breaking news
car journey
-
ట్రంప్‌తో జస్ట్ 30 సెకన్లు.. మోదీతో మాత్రం 45 నిమిషాలు
చైనా టియాంజిన్ వేదికగా జరిగిన షాంగై సదస్సు తర్వాత.. భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు ద్వైపాక్షికంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే హోటల్లో భేటీ జరిగింది కేవలం 15 నిమిషాలుకాగా, మరో 45 నిమిషాల ఇద్దరూ కారులోనే ప్రయాణించారు. ఈ ప్రయాణంలో వాళ్లేం మాట్లాడుకున్నారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమైంది. షాంగై సదస్సు కోసం మోదీ రెండ్రోజులపాటు చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. సదస్సు వేదికగా.. పహల్గాం ఉగ్రదాడిపై సభ్యదేశాల మద్దతును తీర్మానం రూపంలో కూడగట్టారాయన. అయితే సోమవారం సదస్సు తర్వాత.. మోదీ కోసం పుతిన్ 10 నిమిషాలు ఎదురు చూశారు. ఆపై మోదీతో కలిసి తన ప్రత్యేకమైన ఆరుస్ లిమోసిన్Aurus limousine కారులో మాట్లాడుకుంటూ ప్రయాణించారు. అమెరికాతో భారత్‌కు టారిఫ్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఈ ఇద్దరూ భేటీ కావడం, పైగా ఆ కారు చాలా ప్రత్యేకమైన భద్రతా వ్యవస్థతో కూడుకున్నది కావడంతో ఆటోమేటిక్‌గా ఏం మాట్లాడుకున్నారనే ప్రశ్న ఎదురైంది. అయితే అందులో పెద్ద రహస్యం ఏం లేదని చైనా పర్యటనలోనే ఉన్న పుతిన్ చెప్పుకొచ్చారు. ‘‘అందులో సీక్రెట్ ఏం లేదు. ఆలస్కా సదస్సులో జరిగిన పరిణామాలను ఆయనకు వివరించా’’ అని ప్రెస్మీట్లో పుతిన్ చెప్పారు. అంతేకాదు.. అలస్కా భేటీ సమయంలోనూ ఆయన ట్రంప్‌తో కారులో ప్రయాణించిన విషయంపైనా క్లారిటీ ఇచ్చారు. అలస్కా యాంకరేజ్ ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత పుతిన్, ట్రంప్‌కు చెందిన లిమోసిన్ ‘ది బీస్ట్’లో భేటీ జరగాల్సిన ప్రాంతం వద్దకు ప్రయాణించారు. అయితే.. ఎయిర్పోర్ట్ నుంచి వేదిక చాలా దగ్గర. అందుకే తమ మధ్య కేవలం 30 సెకన్లపాటే మాటలు జరిగాయని.. అదీ కూడా బ్రోకెన్ ఇంగ్లీష్‌లోనే సాగిందని అన్నారు. ఆ సమయంలో.. ట్రంప్ పూర్తి ఆరోగ్యవంతంగా కనిపించడంతో తాను సంతోషం వ్యక్తం చేశానని పుతిన్ అన్నారు. మరోవైపు.. రష్యా నేషనల్ రేడియో స్టేషన్ ‘వెస్టిఎఫ్ఎమ్’ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. మోదీ-పుతిన్‌లు తమ బృందాలతో చైనాలోని ఓ హోటల్లో భేటీ అయ్యారు. అంతకంటే ముందు.. ఆ వేదికకు చేరే క్రమంలో కారులో సుదీర్ఘంగా సంభాషించుకున్నారు అని తెలిపింది. మరోవైపు.. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందిస్తూ.. పుతిన్-మోదీ ముఖాముఖి మాట్లాడుకున్నారు. ఆయన(పుతిన్) తమ సంభాషణ మధ్యలో ఎలాంటి అంతరాయం కలగకూడదని భావించే కారులో ప్రయాణించారు’’ అని తెలిపారు. ఇదిలా ఉంటే.. రష్యాతో చమురు, ఆయుధాల కొనుగోళ్లు నేపథ్యంతో ట్రంప్ భారత్‌పై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. భారత్ తమ దేశంపై అధిక సుంకాలు విధిస్తోందంటూ సంచలన ఆరోపణలకు దిగారాయన. ఈ పరిణామంపై పుతిన్ తీవ్రంగా స్పందించారు. ఇండియా, చైనాలాంటి దేశాలతో ఆ తీరున వ్యవహారించడం సరికాదని, భాగస్వామ్య దేశాలతో మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వ్యవహరించాలి అని ట్రంప్ వైఖరిని తప్పుబట్టారు. మరోవైపు పుతిన్ డిసెంబర్లో భారత్ పర్యటనకు రానున్నారు, ఉక్రెయిన్ శాంతి చర్చలు.. కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఆగస్టు 15న తటస్థ వేదికగా అలస్కాలో ట్రంప్-పుతిన్‌ల భేటీ జరిగింది. అయితే ఈ భేటీ ఫలవంతంగా జరగలేదని తెలుస్తోంది. మరోవైపు జెలెన్స్కీ-యూరప్ దేశాధినేతలతో వైట్‌హౌజ్‌లో జరిగిన చర్చలు మాత్రం సవ్యంగా సాగినట్లు సంకేతాలు అందాయి. దీంతో.. తదుపరి దశలో జరగబోయే అమెరికా-ఉక్రెయిన్-రష్యా త్రైపాక్షిక చర్చలపై ఉత్కంఠ నెలకొంది. -
నడుస్తున్న కార్లో యువతిపై గ్యాంగ్‌రేప్
సాక్షి, బెంగళూరు: ఉద్యాననగరి బెంగళూరులో దారుణం జరిగింది. నడుస్తున్న కారులో దాదాపు 4 గంటలపాటు యువతిపై నలుగురు కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టారు. నగరంలోని ఈజీపురకు చెందిన ఓ యువతి, తన స్నేహితుడితో కలిసి మార్చి 25న రాత్రి 9.30 గంటల సమయంలో కోరమంగళలోని పార్కులో కూర్చుంది. ఇద్దరూ సిగరెట్ తాగుతుండగా దగ్గర్లోనే కూర్చున్న ఓ యువకుడు పొగతో ఇబ్బందిగా ఉందంటూ వాదనకు దిగాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిన అతడు, మరో ఇద్దరు స్నేహితులతో తిరిగి వచ్చాడు. బెదిరించి యువతి స్నేహితుడి అక్కడి నుంచి పంపించివేశారు. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో మరో స్నేహితుడు కారులో రాగా అందరూ కలిసి యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. తెల్లవారు జామున 3.30 గంటల వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కారు నడుస్తుండగానే నలుగురూ ఒకరితర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈజీపురలోనే రోడ్డు పక్క ఆమెను వదిలేసి వెళ్లిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు రెండు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందింది. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సతీశ్, విజయ్, శ్రీధర్, కిరణ్ అనే 22–26 ఏళ్ల నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు కూడా ఈజీపురకు చెందిన వారేనని పోలీసులు తెలిపారు. -
వైరల్ వీడియో : ఇదేమి జర్నీరా అయ్యా..!
-
కారులో ఒక్కరున్నా మాస్క్ తప్పదు
సాక్షి, న్యూఢిల్లీ: కారులో ఒక్కరే ప్రయాణిస్తున్నప్పటికీ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని బుధవారం ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. వాహనం బహిరంగ ప్రదేశాల మీదుగా వెళితే, ఇతరులను వైరస్‌కు బహిర్గతం చేసే ప్రమాదం ఉందని కోర్టు పేర్కొంది. మాస్క్ ధరించకుండా తమ కార్లలో ఒంటరిగా వాహనం నడుపుతున్నవారికి జరిమానా విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ప్రతిభ ఎం. సింగ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. ఈ పిటిషన్లకు ఏమాత్రం యోగ్యత లేదని కోర్టు కొట్టివేసింది. పిటిషనర్లలో ఒకరైన అడ్వకేట్ సౌరభ్ శర్మ ఇటీవల తన సొంత కారులో ఒంటరిగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాస్క్ ధరించలేదని అధికారులు రూ.500 జరిమానా విధించారు. దీనికి ఆయన రూ .10 లక్షల పరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డీడీఎంఎ) మార్గదర్శకాల ప్రకారం మాస్క్‌ను బహిరంగ ప్రదేశంలోను, పని చేసే ప్రదేశంలో ధరించాలని మాత్రమే ఉందని పిటిషనర్ వాదించారు. వాహనంలో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మాస్క్ ధరించాలని మార్గదర్శకాలను జారీ చేయలేదని కేంద్రం జనవరిలో ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. అయితే, ఈ వ్యవహారంలో వ్యక్తిగత లేదా అధికారిక వాహనంలో ప్రయాణించే ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని గైడ్‌లైన్స్‌లో స్పష్టంగా ఉందని ఢిల్లీ హైకోర్టుకు ఇటీవల ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. -
ఎన్ఆర్ఐ మహిళ సాహస యాత్ర
వడోదర: మహిళలను రక్షించండి, విద్యావంతుల్ని చేయండి అని ప్రచారం చేస్తూ గుజరాత్‌కు చెందిన ఎన్ఆర్ఐ మహిళ భారులత కాంబ్లే (43) కారు యాత్ర చేపట్టారు. ఇంగ్లండ్ నుంచి 32 వేల కిలోమీటర్ల దూరం కారు నడుపుతూ స్వదేశానికి వచ్చారు. ఆమె 57 రోజుల పాటు 32 దేశాలు దాటి వచ్చారు. భారులత సొంతూరు గుజరాత్‌లోని నవ్సారి. ఆదివారం నవ్సారిలో స్థానిక ప్రజాప్రతినిధులు ఆమెను సన్మానించారు. అంతకుముందు బరోడాలో కూడా ఆమెకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారులత మాట్లాడుతూ.. సొంతూరులో ఆస్పత్రి నిర్మించనున్నట్టు చెప్పారు. తగిన వైద్య సదుపాయాలు లేక తన తాత మరణించడం చూశానని గుర్తు చేసుకున్నారు. 32 దేశాల ప్రజలతో మాట్లాడానని, నవ్సారిలో అన్ని వసతులతో ఆస్పత్రి నిర్మాణం కోసం నిధులు సేకరించానని తెలిపారు. 57 రోజుల్లో అత్యధిక దేశాలను సందర్శించిన తొలి మహిళ తానేనని చెప్పారు. రెండు ఖండాలు, మూడు పెద్ద ఎడారులు, పర్వతాలు దాటి వచ్చారు. ఈ కారు యాత్ర గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డుల్లో నమోదైంది. -
కారులో దాక్కుని 16 కిలోమీటర్లు...
సాక్షి, అడిలైడ్: హైవేలో కారులో రయ్‌మని ఒంటరిగా దూసుకుపోతున్న వ్యక్తికి ఉన్నట్లుండి ఏడుపులు వినిపిస్తే ఎలా ఉంటుంది? గుండె ఆగిపోదు. కానీ, జేన్ బ్రిస్టర్ మాత్రం ధైర్యం చేయటంతో.. ఓ జీవి ప్రాణం నిలిచింది. గత వారం జేన్ తన కారును అడిలైడ్‌లో పార్కింగ్ చేయగా, ఎక్కడి నుంచి వచ్చింది తెలీదుగానీ ఓ కోలా(ఒక రకం ఎలుగుబంటి) టైర్ల గుండా కారు ముందు భాగంలోకి యాక్సల్ ప్రాంతంలో దాక్కుంది. అది గమనించని జేన్ కారును బయటికి తీసి తన గమ్యస్థానానికి బయలుదేరాడు. అలా ఓ పది మైళ్ల(16 కిలోమీటర్లు) దూరం వెళ్లాక అతనికి ఏవో ఏడుపులు వినిపించాయి. చివరకు జుట్టు కాలిన వాసన రావటంతో అనుమానం వచ్చి కారు మొత్తం వెతికి చూశాడు. తీరా చూస్తే కారు ముందు భాగం ఓపెన్ చూస్తే అది బిక్కు బిక్కు మంటూ ఓ మూల నక్కింది. వెంటనే జంతు సంరక్షణ అధికారులకు సమాచారం అందించగా, వారొచ్చి దానిని రక్షించారు. సాధారణంగా కొలాలు చాలా సున్నితమైన జీవులను, అంతా దూరం ప్రయాణించినా వేడికి ఆ ఆడ కోలా అది బతికి ఉండటం ఆశ్చర్యంగా ఉందని అధికారులు చెబుతున్నారు.