breaking news
Channels ban
-
సాక్షి టీవీ సహా 4 ఛానళ్ల జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ
-
నిలిపివేయడం సరికాదు: NBDA
-
400 ఛానెళ్లపై నిషేధం
చైల్డ్ అబ్యూజ్ (చిన్నారులను హింసించటం)పై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో యూట్యూబ్ 400 పైగా ఛానళ్లను నిషేధించింది. ముఖ్యంగా యూ ట్యూబ్‌లో పెడోఫిలియా స్కాంపై వినియోగదారుల్లో ఆందోళనలు పెరుగుతున్న క్రమంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే పిల్లల దోపిడీని ప్రోత్సహించే కంటెంట్‌ను, వ్యాఖ్యలను కూడా నిషేధిస్తున్నట్టు యూ ట్యూబ్ ప్రకటించింది. నెస్లే, డిస్నీ,ఎపిక్, మెక్‌డొనాల్డ్ లాంటి టాప్ బ్రాండ్ల ప్రకటనలను తన ప్లాట్‌ఫాంపై నిలిపివేసిన అనంతరం నాలుగువందలకు పైగా ఛానెళ్లపై నిషేధాన్ని ప్రకటించింది యూట్యూబ్. చిన్నపిల్లలను దారుణంగా ప్రభావితం చేస్తున్న అశ్లీల వీడియోలు, వాటిపై చెత్త కమెంట్లకు అనుమతినిస్తున్న యూట్యూబ్‌లోని అల్గోరిథంపై గతవారం రెడిటర్ మాట్విల్సన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇది పోర్నోగ్రఫీకి, చిన్నపిల్లల్లో తీవ్రమైన మానసిక వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరించడంతో సంస్థ ఈ దిద్దుబాటు చర్యలకు దిగింది. -
చానెళ్ల బంద్‌తో సంబంధం లేదు
హైదరాబాద్: తెలంగాణలో చానెళ్ల ప్రసారాలను అడ్డుకోవడానికి, ప్రభుత్వానికి సంబంధం లేదని ఐటీ మంత్రి కే రామారావు స్పష్టం చేశారు. చానెళ్లు, ఎంఎస్ఓ ప్రతినిధులు కలసి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. తెలంగాణలో ఉండాలంటేతెలంగాణలో చానెళ్ల ప్రసారాలను అడ్డుకోవడానికి, ప్రభుత్వానికి సంబంధం లేదని ఐటీ మంత్రి కే రామారావు స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలను గౌరవించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు అన్నారని, ఈ వ్యాఖ్యలను వివాదాస్పదం చేయవద్దని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలను మనోభావాలను కించపరిచారనే ఉద్దేశ్యంతో ఎబీఎన్, టీవీ 9 చానెళ్ల ప్రసారాలను రాష్ట్రంలో రద్దు చేసిన సంగతి తెలిసిందే.