‘అవతరణకు’ అంతా రెడీ
ముస్తాబైన ప్రకాశం స్టేడియం
నేడు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
హాజరుకానున్న సీఎండీ శ్రీధర్
కొత్తగూడెం(ఖమ్మం) : తెలంగాణ రాష్ట్రం అవతరణ వేడుకలను పురస్కరించుకొని సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిర్వహించే సెంట్రల్ ఫంక్షన్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కంపెనీ వ్యాప్తంగా వేడుకలకు నిధులు విడుద ల చేయగా 11 ఏరియాల్లో కార్మిక కుటుంబాల సభ్యులకు వివిధ పోటీలు నిర్వహిస్తుండడంతో పడుగ వాతావరణం నెలకొంది. స్థానిక ప్రకాశం స్టేడియంలో సెంట్రల్ ఫంక్షన్కు సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ హాజరవుతున్నారు. స్టేడియంలో రంగురంగుల జెండాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు.
గురువారం ఉదయం సింగరేణి ప్రధాన కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు రన్ నిర్వహించనున్నారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు వివిధ ఆటల పోటీలు, సాయంత్రం సినీ, టీవీ కళాకారులచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటారుు. ఈ సం దర్భంగా వేడుకల ఏర్పాట్లపై జీఎం(పర్సనల్) బుధవారం వివిధ విభాగాల అధికారులతో కార్యాలయంలో సమావేశం నిర్వహించి స్టేడియంలో ఏర్పాట్లపై సమీక్షించారు.