breaking news
Bandi Saroj Kumar’
-
‘మోగ్లీ’మూవీ రివ్యూ
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా నటించిన రెండో చిత్రం ‘మోగ్లీ’. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. సాక్షి మడోల్కర్ హీరోయిన్గా నటించగా.. బండి సరోజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. నేడు (డిసెంబర్ 13) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి..మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.మోగ్లీ (రోషన్ కనకాల) ఓ అనాథ. పార్వతీపురం గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో ఉంటూ.. ఎప్పటికైనా పోలీసు కావాలనే ఆశతో బతికేస్తుంటాడు. బతుకుదెరువు కోసం తన ప్రాణ స్నేహితుడు బంటి(వైవా హర్ష)తో కలిసి సినిమా షూటింగ్స్‌కి జూనియర్ ఆర్టిస్టులను అందిస్తూ..రిస్కీ సీన్లకు హీరో డూప్‌గా నటిస్తుంటాడు. అలా ఓ సినిమా షూటింగ్లో సైడ్ డ్యాన్సర్‌గా వచ్చిన జాస్మిత్(సాక్షి మడోల్కర్)తో ప్రేమలో పడతాడు. ఆమెకు వినికిడి లోపంతో పాటు మాటలు కూడా రావు. జాస్మిత్ కూడా మోగ్లీని ఇష్టపడుతుంది. అదే సమయంలో ఎస్సై క్రిప్టోఫర్ నోలన్(బండి సరోజ్ కుమార్).. జాస్మిత్‌పై మోజు పడతాడు. ఆమెను వాడుకోవాలని చూస్తాడు. అమ్మాయిల పిచ్చి ఉన్న ఎస్సై నోలన్ బారీ నుంచి జాస్మిత్‌ని మోగ్లీ ఎలా కాపాడుకున్నాడు? నోలన్ నుంచి మోగ్లీకి ఎదురైన సవాళ్లు ఏంటి? కర్మ సిద్ధాంతానికి ఈ కథకి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. సందీప్ రాజ్ గతంలో తెరకెక్కించిన కలర్ ఫోటో సినిమా మాదిరే.. ఇది కూడా ప్యూర్ అండ్ ఇన్నోసెన్స్ లవ్‌స్టోరీ. సినిమా షూటింగ్ నేపథ్యంలో కథనం సాగుతుంది. అయితే కర్మ సిద్దాంతం టాపిక్‌ని ఈ ప్రేమకథకి యాడ్ చేయడం కొత్త ప్రయత్నం. ఇదొక్కటి తప్పితే.. మిగతా స్టోరీ అంతా రొటీనే. హీరో తొలి చూపులోనే హీరోయిన్‌తో ప్రేమలో పడడం.. విలన్ ఆమెపై మోజు పడడం.. చివరకు హీరో అతన్ని అంతం చేయడం.. ఇలా గతంలో చాలా ప్రేమ కథలు వచ్చాయి. మోగ్లీ కథనం కూడా అలాగే సాగుతుంది. సినిమా చూస్తున్నంత సేపు సందీప్ తెరకెక్కించిన కలర్ఫోటోతో పాటు జయం, వాన..లాంటి సినిమాలు గుర్తుకు వస్తుంటాయి. టేకింగ్ మాత్రం కొత్తగా అనిపిస్తుంది. బండి సరోజ్ కుమార్ పాత్రను భయంకరంగా చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఎస్సై నోలన్‌కు అమ్మాయిలంటే పిచ్చి అనేది ఒకే ఒక సీన్‌తో చూపించాడు. ఆ తర్వాత మోగ్లీగా హీరోగా పరిచయ సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. అతని నేపథ్యం కాస్త ఎమోషనల్‌కు గురి చేస్తుంది. హీరో హీరోయిన్లు ఇద్దరు ప్రేమలో పడినప్పటి నుంచి కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. సినీ నిర్మాత..హీరోయిన్‌పై మోజు పడడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. కానీ ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు మాత్రం సాగదీతగా అనిపిస్తాయి. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఓ ట్విస్టు ఆకట్టుకుంటుంది. ఇక ద్వితియార్థం ప్రారంభంలో కథనం పరుగులు పెట్టినా.. కాసేపటికే మళ్లీ సాగదీత సన్నివేశాలతో నెమ్మదిగా సాగుతుంది. పోలీసు స్టేషన్ సీన్ ఒక్కటి బాగుంటుంది కానీ దాన్ని కూడా మరీ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో కర్మ సిద్దాంతాన్ని జోడిస్తూ.. సాగే సన్నివేశాలు బాగుంటాయి. ఎవరెలా చేశారంటే.. మోగ్లీ పాత్రకి రోషన్ న్యాయం చేశాడు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. తొలి సినిమాతో పోలిస్తే..