breaking news
Bhramaramba devi
-
శ్రీశైలంలో వార్షిక కుంభోత్సవం
-
వైభవంగా శాకంబరి అలంకారం
కర్నూలు (శ్రీశైలం) : శ్రీశైల మహాక్షేత్రంలో అష్టాదశ శక్తిపీఠంగా వెలసిన శ్రీ భ్రమరాంబదేవిని శుక్రవారం వేదమంత్రోచ్ఛరణల మధ్య శాకంబరిగా అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. 40 రకాలకు పైగా కూరగాయలు, ఆకుకూరలు, ఫలాదులతో ప్రధానాలయ రాజగోపురాలు మొదలుకొని ధ్వజస్తంభం,అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని కూరగాయలతో అలంకరించారు. మూలవిరాట్‌తో పాటు అమ్మవారి ఉత్సవమూర్తిని కూరగాయలతో అలంకరించారు. ఈ పూజలలో ఈఓ సాగర్‌బాబు దంపతులు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. శాకంబరి అమ్మవారిని వీక్షించడానికి వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.