breaking news
brundavanam
-
బృందావనం!
– నేత్రపర్వంగా రాధాష్టమి వేడుకలు – వైభవంగా ప్రత్యేక పూజలు తిరుపతి కల్చరల్ : ఇస్కాన్ మందిరంలో శుక్రవారం రాధాష్టమి వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. కృష్ణాష్టమి తర్వాత 15వ రోజు రాధాదేవి ఆవిర్భావ దినోత్సవం (రాధాష్టమి) నిర్వహించడం ఆనవాయితీ. ఏడాదిలో రెండు సార్లు రాధాదేవి అమ్మవారి దివ్య పాద దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. శ్రీ రాధాష్టమి నాడు, కార్తీక మాసంలో వచ్చే గోపాష్టమి నాడు భక్తులు రాధాదేవి దివ్యపాద దర్శనం చేసుకొని తరిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం కమల మందిరంలో రాధాకృష్ణులకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పాభిషేకం చేపట్టారు. బృందావనాన్ని తలపించేలా రాధాకృష్ణులతో పాటు గోపికలను వివిధ పుష్పాలు, ఫలాలతో సర్వాంగ సుందరంగా కొలువుదీర్చారు. శ్రీరాధా దేవిని ప్రత్యేకంగా ఫల, పుష్పాలు, పట్టుపితాంబర వస్త్రధారణలతో సుందరంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వందలాది మంది భక్తులు రాధాదేవి దివ్యపాద దర్శనం చేసుకొని భక్తిపారవశంతో పులకించారు. హరినామ సంకీర్తనలు, భజనలు మార్మోగాయి. ఇస్కాన్ అధ్యక్షుడు రేవతీ రమణదాస్ శ్రీరాధాష్టమి విశిష్టతను తెలియజేశారు. భక్తులకు ఇస్కాన్ నిర్వాహకులు ప్రసాద వితరణ చేశారు. -
మా ఇల్లే బృందావనం
యాదగిరిగుట్ట: ఇంటి ఆవరణలోని మొక్కలకు రెక్కలు విచ్చుకున్న పూలను చూస్తే మనసుకు ఎక్కడ లేని హాయి కలుగుతుంది. పెరట్లో తులసీ మొక్క ఆ పక్కనే ఓ సన్నజాజీ తీగె మేడపైన గులాబీలు మనసుకు గిలిగింతలు పెడతాయి. ఎంత మానసిక ఒత్తిడి ఉన్నా ఈ మొక్కలను చూడగానే ఏదో తెలియని హాయి. ఇలాంటి ఇళ్లు నిజంగా బృందావనాలే.. ప్రస్తుతం కాంక్రీటు ప్రపంచంతో మొక్కలు కరువవుతున్నాయి. ఇళ్ల ముందు ప్లాస్టిక్ అలంకరణ వస్తువులే రాజ్యమేలుతున్నాయి. ఈ క్రమంలో యాదగిరిగుట్ట పట్టణంలోని పలువురు మహిళలు తమ ఇâ¶ ్లలో పూలు, పండ్లు, కూరగాయలు తదితర మొక్కలను పెట్టి పోషిస్తూ.. పచ్చదనాన్ని కాపాడుతున్నారు. గార్డెనింగ్‌తో ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తున్నారు. సొంతంగా పండించిన పండ్లు, కూరగాయలు తింటూ ఆరోగ్యం పెంచుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. మా ఇళ్లే స్వర్గసీమ – బి.మౌనిక, యాదగిరిగుట్ట, గృహిణి చిన్నతనం నుంచి మొక్కలు పెంచడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంటిలో సైకస్, పెంటకాస్, అలవేరాతో పాటు రంగురంగుల గులాబీ మొక్కలు పెంచుతున్నాను. మా ఇంట్లో ఐదు రకాల మందార మొక్కలు ఉన్నాయి. నూతన రకాల మొక్కలను సైతం కొనుగోలు చేసి పెంచుతున్నాను. గార్డెనింగ్‌తో వ్యాయామం అవుతుంది. కొత్తరకం మొక్కలన్నీ మా ఇంట్లో.. గొట్టిపర్తి మా«ధురి, బీసీ కాలనీ గత 20ఏళ్ల నుంచి ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుతున్నా. బయటకు వెళ్లినప్పుడు కొత్త రకం మొక్క కనిపిస్తే కొని ఇంటి ఆవరణలో నాటుతా. రంగురంగుల పూలమొక్కలు మదికి ఆనందం కలిగిస్తాయి. వేసవిలోనూ మా ఇంటి ముంగిలి పచ్చగా ఉంటుంది. ఇప్పటి వరకు మా ఇంట్లో రూ.లక్ష ఖర్చు పెట్టి మొక్కలను కొనుగోలు చేశాను. మా బంధువులకు సైతం ఇంట్లో రంగురంగుల మొక్కల గురించి చెబుతుంటాను. ఇంట్లో కూరగాయలు.. పూల మొక్కలే..– హరిప్రియ, గృహిణి, యాదగిరిపల్లి మాకున్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో ఆకుకూరలు, కూరగాయాలు, పూల మొక్కలను నాటుకున్నాం. తెల్ల గన్నెర, మందార, గులాబీ పూలతో మా ఇంటికి ఎంతో అందం వచ్చింది. తోటకూర, పాలకూర, కొత్తిమీరతో పాటు బీరకాయలు, సోరకాయల పాదు మొక్కలను నాటాను. ప్రతి రోజు వాటికి కావలిసిన నీటిని పోసి సంరక్షిస్తున్నాం. ఇంటో పండిన కూరగాయల రుచే వేరు.