ఇందులో నటన పరంగా చాలా మెచ్యూరిటీ కనిపించింది. సినిమా కోసం ఆయన పడిన కష్టమంతా తెరపై కనిపించింది. ఇక చెవిటి, మూగ అమ్మాయి జాస్మిత్లాగా సాక్షి మడోల్కర్ బాగా చేసింది. ఇక విలన్‌గా బండి సరోజ్ కుమార్ ఇరగదీశాడు. హీరో రేంజ్లో ఆయన పాత్రకు ఎలివేషన్స్ ఉన్నాయి. వైవా హర్ష నవ్వించడంతో పాటు కొన్ని చోట్ల ఎమోషనల్‌కు గురి చేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కాలభైరవ సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లను ప్రాణం పోశాడు. పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
'మోగ్లీ' కోసం రోషన్ కష్టం.. మేకింగ్ వీడియో రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ’... డిసెంబర్ 13న ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు, నటుడు బండి సరోజ్‌కుమార్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నటం విశేషం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించారు. కొన్ని గంటల్లో ఈ మూవీ థియేటర్స్‌లోకి రానున్న సందర్భంలో తాజాగా మోగ్లీ ఫైట్ సీన్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. బండి సరోజ్‌కుమార్, బండి సరోజ్, హర్ష చెముడు వంటి వారు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు కాలభైరవ సంగీతం అందించారు. -
అది నా కళ్లారా చూశా.. అందుకే క్షమాపణలు: మౌగ్లీ నటుడు
సెన్సార్ బోర్డుకు క్షమాపణలు చెప్పడంపై మౌగ్లీ నటుడు బండి సరోజ్ కుమార్ స్పందించారు. ఈ సినిమా కోసం నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీగా డబ్బులు ఖర్చు చేయడం నా కళ్లారా చూశానని అన్నారు. ఈ సినిమాను నా బాధ్యతగా తీసుకున్నానని తెలిపారు. ఈ చిత్రానికి ఆటంకం కలగకూడదనే సెన్సార్ బోర్డ్‌కు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ నేరవేర్చానని అన్నారు. నా వంతు కృషిగా నా సొంత సినిమా కంటే గట్టిగా బయటికొచ్చి ప్రమోషన్స్ చేశానని అన్నారు. మీరు సినిమా చూశాక నచ్చితే గట్టిగా ముందుకు తీసుకెళ్లండి ఆడియన్స్‌కు సూచించారు. కాగా.. మౌగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డ్‌ను ఉద్దేశించి మాట్లాడారు.బండి సరోజ్ ఏమన్నారంటే..బండి సరోజ్ మాట్లాడుతూ..' మోగ్లీ సినిమాను ఫ్యామిలీతో చూడొచ్చు. సెన్సార్ బోర్డ్ వాళ్లు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అసభ్యత ఉండదు. ఈ సినిమా సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ భయపడి పోయారంటా. ఎవడ్రా వీడు.. వీడి ఫర్మామెన్స్ ఏంటి? రూత్‌లెస్ కాప్‌లా నటించలేదని భయపడి ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటా అని అన్నారు. ఈ కామెంట్స్ కాస్తా వివాదానికి దారి తీయడంతో మౌగ్లీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్షమాపణలు చెబుతూ ట్విటర్లో పోస్ట్ చేసింది.#Mowgli సినిమా ని నా బాధ్యతగా తీసుకున్నాను. నిర్మాత నా కళ్ళ ముందే డబ్బును భారీగా ఖర్చుపెట్టడం చూసాను. దానికి నా వంతు కృషిగా నా సొంత సినిమా కంటే గట్టిగా, నా introvert behaviour నుండీ బయటకు వచ్చి ఆల్ ఔట్ ప్రమోషన్ చేశాను. Censor board వాళ్లు క్షమాపణ కావాలి అన్న డిమాండ్ ను సినిమాకు…— Saroj (@publicstar_bsk) December 11, 2025 -
మౌగ్లీ నటుడు కామెంట్స్.. టాలీవుడ్ నిర్మాణ సంస్థ క్షమాపణలు!
టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్షమాపణలు కోరింది. నటుడు బండి సరోజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై సారీ చెబుతూ నోట్ రిలీజ్ చేసింది. నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరమని.. దీనికి బాధ్యత వహిస్తూ హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నట్లు నోట్లో పేర్కొంది.మా నటుడు బండి సరోజ్ ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివరణ ఇచ్చింది. సెన్సార్ ప్రక్రియ పట్ల మాకు అత్యున్నత గౌరవం ఉందని తెలిపింది. బాధ్యత, సమగ్రతతో కంటెంట్‌ను నిర్వహించడంలో బోర్డు పాత్రను మేము గౌరవిస్తామని స్పష్టం చేసింది. సెన్సార్ బోర్డ్‌లో అత్యంత సమర్థులైన నిర్వాహకులు, సీనియర్ పరిశ్రమ నిపుణులు ఉన్నారు.. వారి మార్గదర్శకత్వాన్ని మేము ఎంతో విలువైందిగా భావిస్తామని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేర్కొంది. బండి సరోజ్ వ్యాఖ్యలను తాము వెంటనే ఉపసంహకరించుకుంటున్నామని తెలిపింది. సెన్సార్ బోర్డు వారి నిరంతర సహకారం, మద్దతు కోసం మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పోస్ట్ చేసింది.బండి సరోజ్ ఏమన్నారంటే..బండి సరోజ్ మాట్లాడుతూ..' మోగ్లీ సినిమాను ఫ్యామిలీతో చూడొచ్చు. సెన్సార్ బోర్డ్ వాళ్లు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అసభ్యత ఉండదు. ఈ సినిమా సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ భయపడి పోయారంటా. ఎవడ్రా వీడు.. వీడి ఫర్మామెన్స్ ఏంటి? రూత్‌లెస్ కాప్‌లా నటించలేదని భయపడి ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటా అని అన్నారు. ఈ కామెంట్స్ కాస్తా వివాదానికి దారి తీయడంతో మౌగ్లీ నిర్మాణ సంస్థ క్షమాపణలు చెబుతూ ట్విటర్లో పోస్ట్ చేసింది.People Media Factory extends its sincere apologies to the Censor Board and the Censor Officer for the unfortunate incident yesterday.An unintended remark was made by our actor, Bandi Saroj, regarding the Censor Board and the Officer’s reactions. We wish to clarify that we hold… pic.twitter.com/rXfqTjqPU3— People Media Factory (@peoplemediafcy) December 11, 2025 -
యాంకర్ సుమ కొడుకు 'మోగ్లీ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కొడుకుని చూడక పదేళ్లు! అమ్మ కనిపిస్తే పక్కింటావిడ అని!
