breaking news
begumpet country club
-
నట్టికుమార్ కొడుకుపై పోలీసుల దాడి
సాక్షి, హైదరాబాద్ : సినీ నిర్మాత నట్టికుమార్ కుమారుడు క్రాంతిపై పోలీసులు దాడికి దిగారు. సాయం అడిగిన అతనిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన బేగంటపేట కంట్రీ క్లబ్ వద్ద చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న నట్టికుమార్.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు చేరకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కారు కనిపించకపోవడంతో 100కు ఫోన్ చేస్తే దాడి చేస్తారా అంటూ పోలీసులను ప్రశ్నించారు. దీంతో అర్ధరాత్రి పంజాగుట్ట పీఎస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే పోలీసులు క్షమాపణలు చెప్పడంతో నట్టికుమార్ శాంతించారు. పోలీసులతో మాట్లాడి తన కుమారుడిని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నట్టికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కంట్రీ క్లబ్ ఈవెంట్ మేనేజర్ సుమన్ ఇయర్ ఎండ్ సెలబ్రేషన్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు నమ్మబలికి చాలా మందిని మోసం చేశాడని ఆరోపించారు. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాడు. తన కుమారుడిపై దాడి ఘటనకు పోలీసులు క్షమాపణ చెప్పారని వెల్లడించారు. కాగా, కంట్రీ క్లబ్ వద్ద కారు పార్క్ చేస్తామని చెప్పి కీ తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతో క్రాంతి 100కు ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. -
కంట్రీ ఫెస్ట్
చిన్నపిల్లల కేరింతలు, బాణసంచా పేలుళ్లతో బేగంపేట కంట్రీక్లబ్ హోరెత్తింది. బుధవారం రాత్రి కంట్రీక్లబ్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సిల్వర్‌జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా దివాలీ మేళా కార్యక్రమం చేశారు. క్లబ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. మిరుమిట్లుగొలిపే క్రాకర్స్‌తో క్లబ్ ప్రాంగణం మెరిసిపోయింది. సిల్వర్ జూబ్లీ సందర్భంగా క్లబ్ సభ్యులకు మరిన్ని వసతులు కల్పించనున్నట్టు సీఎండీ రాజిరెడ్డి తెలిపారు. - ఫొటోలు: అమర్