breaking news
Bihar Results
-
జేడీయూ హవా : ప్రశాంత్ కిషోర్ రాజకీయ సన్యాసం?
Bihar Election 2025: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం దిశగా లీడ్‌లో కొన సాగుతోంది. మరోవైపు ప్రఖ్యాత పోల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ఇపుడు చర్చల్లో నిలిచాడు. ఒకవైపు ఎన్నికల అరంగేట్రంలో పెద్ద ఎదురు దెబ్బ, మరోవైపు జేడీయూ 25 కంటే ఎక్కువ సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానన్న పీకే చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశ మవుతున్నాయి.రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ (Nitish Kumar)జేడీయూ (JDU) 25 సీట్లు దాటితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. అలాగే సీఎంగా నితీష్ కుమార్ కుర్చీపై కూర్చోరని కిషోర్ అనేక ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు కూడా. కానీ ఆయన అంచనాలన్నీ తల్లకిందులై, కూటమి భారీ మెజార్టీ దిశగా సాగుతోంది. మరి తాజా ఫలితాల నేపథ్యంలో పీకే తన వాగ్దానానికి కట్టుబడి ఉండి రాజకీయాలను వదిలివేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.(బిహార్ మాదే.. ఇక బెంగాల్ వంతు : కేంద్రమంత్రి చాలెంజ్)అయితే ఆకాశంలో లేదంటే నేల మీద ఒక సమయంలో, 243 సీట్ల శాసనసభలో JSP "10 కంటే తక్కువ లేదా 150 కంటే ఎక్కువ అని కూడాజోస్యం చెప్పారు. అటు ఆయన పార్టీ జాన్ సూరాజ్ (జేఎస్పీ) ఖాతా తెరవలేకపోయింది తన పార్టీ అయితే ఆకాశంలో లేదంటే నేలపై ఉంటుందని కూడా అంచనా వేశారు.కాగా బిహార్ శాసనసభలోని 243 సీట్ల కోసం నవంబర్ 6 ,నవంబర్ 11 తేదీలలో రెండు దశల్లో జరిగాయి. రెండు దశల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 67.13 శాతం పోలింగ్ నమోదైంది. 1951 తర్వాత రాష్ట్రంలో అత్యధిక ఓటర్ల పోలింగ్ ఇదే. ఇదే ఎన్టీయే కూటమికి బాగా కలిసి వచ్చింది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.ఇదీ చదవండి: వాడే నాకు కరెక్ట్ : చాట్‌జీపీటీ వరుడొచ్చేశాడు! -
Bihar Election Results: ఘన విజయంపై ప్రధాని మోదీ హర్షం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరించనుంది?.. మరికొన్ని గంటల్లో ఆ సస్పెన్స్‌కు తెర పడనుంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ అధికార ఎన్డీయే కూటమి వైపు మొగ్గు చూపినప్పటికీ.. తుది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.