దర్శకుడిగా, నటుడిగా రాణిస్తున్నాడు బండి సరోజ్ కుమార్. ప్రస్తుతం ఈయన మోగ్లీ మూవీలో కీలక పాత్రలో నటించాడు. యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 12న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా బండి సరోజ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.ఎవరితో టచ్‌లో లేనుఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ.. మాది మధ్యతరగతి కుటుంబం. కానీ, చిన్నప్పటినుంచే నేను చాలా ధనవంతుడిని అని ఫీలయ్యేవాడిని. మా అమ్మ స్కూల్‌కి వస్తే కూడా పక్కింటావిడ అని చెప్పేవాడిని. డబ్బుల గురించి కాదు కానీ ఎప్పుడూ అందరికంటే పైన ఉండాలని ఆశపడేవాడిని. అమ్మానాన్నకు టచ్‌లో లేను. వాళ్ల ఫోటో కూడా నా దగ్గర లేదు. భార్యాబిడ్డకు దూరంఅందరికంటే నేను తేడాగా ఎందుకున్నానని ఆలోచించాను. మామూలుగా ఉండాలని ప్రయత్నించాను. సీరియస్‌గా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ తర్వాత ఈ జీవితమంతా ఫేక్ అనిపించింది. నా భార్య ఏడాది వయసున్న నా కొడుకును తీసుకొచ్చి చూపిస్తే నాలో ఎటువంటి చలనం లేదు. అంటే నాకు కడుపు తీపి లేదు. కొడుకుని చూసి పదేళ్లవుతోంది. వాళ్లందరికీ దూరంగా ఉన్నాను.సిగరెట్లు మానేశా..నాకు కేవలం సినిమాలపైనే ఆసక్తి ఉంది. దేనిపైనా నాకు వ్యామోహం లేదు. అంతకుముందు అమ్మాయిలను ఇంటికి పిలిచేవాడిని. కానీ, ఏడాదికాలంగా బ్రహ్మచర్యం పాటిస్తున్నాను. అప్పట్లో వెయ్యికి పైగా సిగరెట్లు తాగేవాడిని, ఇప్పుడు పూర్తిగా మానేశాను. కాకపోతే మోగ్లీ సినిమాలో మాత్రం సిగరెట్లు తాగుతూ కనిపిస్తాను అని బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar) చెప్పుకొచ్చాడు.సినిమాబండి సరోజ్ కుమార్ నిర్బంధం, నిర్బంధం 2, మాంగళ్యం, పరాక్రమం సినిమాల్లో నటించడంతోపాటు స్వీయదర్శకత్వం వహించి నిర్మాతగానూ వ్యవహరించాడు. పోర్కాలం, అస్తమానం అనే తమిళ సినిమాలకు దర్శకరచయితగానూ పని చేశాడు.చదవండి: ఇమ్మాన్యుయేల్ తొండాట.. బయటపెట్టిన నాగార్జున -
ఇన్సెక్యూర్ నెపోటిజం.. అస్సలు సహించను: బండి సరోజ్ కుమార్
బండి సరోజ్ కుమార్.. ఈ తరం ఆడియెన్స్‌కి ఈ పేరు కాస్తోకూస్తో తెలుసు. అది కూడా ఇతడు హీరోగా చేస్తూ దర్శకత్వం వహించిన నిర్బంధం, నిర్బంధం 2 సినిమాలు వల్ల. వీటిని యూట్యూబ్‌లోనే రిలీజ్ చేశాడు. వాటికి వచ్చిన వ్యూస్ ద్వారానే ఇతడికి డబ్బులొచ్చాయి. సరోజ్ కుమార్ తొలిసారి నటించిన కమర్షియల్ మూవీ 'మోగ్లీ'. యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ హీరోగా చేశాడు. రీసెంట్‌గానే గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో సరోజ్ కుమార్ చేసిన విలన్ క్యారెక్టర్‌కి ప్రశంసలు చాలా వస్తున్నాయి. అయితే మూవీ టీమ్ మాత్రం వాటిని డిలీట్ చేస్తూ, తనకు అన్యాయం చేస్తోందని, తన కెరీర్, భవిష్యత్తు గురించి భయమేస్తోందని సరోజ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశాడు. మూవీ టీమ్‌తో వివాదం గురించి మొత్తం బయటపెట్టాడు.