breaking news
	
		
	
  Chief Minister of Telangana
- 
      
                   
                                                       న్యూయార్క్‌లో ఉన్న వాళ్లను ఫ్యూచర్ సిటీకి రప్పిస్తా: సీఎం రేవంత్సాక్షి, రంగారెడ్డి: ఇంకెన్నాళ్లు టోక్యో, న్యూయార్క్ అంటూ గొప్పలు చెప్పుకుంటామని.. భావితరాలకూ అలాగే ఓ నగరం ఉండాలనే ఆలోచనతో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఫ్యూచర్ సిటీని అడ్డుకునేందుకు చాలామంది కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. చేయకూడని రాద్ధాంతాలు చేస్తున్నారు. ఇక్కడ రేవంత్‌కు భూములు ఉన్నాయని, అందుకే నగరాన్ని నిర్మిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. భూములుంటే దాచితే దాగేది కాదు. రికార్డుల్లో ఉంటాయి. అందరికీ తెలిసిపోతుంది. కుతుబ్‌షాహీలు నగరాన్ని నిర్మిస్తే.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లాంటి నాయకులు ఆలోచన చేశారు. అలాంటి వాళ్లు మాకెందుకులే అనుకుని ఉంటే ఇవాళ ఓఆర్ఆర్, శంషాబాద్‌లు ఏవీ వచ్చేవి కావు. గత అనుభవాలు పునాది కావాలి. భూముల విలువ నాకు తెలుసు. నేను ఎవరికీ అన్యాయం చేయను. చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించుకుందాం. ఫ్యూచర్ సిటీకి స్థానికులు సహకరించాలి. ఇంకెన్నాళ్లు న్యూయార్క్, టోక్యో నగరాలంటూ మాట్లాడుకుందాం. ఎందుకు మనమే ఫ్యూచర్ సిటీ నిర్మించుకోవద్దు. నాకు పదేళ్లు అవకాశం ఇవ్వండి. న్యూయార్క్‌లో ఉన్నవాళ్లు కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చేస్తాం. బుల్లెట్ రైలు వచ్చేలా కేంద్రాన్ని ఒప్పించాం. ఫ్యూచర్ సిటీ మన కోసం కాదు.. భవిష్యత్తు తరాల కోసం అని సీఎం రేవంత్ అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ నుంచి బందరుపోర్ట్ వరకు అమరావతి మీదుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సీఎం రోడ్డు మంజూరు చేయించారు. ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు వరకు రోడ్డు నిర్మాణం చేయనున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి పనులు ఫ్యూచర్ సిటీ లో జరగనున్నాయి. భవిష్యత్ లో ఫ్యూచర్ సిటీ ప్రపంచానికి తలమానికం కానుంది. రేవంత్ రెడ్డి సంకల్పం త్వరితగతిన పూర్తికావాలని కోరుకుంటున్నా అని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేసుకున్నాం. ప్రణాళిక బద్దమైన నగరంగా చండీఘడ్ నిర్మించారు. అదే తరహాలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్నాం. వాణిజ్యం, వ్యాపారం చేసే వారికి అనుకూలంగా అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నాం. స్పోర్ట్స్ క్యాపిటల్ చేసే విధంగా క్రీడా విశ్వవిద్యాలయం అందేలా చర్యలు చేపడతాం. జీరో పోల్యూటెడ్ ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం. భారత్ ఫ్యూచర్ సిటీ గా రూపుదిద్దడానికి స్థానికులు భాగస్వాములు కావాలని కోరుతున్నా అని ప్రసంగించారు. ఇదీ చదవండి: ఫోర్త్ సిటీ కాదు.. ఉన్న సిటీని పట్టించుకోండి
- 
      
                   
                                                       యూరియా కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే భారీ వితరణసాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నదే. అయితే తన నియోజకవర్గంలోని రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Batthula Laxma Reddy), ఆయన కుటుంబసభ్యులు భారీ విరాళం అందించారు. ఇటీవల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భావించారు. కానీ రిసెప్షన్‌ను రద్దు చేసుకుని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేసేందుకు ఆయన ముందుకు వచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్ (Revanth Reddy)ను లక్ష్మారెడ్డి కలిసి రూ.2కోట్ల చెక్ అందజేశారు. తాను అందించిన వితరణతో లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందించాలని సీఎంను ఆయన కోరారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబసభ్యులను సీఎం రేవంత్ అభినందించారు.
- 
      
