల ద్వారా బొగ్గు ఉత్పత్తి అవుతున్నది. ఆర్కే-5 గని పరిధిలో మొత్తం 2,100 మంది ఉంటే అందులో 5బీ సెక్షన్లో 700 మంది కార్మికులు.. అధికారులు, సూపర్వైజర్ సిబ్బంది 60 మంది వరకు పని చేస్తున్నారు. ఎక్కడికక్కడే వర్క్డిస్ట్రిబూషన్లు జరుగుతాయి. ఆర్కే-5 ఇక్లయిన్కు మేనేజర్ ఉన్న 5బీ సెక్షన్ కోసం ప్రత్యేక ఇన్చార్జి ఉన్నారు. ఈ రెండింటిలో ఎస్డీఎల్, హ్యాండ్ సెక్షన్ ద్వారా బొగ్గు తీస్తున్నారు. పైన రెండు వేరువేరుగా ఉన్న లోపల మాత్రం పనిస్థలాలు అనుసంధాన మయ్యే ఉంటాయి. అయితే గతేడాది ఉత్పత్తి లక్ష్యం 6.35 లక్షలు ఉందని, ఈ యేడు కొత్త పనిస్థలాలకు అనుమతి లేకపోవడంతో ఉత్పత్తి లక్ష్యాన్ని 4 లక్షలకు త గ్గించి పెట్టారని ఇంతదానికి రెండింటి నుంచి వ్యవహారాలు నడిస్తే నష్టం వస్తుందని పేర్కొంటు 5బీ సెక్షన్‌ను మూసి వేస్తున్న అధికారులు పేర్కొంటున్నారు. ఆర్కే-5 నుంచే పనులు ఇక 5బి సెక్షన్ కార్మికులంతా ఈ నెల 15 నుంచి ఆర్కే 5 నుంచే విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆర్కే 5గని లోపల నుంచే 5బీ సెక్షన్లో ఉండే పనిస్థలాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది చాలా దూరం అవుతుందని కార్మికులు పేర్కొంటున్నారు. ఐతే ఈ రెండు గనులను కలుపుతు లెవల్మ్యాన్ ైరె డింగ్ ఇప్పటికే వేసి ఉందని, 5బీ సెక్షన్ నుంచి దిగి వెళ్లిన 5 ఇంక్లయిన్ నుంచి దిగి వెళ్లిన కార్మికులు నడక ప్రయాస ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. పాలన పరమైన సర్దుబాటే తప్ప కార్మికులకు నష్టం ఏమి లేద ని అధికారుల వాదన. వ్యూహాత్మకంగానే మూసివేత గనిలో ప్రస్తుతం హ్యాండ్ సెక్షన్, ఎస్డీఎల్ రెండు సెక్షన్ల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరిగేది. ఇకపై హ్యాండ్ సెక్షన్‌ను బంద్ చేయనున్నారని తెలిసింది. కారణం కొత్త హ్యాండ్ సెక్షన్ పనిస్థలాలకు అనుమతులు లేవనే కారణంతో ఈ సంవత్సరం ఉత్పత్తి లక్ష్యం గత యేడు కంటే 2.3 లక్షల టన్నులు తక్కువగా పెట్టారు. దీంతో కార్మికుల సంఖ్యను కుదించడంలో భాగంగా ఇప్పటికే 150 మందిని ఇతర గనులకు బదిలీ చేశారు. ఈ నెల 15 తరువాత 5బీ సెక్షన్ మూసివేస్తే మరో 300 మందిని బదిలీ చేస్తారని తెలిసింది. హ్యాండ్ సెక్షన్ నుంచే ఈ బదిలీలు జరుగుతాయని అంటున్నారు. దీంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. హ్యాండ్ సెక్షన్ మూసి వేసి గనిని పూర్తిగా ఎస్డీఎల్స్ ద్వారానే నడుపాలని నిర్ణయానికి వచ్చారని తెలిసింది. భవిష్యత్‌లో కంటిన్యూయస్ మైనర్ ఆలోచనతోనే యాజమాన్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని వినిపిస్తుంది. దీని కోసంమే 5బీ సెక్షన్‌ను మూసేస్తున్నారు. పని వేళలు కూడా మార్పు కొన్ని నెలల నుంచి 5బి సెక్షన్లో పాత పని వేళలు తీసేసి కొత్త పనివేళలు పెట్టారు. జనరల్ షిఫ్ట్‌ను ఉదయం 5 గంటల నుంచి షిఫ్ట్‌ను 8 గంటల నుంచి పెట్టారు. దీనిపై తీవ్ర వ్యతిరేక వచ్చిన అధికారులు పట్టించుకోకుండా ఈ పని వేళలే కొనసాగిస్తున్నారు. ఇదే పనివేళలను కొద్ది రోజుల క్రితం ఆర్కే 5గనిలో పెట్టాలని చూస్తే తీవ్ర వ్యతిరేక రావడంతో యాజమాన్యం వెనక్కు తగ్గింది. ఇప్పుడు 5బీ సెక్షన్ మూసి వేసిన తరువాత ఈ ఆర్కే 5గనిలో కూడా కొత్త పనివేళలు పెట్టడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిపై కూడా కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు తమ సొంత ప్రాపకాన్ని పూర్తి స్థాయి అధికారులకు చూపేందుకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తు గనిని నాశనం చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైన 15వ తేదీ తరువాత ఆర్కే 5గనిలో చోటు చేసుకొనే పరిస్థితులు ఆసక్తికరంగానే ఉండే అవకాశం ఉంది. ఉత్పత్తి లక్ష్యం తక్కువగా ఉందని.. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే 2.3 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం తక్కువగా పెట్టారు. రెండు గనుల నుంచి డిస్ట్రిబూషన్, రెండు ల్యాంప్‌రూం వంటి అన్ని రెండు చోట్ల నుంచి నిర్వాహణ అవసరం లేదని భావించాం. 15 నుంచి ఒకే చోటు నుంచి వర్క్డిస్ట్రిబ్యూట్ చేయడానికి నిర్ణయించాం. ఇంకా దీనిపై చర్చలు జరుగుతున్నాయి. పూర్తిగా ఫైనల్ కావాల్సి ఉంది.