(ఇదీ చదవండి: నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా.. తెలుగు దర్శకుడి ఆవేదన)ఇంతకీ అసలేమైంది?'మోగ్లీ' గ్లింప్స్‌లో తనని మెచ్చుకుంటూ పెడుతున్న కామెంట్స్‌ని మూవీ టీమ్ డిలీట్ చేస్తోందని బండి సరోజ్ కుమార్.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అడ్మిన్స్ నా గురించి పెట్టిన 400కి పైగా కామెంట్స్ తొలగించారు. ఇంకా అదే పనిలో ఉన్నారు. నిర్మాత విశ్వప్రసాద్ దీన్ని తీవ్రంగా పరిశీలించాలని కోరుతున్నాను. ఇది కంటెంట్ ఫిల్మ్ అని, లాంచ్ ప్యాడ్ ఫిల్మ్ కాదని నాకు చెప్పారు. అందుకే నేను ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నాను. నా సర్వస్వం పెట్టాను. ఎలాంటి కండీషన్స్ లేకుండా పనిచేశాను. కానీ నాకు దక్కిన ఫలితం ఇదే. దీని వెనక ఓ సిండికేట్ ఉంది. ఇది ఆమోదయోగ్యమైనదేనా?' అని సరోజ్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.'కామెంట్స్ ఏ కదా.. లైట్ తీసుకోమని చెప్పేవాళ్లకి. నేను ఇప్పటివరకు బయట సినిమాలు ఒప్పుకోలేదు. సందీప్ రాజ్ ఒత్తిడితో కథ విన్నాక, నా పాత్ర నచ్చి అందులో ఎలాంటి మార్పులు ఉండకూడదు అనే అగ్రిమెంట్‌తో ఈ సినిమాలో పారితోషికం లేకుండా ప్రాణం పెట్టి నటించాను. 8 నెలలు నా సమయాన్ని ఇచ్చాను. నాకు వస్తున్న రిసెప్షన్ చూసి ముందు థంబ్ నెయిల్స్ మార్చారు. తర్వాత కామెంట్స్ ఆఫ్ చేశారు. నేను దర్శకుడితో మాట్లాడాక మళ్లీ ఆన్ చేశారు. ఒక మూడు కామెంట్లని 3 బాట్ లైక్స్‌తో బూస్ట్ చేసి, నా పాత్రకి వస్తున్న ఆదరణని మ్యాచ్ చేయడానికి చూశారు. కుదరలేదు. ఇప్పుడు నా టాప్ కామెంట్స్ డిలీట్ చేశారు. ఇంకా డిటైల్డ్ ప్రూఫ్స్‌తో ముందుకు వస్తాను''ఇప్పటికీ అక్కడున్న 1600 కామెంట్లలో 99 శాతం నాపైన ప్రేక్షకుడు పలికించిన ప్రేమే. నాకు పీఆర్లు లేరు. ప్రేక్షకుడి బలమే నా పీఆర్. ఆ సునామీని ఎవ్వడూ ఆపలేరు. వీళ్లు ఇప్పుడు ఇలా చేస్తే, రేపు సినిమాలో ఎన్ని చేస్తారు. ఎవరిని నమ్మాలి. నిర్మాత వరకు వెళ్లే అవకాశం నాకు లేదు. నేను ఇండస్ట్రీలో బ్రతికేయడానికి రాలేదు. గత 5 సంవత్సరాలుగా నా కళతో నేను ప్రేక్షకుల్ని సంపాదించుకున్నాను. ఇలాంటి ఇన్సెక్యూర్ నెపోటిజం, పాలిటిక్స్‌ని అస్సలు సహించను. నిర్మాత విశ్వప్రసాద్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలించాలని కోరుతున్నాను. ఇది మీ ప్రమేయం లేకుండా జరుగుతుందని అనుకుంటున్నాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చౌకబారు నెపోటిజంకి అడ్డాగా మారకూడదు. దీని వల్ల నా బాధ, నా భవిష్యత్తు కెరీర్ పట్ల ఉన్న భయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను' అని సరోజ్ కుమార్ ట్వీట్ చేశాడు.