                   
                                 మెట్రో, ఫార్మా సిటీ రద్దు చెయ్యం: సీఎం రేవంత్‌రెడ్డిహైదరాబాద్, సాక్షి: గత ప్రభుత్వ హయాంలో తీసుసుకున్న మెట్రో, ఫార్మా సిటీ నిర్ణయాలను తమ ప్రభుత్వం రద్దు చేయబోవట్లేదని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన పలు వివరాలను వెల్లడించారు. గత ప్రభుత్వం తీసుకున్న మెట్రో, పార్మా సిటీ నిర్ణయాలను రద్దు చేయడం లేదు. ప్రజా ప్రయోజనాన్ని దృషష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఎయిర్‌పోర్టుకు దూరం తగ్గిస్తాం. హైదరాబాద్ మెట్రో 6 సెక్టార్ లలో మెట్రో విస్తరణ చేస్తున్నాం. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు విస్తరిస్తాం. నాగోలు నుంచి ఎల్బీ నగర్, ఒవైసీ ఆస్పత్రి వద్ద ఛాంద్రాయణ గుట్ట వద్ద మెట్రో లైన్‌కు లింక్ చేస్తాం. మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రబాపురం వరకు మెట్రో రైలు విస్తరిస్తాం. అవసరమైతే హైటెక్ సిటీ దాకా ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వరకు పొడిగిస్తాం అని అన్నారాయన. గత ప్రభుత్వం ప్రతిపాదించిన దానికంటే తమ ప్రతిపాదనే తక్కువ ఖర్చు అవుతుందని తెలిపారయన. ఇక గతంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా ఉన్న భవనాన్ని.. స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా.. 15 స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయబోతున్నాం. సంక్రాంతి లోపు అన్ని కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తాం. ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాలను ఏర్పాటు చేస్తాం. మా ప్రభుత్వంలో.. ఆర్థిక భారం పడే నిర్ణయాలు ఉండవు. అన్ని నిర్ణయాల అమలుకు టార్గెట్ 100రోజులు పెట్టుకుని.. కచ్చితంగా అమలు చేస్తాం అని రేవంత్‌రెడ్డి తెలిపారు. మెట్రో రెండో దశలో భాగంగా రాయదుర్గం రహేజా మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు పనులకు.. సీఎంగా కేసీఆర్ శంకుస్థాపన సైతం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్‌రెడ్డి.. మెట్రో విస్తరణ ప్రతిపాదనతో పాటు ఫార్మా సిటీపైనా పలుమార్లు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ నిర్ణయాలను ఆయన రద్దు చేయవచ్చని అంతా భావించారు. అయితే.. రద్దు చేయకుండా వాటిలో సమూల మార్పులు చేయడం గమనార్హం.
- 
      
                   
                                 నా మనోవ్యధను అర్థం చేసుకున్నారు: మాజీ డీఎస్పీ నళినిసాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో.. తన డీఎస్పీ పదవికి దూరమై వార్తల్లోకి ఎక్కారు నళిని. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆమె పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఉద్యమకారులకు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు తమ ప్రభుత్వంలో స్థానం ఉంటుందని.. ఆమె కోరుకుంటే అదే ఉద్యోగం కుదరకుంటే వేరే ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి సీఎస్‌ను ఆదేశించారు కూడా. ఈ తరుణంలో.. శనివారం ఆమె రేవంత్‌రెడ్డిని కలిశారు. అయితే.. తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనను ఆమె ఇదివరకే తిరస్కరించారు. తనకు ఉద్యోగంలో ఆసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ కేవలం మర్యాదపూర్వక భేటీ జరిగిందంతే. గత సమీక్షలో తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అధికారులు సమాచారం అందించగా ఆమె సీఎం రేవంత్‌ను ఇవాళ కలిశారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డిని కలువడం సంతోషంగా ఉంది. ఉద్యోగం ఇప్పుడు నాకు అవసరం లేదు. డబ్బు, భౌతిక ప్రపంచం నుండి బయట పడ్డాను. ఇప్పుడు నాది ఆధ్యాత్మిక మార్గం. వేద కేంద్రాలకు ప్రభుత్వ సహకారం అడిగాను.. సీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వేదం , యజ్ఞం పుస్తకాలు పూర్తి చేస్తున్నా. సనాతన ధర్మం ప్రచారం చేస్తా. గతంలో నేను, సహఉద్యోగులు డిపార్ట్ మెంట్లో ఎదుర్కొన్న సమస్య పై సీఎంకు రిపోర్ట్ ఇచ్చాను. నాలాగా ఎవరు భాద పడవద్దన్నదే నా అభిప్రాయం. అప్పుడే నాకు బ్యూరోక్రసీ మీద నమ్మకం పోయింది. అందుకే ఆధ్యాత్మిక బాట ఎంచుకున్నా. నా విషయంలో జరిగిన అన్ని పరిణామాలు సీఎం దృష్టికి తీసుకెళ్లా. ఇప్పుడు నా మనసుకు నచ్చినట్లు సేవ చేస్తున్నా. ఇన్నాళ్ల నా మనోవ్యధను గుర్తించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి.. సీఎం రేవంత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారామె.
- 
      
