breaking news
BC Assons leaders
-
హామీలను విస్మరించిన ప్రభుత్వాలు
నిర్మల్‌టౌన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించాయని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రాజన్న అన్నారు. నిర్మల్‌రూరల్ మండలంలోని మంజులాపూర్‌లో గ్రామ ప్రజల సమస్యలను ఆయన శనివారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. నాలుగేళ్ల నుంచి ప్రజలను మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నాయని ఆరోపించారు. డబ్బే ప్రధాన లక్ష్యం చేసుకుని ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బహుజనులంతా ఏకమై బీఎస్పీనే గెలిపించాలని కోరారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఈ నెల 8 నుంచి జోనల్ స్థాయి పదాధికారుల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు బాపురావు, నాయకులు సాయన్న, ప్రకాష్, ముత్యం, నాగరావు, దిగంబర్ పాల్గొన్నారు. -
బీసీలను మోసగిస్తే గుణపాఠం తప్పదు
విజయవాడ (గాంధీనగర్) : బీసీలను మోసగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగిన రీతిలో బుద్ధి చెబుతామని పలు బీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. స్థానిక ఎంబీ విజ్ఞాన కేంద్రంలో బీసీ సమస్యల పరిష్కారం కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు కాపాడుకునేందుకు ఎంతటి ఉద్యమానికైనా వెనుకాడబోమన్నారు. అన్నిరంగాల్లో ముందున్న అగ్రకులాలను బీసీ జాబితాలో చేర్చితే బాబు భరతం పడతామని హెచ్చరించారు. బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డా. జి గంగాధర్ మాట్లాడుతూ రాయితీల కోసం కాదు, రాజ్యాధికారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. బట్రాజు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటంరాజు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీ ఆట్రాసిటీ యాక్ట్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగిరేకుల వరప్రసాద్ మాట్లాడుతూ బీసీలను అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. బీసీ కార్పొరేషన్‌కు నిధుల కేటాయింపులో అంకెల గారడీ తగదన్నారు. సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి కె. శివాజీ, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్, అన్నం శివరాఘవయ్య, పలగాని సుధాకర్, నూకాలమ్మ, 40కి పైగా బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.