breaking news
CM bungalow
-
అఖిలేశ్ ఇలా కోపం తీర్చుకున్నారా...!?
లక్నో : సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఈనెల(జూన్) 2న తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన విషయం తెలిసిందే. అయితే అఖిలేశ్ ఖాళీ చేసిన 4- విక్రమాదిత్య మార్గ్‌లోని బంగ్లాను స్వాధీనం చేసుకోవడానికి శనివారం ఉదయం మీడియాతో సహా అక్కడికి చేరుకున్న ప్రభుత్వ అధికారులు షాక్‌కు గురయ్యారు. ‘ఇదొక దుర్దినం, జీవితం చాలా చిన్నది.. బాధ పడాల్సిన అవసరం లేదంటూ’ గోడలపై రాసి ఉండటంతో పాటు విదేశాల నుంచి తెప్పించిన మార్బుల్స్, టైల్స్, ఏసీలు మాయమవడంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయమై స్పందించిన ప్రభుత్వాధికారి ఒకరు మాట్లాడుతూ.. 2016లో 45 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ అఖిలేశ్ కుటుంబ సభ్యుల అభిరుచికి తగినట్లుగా బంగ్లాను పునరుద్ధరించామన్నారు. స్విమ్మింగ్ పూల్‌లోని టర్కిష్ టైల్స్‌తో పాటు, ఇటాలియన్ మార్బుల్, ఏసీలు, గార్డెన్ లైట్స్ మాయమయ్యాయని తెలిపారు. మార్బుల్స్ తీసుకోవడానికి స్విమ్మింగ్‌పూల్ సహా పలు చోట్ల తవ్వకాలు జరిపడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. అంతేకాకుండా అఖిలేశ్ యాదవ్ తన కోసం ఏర్పాటు చేసుకున్న జిమ్ కూడా మొత్తం ఖాళీగా ఉందని ఆయన వాపోయారు. చర్యలు తీసుకుంటాం.. బంగ్లా నుంచి మాయమైన వస్తువుల జాబితా తయారు చేస్తున్నామని, అదే విధంగా పలు చోట్ల తవ్వకాలు జరపడం పట్ల చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాధికారులు తెలిపారు. మాజీ సీఎం అయి ఉండి ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అనాగరిక చర్య అని వారు పేర్కొన్నారు. మిలియనీర్ అయి ఉండి ఇలా చేస్తారా.. అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ చూస్తే ఆయన ఎంత సంపన్నుడో తెలుస్తుందని యూపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యానించారు. లక్నోలో ఎన్నో ఆస్తులను కలిగి ఉన్న ఆయనకు అమెరికా, లండన్లలో కూడా అనేక బంగ్లాలు ఉండగా ఈవిధంగా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. తన కోసం కొత్తగా నిర్మించుకుంటున్న విల్లా కోసమే ఆయన ఇలా అనాగరిక చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. కాగా బంగ్లా ఖాళీ చేయడం ఇష్టంలేనందు వల్లే అఖిలేశ్ ఈవిధంగా కోపాన్ని తీర్చుకున్నారని విమర్శలు వెల్లువెత్తడంతో సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి స్పందించారు. తమ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌పై ప్రభుత్వ అధికారులు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. కేవలం ఆయన ఇష్టపడి కొనుక్కున్న, బహుమతులుగా లభించిన వాటినే తన వెంట తీసుకెళ్లారని తెలిపారు. -
అఖిలేష్ కోరిన గడువునే.. తండ్రి కూడా
న్యూఢిల్లీ : పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ప్రభుత్వ బంగ్లాలలో ఉంటున్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్‌లకు వాటిని ఖాళీ చేయమని కేంద్రం నోటిసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై గత మంగళవారం స్పందించిన అఖిలేష్ యాదవ్ తనకు అద్దె ఇల్లు దొరికేంత వరకు సమయం ఇవ్వలని లేక సొంత ఇంటి నిర్మాణ చేసుకునేంత వరకు రెండేళ్ల సడళింపు ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టును కోరారు. ఇప్పుడు తండ్రి ములాయం సింగ్ కూడా కొడుకు మాటనే అనుసరిస్తూ.. తనకు కూడా రెండు సంవత్సరాల గడువు ఇవ్వాలని కోరారు. కాగా ములాయం సింగ్ లక్నోలోని విక్రమాదిత్య రోడ్డులో నెం.5 బంగ్లాలో గత 27 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. ఆయన పక్కన నెం.4 బంగ్లాలో అఖిలేష్ యాదవ్ ఉంటున్నారు. ఇది చదవండి : సొంతిల్లు కట్టుకోకుండా తప్పు చేశా: మాజీ సీఎం -
అద్దె ఇంటి నుంచి సీఎం బంగ్లాలోకి...
ఛంఢీఘడ్: అద్దె ఇంటిలో నుంచి సీఎం బంగ్లాలోకి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ అడుగుపెట్టనున్నారు. ఇప్పటి వరకు హర్యానాలోని కర్నల్ పట్ఠణంలోని న్యూ ప్రేమ్ నగర్ లో ఓ అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. తమ మధ్య ఉంటున్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం న్యూ ప్రేమ్ నగర్ వాసుల్ని ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేస్తోంది. హర్యానా రాష్ట్రానికి 10వ ముఖ్యమంత్రిగా ఆదివారం పదవీ స్వీకారం చేసిన మనోహర్ లాల్ ఖట్టార్ అవివాహితుడు. న్యూ ప్రేమ్ నగర్ లోని మూడు పడకల ఫ్లాట్ లో నివాసముంటున్న ఖట్టార్ త్వరలోనే చంఢీఘడ్ లోని సెక్టర్ 3 లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్న బంగ్లాలోకి మారనున్నారు. ఎన్నికల అఫిడవిట్ లో తాను ట్యూషన్ వర్క్, వ్యవసాయం చేస్తున్నట్టు ఆయన దాఖలు చేశారు. ఆదాయపు పన్ను రిటర్న్ ప్రకారం ఖట్టార్ ఆదాయం 273,315 రూపాయలుగా వెల్లడించారు.