                   
                                 ప్రజా పాలన.. వాళ్లు అప్లై చేయక్కర్లేదు: సీఎం రేవంత్రెడ్డిసాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారెంటీల ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. అలాగే దరఖాస్తు విషయంలో ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు ఓ స్పష్టత ఇచ్చారాయన. ప్రజా పాలన దరఖాస్తుల సరళి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే.. ప్రజా పాలన ఫామ్‌లు బయట అమ్ముతుండడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇక.. రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు మరోసారి స్పష్టంగా సూచించారు.
- 
      
                   
                                 సీఎంగా కేటీఆర్‌కు ముహుర్తం ఫిక్స్?తెలంగాణ మున్సిపల్ , ఐటీ శాఖల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి సమయం మరికాస్త దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. శాసనసభలో ఆయన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి జవాబు ఇచ్చిన తర్వాత పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి అభినందించారు. ఆ నేపధ్యంలో కేటీఆర్ త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారేమోనని ఆ పార్టీలో చర్చలు సాగుతున్నాయి. ఒకటి, రెండు ఆంగ్ల పత్రికలు సైతం ఆ కోణంలో విశ్లేషణలు ఇచ్చాయి. ఈ ఏడాది డిసెంబర్లో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ లోగానే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? లేక వచ్చే ఎన్నికలలో గెలిస్తే సీఎం అవుతారా? అన్న చర్చ జరుగుతోంది. సాధారణంగా గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగే చర్చకు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు జవాబు ఇస్తారు. కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబు ఇవ్వకుండా కేటీఆర్‌తో మాట్లాడించారు. గతంలో ఎన్నడూ ఇలా జరిగిన సందర్భం లేదు. ఎప్పుడైనా అరుదుగా ఉంటే, ఉందేమో తెలియదు కానీ.. ముఖ్యమంత్రులు ఈ జవాబు ఇవ్వడాన్ని ప్రతిష్టగా తీసుకుంటారు. తద్వారా తన ప్రభుత్వ విజయాలను చెప్పుకోవడానికి దీనిని ఒక అవకాశంగా భావిస్తారు. గత సంవత్సరం అసలు గవర్నర్ ప్రసంగం లేదు కనుక సమాధానం ఇవ్వాల్సిన అవసరం రాలేదు. అయినా ఆయా సమయాలలో కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. ఈసారి గవర్నర్ తమిళిసైకి, కేసీఆర్‌కు మధ్య విబేధాలు బాగా పెరగడం, చివరికి బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం ఇవ్వకుండా నిలపడం, ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడం, తదుపరి రెండు వర్గాలు రాజీపడటం జరిగాయి. ఆ తర్వాత గవర్నర్‌ను కేసీఆర్ సగౌరవంగానే ఆహ్వానించి, స్పీచ్ తర్వాత మర్యాదగానే వీడ్కోలు పలికారు. గవర్నర్ కూడా స్పీచ్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. కానీ, ఇప్పుడు కేసీఆర్ కాకుండా కేటీఆర్ సంబంధిత తీర్మానంపై జవాబు ఇవ్వడం సహజంగానే చర్చకు దారి తీస్తుంది. కేసీఆర్‌కు ఈ అంశంపై సభలో మాట్లాడడం ఇష్టం లేదని, అందువల్లే కేటీఆర్‌కు అవకాశం ఇచ్చారని కొందరు అంటున్నారు. ఒకవేళ సీఎం ప్రసంగించకపోతే, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి మాట్లాడవచ్చు. లేదా ఆర్ధిక మంత్రి, సీనియర్ అయిన హరీష్ రావుకు అప్పగించవచ్చు. కానీ.. కేటీఆర్‌తో మాట్లాడించడం ద్వారా కాబోయే సీఎం ఆయనే.. అన్న సంకేతాన్ని బలంగా ఇప్పించినట్లు అనుకోవచ్చు. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా ఇచ్చి పార్టీ పగ్గాలు ఇచ్చారు. పార్టీలో ఆయనకు పెద్దగా పోటీ లేకుండా వాతావరణం ఏర్పాటు చేశారు. కేటీఆర్ కూడా సమర్ధంగానే డీల్ చేస్తుంటారు. ప్రత్యేకించి తెలుగుతో పాటు, ఆంగ్లం, హిందీలలో అనర్గళంగా మాట్లాడగలరు. కేసీఆర్ కుటుంబానికి ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కేటీఆర్ తమది కుటుంబ పాలన అంటూ, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబం అని చెప్పడం ఆసక్తికరంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఒక చిక్కు ఉంది. ప్రత్యర్దులు ఇకపై కేటీఆర్ తమది కుటుంబ పాలన అని ఒప్పుకున్నారు అనే వరకే తీసుకుని ప్రచారం చేసే అవకాశం ఉంది. అది వేరే విషయం. కేటీఆర్ తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ అబివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించడంతో పాటు, ప్రధాని మోడీపై, పారిశ్రామికవేత్త ఆదానీలపైన కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశం అంటే మోదీ, అదానీలేనా అని ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీపై ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ దాడి చేస్తున్న నేపథ్యంలో సహజంగానే కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. కాగా, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీతో సంవాదం మాత్రం ఆశ్చర్యంగా ఉంది. నిజానికి బీఆర్ఎస్, ఎంఐఎంలు మిత్రపక్షాలుగానే ఉన్నాయి. 19 మంది ఉన్న కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీకి ప్రతిపక్షనేత హోదాను బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది. ఆయా ఎన్నికలలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ రెండు పార్టీలు సహకరించుకుంటుంటాయి. అలాంటిది వచ్చే ఎన్నికలలో 50 సీట్లలో పోటీచేస్తామని, పదిహేను సీట్లతో శాసనసభలోకి వస్తామని అక్బర్ చెప్పినా అది నమ్మశక్యంగా లేదు. ఎంఐఎంకు హైదరాబాద్‌లో అది కూడా పాతబస్తీలోని ఏడు సీట్లలో తప్ప, మిగిలిన చోట్ల పెద్దగా బలం లేదు. కాకపోతే, ఆయా నియోజకవర్గాలలో కొంతమేర ఆ పార్టీకి ఓటర్లు ఉన్నారు. ఒకవేళ 50 సీట్లలో పోటీచేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న చర్చ కూడా జరుగుతోంది. కానీ, ఈ పరిణామానికి పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అంగీకరించవలసి ఉంటుంది. కేసీఆర్, అసద్‌ల మధ్య మంచి రాజకీయ ఈక్వేషన్ ఉంది. అసలు అక్బర్ విద్వేష ప్రసంగం కేసు నుంచి బయటపడటానికి ప్రభుత్వం ఎంతగా సాయపడిందో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య వివాదం వస్తుందా అన్నది సందేహమే. పైకి ఇలా మాట్లాడినా.. లోపల అంతా బాగానే ఉండవచ్చన్న అభిప్రాయం ఉంది. అందువల్లే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉందని కొందరు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకన్నా ఎంఐఎం పార్టీనే ప్రతిపక్షం అన్న భావన కల్పించడం ఇందులోని అంతరార్ధం కావచ్చేమో. కేసీఆర్ దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అభివృద్దికి పర్యటించాలని భావిస్తున్నారు. ఒకవేళ కేంద్రానికి ఆయన వెళ్లాలనుకుంటే వచ్చే లోక్‌సభ ఎన్నికలలో పోటీచేసే అవకాశం ఉంటుంది. అప్పుడు కేటీఆర్ తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారని అనుకోవచ్చు. వచ్చే శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలిస్తే ఈ పరిణామం జరగడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్.
- 
      
                   
                                 కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం ఆయనే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలుసాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇటీవలి కాలంలో కేంద్రం నుంచి బీజేపీ పెద్దలు తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టండి అంటూ ప్రజలను పదే పదే కోరారు. అప్పుడే తెలంగాణకు విముక్తి కలుగుతుందని కామెంట్స్ చేశారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తర్వాత సీఎం అయ్యేది కేటీఆరే. మా భవిష్యత్ నాయకుడు కేటీఆరే. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చు. గతంలో చిరంజీవి వచ్చారు.. ఇప్పుడు పవన్ కల్యాణ్ వస్తారేమో? అంటూ కామెంట్స్ చేశారు.
- 
            
                                     
                                                             ఆనందం ‘విరి’సే..


