సీఐ మెడకు వెంకట్ రెడ్డి అనుమానాస్పద మృతి కేసు!
హైదరాబాద్: గత ఐదు రోజుల క్రితం అదృశ్యమైన వెంకట్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన వనస్థలిపురం సీఐ గోపాలకృష్ణమూర్తి మెడకు చుట్టుకుంది. తొలుత అదృశ్యమైన వెంకట్ రెడ్డి.. ఓ గెస్ట్ హౌస్ లో అనుమానస్పద పరిస్థితిలో మరణించాడు. కాగా ఆయన రాసిన సూసైడ్ నోట్ కాస్తా వివాదంగా మారింది. తన ఆత్మహత్యకు వనస్థలిపురం సీఐ గోపాలకృష్ణమూర్తి, రియల్టర్ సామ గణేష్ రెడ్డిలే కారణమంటూ అతను లేఖలో పేర్కొనడంతో కలకలం రేపుతోంది.
హయత్ నగర్ మండలం యాల్యాల్ గెస్ట్‌హౌస్‌లో వెంకట్‌రెడ్డి మృతదేహాన్ని గుర్తించడంతో సూసైడ్ నోట్ విషయం వెలుగులోకి వచ్చింది. అతను అదృశ్యమైనప్పుడు ఆచూకీ కోసం వెంకటరెడ్డి బంధువులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరపాలంటూ రెండు రోజుల క్రితమే హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆదేశాలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.