breaking news
certificates varification
-
ఏపీలోని గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో అవకాశం
సాక్షి, అమరావతి: గ్రూప్–2 పోస్టుల భర్తీ కోసం గతంలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించి కోర్టు ఆదేశాల ప్రకారం సవరించిన అర్హుల జాబితాలోని అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు మరో అవకాశం కల్పిస్తున్నట్టు ఏపీపీఎస్సీ శుక్రవారం తెలిపింది. చదవండి: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. అడ్మిషన్ల షెడ్యూల్ ఇదే.. అప్పట్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన, బయోడేటా సమర్పణకు కొంతమంది హాజరు కాలేకపోయారని పేర్కొంది. వారు ఈ నెల 5న విజయవాడలోని కమిషన్ కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన, బయోడేటా వివరాల సమర్పణకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరింది. -
ప్రజల వద్దకే ఎల్ఎల్ఆర్ టెస్ట్
సాక్షి, కర్నూలు : రవాణా శాఖ సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఆ శాఖ అధికారులు జిల్లాలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం ఉత్తర్వుల మేరకు ఆ శాఖ కర్నూలు అధికారులు ప్రజల వద్దకు ఎల్ఎల్ఆర్ టెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సంకల్పించారు. ఇందుకు సంబంధించి తాండ్రపాడు శివారు రవాణా శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఉపకమిషనర్ బసిరెడ్డి శనివారం అధికారులతో సమీక్షించారు. ఈనెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఎల్ఆర్ మేళాకు కార్యాచరణ రూపొందించారు. మొదటి రోజు ఈ నెల 18వ తేదీన కర్నూలు సి.క్యాంప్ సెంటర్, బనగానపల్లె, డోన్ పట్టణాలతోపాటు ఆదోని దగ్గర బైచిగేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామీణులంతా సద్వినియోగం చేసుకునేలా చూడాలని బసిరెడ్డి సూచించారు. గ్రామాల్లోని కామన్ సర్వీస్ సెంటర్ (పౌర సేవా కేంద్రం) వద్ద పేరు నమోదు చేసుకుని రుసుం చెల్లిస్తే నిర్ణీత తేదీల్లో రవాణా శాఖ అధికారులే గ్రామానికి వచ్చి పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయించారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి అక్కడే ఎల్ఎల్ఆర్ జారీ చేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆధార్ కార్డు, వయసు, నివాస ధృవీకరణ పత్రాలతోపాటు ఒక వాహనానికైతే రూ.260, రెండింటికైతే రూ.410 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. -
12 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈనెల 12వ తేదీ నుంచి ఎంసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎంసెట్ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఈనెల 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకు విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనుంది. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శనివారం మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఎంసెట్–2017 ప్రవేశాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాంకేతిక విద్యా కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ వాణిప్రసాద్, క్యాంపు ఆఫీసర్ బి.శ్రీనివాస్, జేఎన్టీయూహెచ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవేశాల షెడ్యూలును ఖరారు చేశారు. జేఎన్టీయూహెచ్ అధికారులు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల అనుబంధ గుర్తింపును ఈనెల 10వ తేదీలోగా ఇస్తామని వెల్లడించారు. దీంతో షెడ్యూలును ప్రకటించారు. ఈనెల 12వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 16వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ వెరిఫికేషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 21 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆధార్, బయోమెట్రిక్ తప్పనిసరి.. ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు ఈసారి ఆధార్, బయోమెట్రిక్‌ను తప్పనిసరి చేశారు. వెరిఫికేషన్ సమయంలో అవి తప్పనిసరి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్ టికెట్, ఆధార్‌కార్డు, ఎస్ఎస్సీ మార్కుల మెమో, ఇంటర్మీడియట్ మెమో కమ్ పాస్ సర్టిఫికెట్, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఈ ఏడాది జనవరి 1న, ఆ తరువాత జారీచేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, వికలాంగులు, స్పెషల్ కేటగిరీ వారు ఆయా సర్టిఫికెట్లు, నాన్ లోకల్ వారైతే వారి తల్లిదండ్రులు తెలంగాణలో గతంలో 10 ఏళ్ల పాటు నివసించినట్లు ఉన్న ధ్రువీకరణ పత్రం, రెగ్యులర్ స్టడీ లేని వారు ఏడేళ్లపాటు ఇక్కడ నివసించి ఉన్నట్లు నివాస ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి. స్పెషల్ కేటగిరీ వారికి విద్యాభవన్లోనే ఆర్మ్డ్ ఫోర్సెస్‌కు సంబంధించిన వారు, ఎన్సీసీ, స్పోర్ట్స్, వికలాంగులు వంటి స్పెషల్ కేటగిరీకి చెందిన వారికి మాసబ్ ట్యాంకు సాంకేతిక విద్యా భవన్‌లోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు విద్యార్థులు తమ ర్యాంకుల ప్రకారం స్వయంగా నిర్ణీత తేదీల్లో హాజరు కావాలి. విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. అప్పుడే మంచి కాలేజీల్లో సీటు లభించే అవకాశం ఉంటుంది. ప్రతి విద్యార్థి కాలేజీలో చేరే సమయంలో ట్రాన్స్ సర్టిఫికెట్ (టీసీ) అందజేయాలి. వెబ్సైట్లో గతేడాది కేటాయింపుల వివరాలు.. గత ఏడాది ఎంసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ భాగంగా ఏ ర్యాంకుల వారీకి ఏ కాలేజీలో సీట్లు లభించాయన్న వివరాలను ్టట్ఛ్చఝఛ్ఛ్టి.nజీఛి.జీn వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ వెల్లడించారు. కాలేజీ వారీగా, కేటగిరీ వారీగా, జెండర్ వారీగా 2016లో ఏయే ర్యాంకుల వారీకి ఏయే బ్రాంచీల్లో సీట్లు లభించాయన్న వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. వాటి ఆధారంగా ప్రవేశాల విషయంలో ఓ అంచనాకు వచ్చే వీలుందని పేర్కొన్నారు. అయితే ఈసారి అందుబాటులోకి వచ్చే కాలేజీలు, సీట్లను బట్టే కేటాయింపులు ఉంటాయని వివరించారు. ఎంసెట్ ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు తమ వెబ్సైట్లో పొందవచ్చని సూచించారు. ఇదీ ప్రవేశాల షెడ్యూలు.. 12–6–2017 నుంచి 21–6–2017 వరకు: సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 16–6–2017 నుంచి 22–6–2017 వరకు: వెబ్ ఆప్షన్లు 22–6–2017, 23–6–2017: వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం 28–6–2017: మొదటి దశ సీట్లు కేటాయింపు 3–7–2017లోగా: కాలేజీల్లో చేరడం. ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలు.. తేదీ ర్యాంకు 12–6–2017 1 నుంచి 6 వేలు 13–6–2017 6001 నుంచి 16 వేలు 14–6–2017 16,001 నుంచి 26 వేలు 15–6–2017 26,001 నుంచి 36 వేలు 16–6–2017 36,001 నుంచి 46 వేలు 17–6–2017 46,001 నుంచి 56 వేలు 18–6–2017 56,001 నుంచి 68 వేలు 19–6–2017 68001 నుంచి 80 వేలు 20–6–2017 80001 నుంచి 92 వేలు 21–6–2017 92001 నుంచి చివరి ర్యాంకు వరకు. ర్యాంకుల వారీగా వెబ్ ఆప్షన్ తేదీలు.. తేదీలు ర్యాంకు 16–6–2017, 17–6–2017 1 నుంచి 36 వేలు 18–6–2017, 19–6–2017 36001 నుంచి 56 వేలు 20–6–2017, 21–6–2017 56001 నుంచి 80 వేలు 21–6–2017, 22–6–2017 80001 నుంచి చివరి ర్యాంకు వరకు 22–6–2017, 23–6–2017 వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం 28–6–2017 సీట్లు కేటాయింపు, వెబ్సైట్లో వివరాలు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ హెల్ప్‌లైన్ కేంద్రాలు.. ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం 21 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ వివరాలు.. ► హైదరాబాద్‌లో: జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతాపూర్, – గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీ, ఈస్ట్ మారేడ్‌పల్లి, ►క్యూ క్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్, జూ పార్కు ఎదురుగా. – సాంకేతిక విద్యా భవన్, మాసబ్ ట్యాంకు – జేఎన్టీయూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ కూకట్పల్లి ► ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కరీంనగర్ ►డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ జీఎంఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ వుమెన్ కరీంనగర్. ► ఎస్ ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, ఖమ్మం ►వనపర్తి, మహబూబ్‌నగర్, బెల్లంపల్లి (ఆదిలాబాద్), కొత్తగూడెం, రాజగోపాల్పేట్ (సిద్ధిపేట్), నల్గొండ, వరంగల్, నిజమాబాద్, మెదక్ (వుమెన్) గవర్నమెంట్ పాలిటెక్నిక్‌లలో. ► నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నల్గొండ. ►గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పీజీ బ్లాక్, నిజమాబాద్ ► యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సుబేదారి హన్మకొండ. – కాకతీయ యూనివర్సిటీ వరంగల్.