అయితే సరోజ్ కుమార్ ట్విటర్ అకౌంట్ ప్రస్తుతం కనిపించట్లేదు. కానీ ట్వీట్స్ స్క్రీన్ షాట్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇతడికి మద్ధతుగా చాలామంది పోస్టులు పెడుతున్నారు. అలానే ఇతడు చెప్పినట్లు గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు థంబ్ నెయిల్లో ఇతడి ఫొటో కనిపించింది. ఇప్పుడేమో హీరోహీరోయిన్ పెట్టి, అతడి ఫొటోని తొలగించారు. మరోవైపు సినిమా రిలీజ్‌కి ఇంకా చాలా సమయముంది. ఇప్పుడు ఈ గొడవ చూస్తుంటే.. ముందు ముందు ఇంకెంత రచ్చ అవతుందో అనే సందేహం కలుగుతోంది.(ఇదీ చదవండి: దీనస్థితిలో 'కేజీఎఫ్' నటుడు.. సాయం చేయాలని వేడుకోలు) -
వాడి ప్రేమకథలో వేలు పెడితే ఇలాగే ఉంటుంది.. 'మోగ్లీ' గ్లింప్స్
రోషన్ (Roshan Kanakala) హీరోగా నటిస్తున్న చిత్రం 'మోగ్లీ' (Mowgli).. తాజాగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది. రాజీవ్ కనకాల- సుమ వారసుడిగా చిత్రపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన రోషన్ 'మోగ్లీ' ప్రేమకథతో వస్తున్నాడు. తాజాగా విడుదలైన గ్లింప్స్ నాని వాయిస్‌తో మొదలౌతుంది. 25 సంవత్సరాలు నిండని ఓ కుర్రాడు 30 మందిని తిండి, నిద్ర లేకుండా పరిగెత్తించాడంటూ నాని వాయిస్‌తో డైలాగ్ ప్రారంభమౌతుంది. వాడు గ్యాంగ్ స్టర్ కాదు, క్రిమినల్ కాదంటూనే వాడి కథేంటో తెలుసుకోవాలంటే మోగ్లీ చూడాలని చెప్పాడు. ఇందులో హీరోయిన్గా సాక్షి సాగర్ నటించారు. కలర్‌ఫోటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. -
ఓటీటీకి వచ్చేస్తోన్న గల్లీ క్రికెట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బండి సరోజ్ కుమార్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పరాక్రమం. బీఎస్కే మెయిన్ స్ట్రీమ్ బ్యానర్‌పై తెరకెక్కించారు. ఈ చిత్రంలో శృతి సమన్వి హీరోయిన్గా నటించారు. గల్లీ క్రికెట్ నేపథ్యంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆగస్టు 22న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టులేకపోయింది.(ఇది చదవండి: 'పరాక్రమం' టీజర్ విడుదల.. టీమ్‌కు సపోర్ట్‌గా నిలిచిన విశ్వక్ సేన్)తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈనెల 14 నుంచి డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని ఆహా తన ట్విటర్ ద్వారా వెల్లడించింది. మాంగల్యం మూవీతో బండి సరోజ్ కుమార్ టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా.. ఈ చిత్రంలో నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్, శాంక్ వెన్నెలకంటి, వంశీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంగీతం, నిర్మాతగానూ బండి సరోజ్ కుమార్ వ్యవహరించడం మరో విశేషం. పులి వస్తే చెట్టుక్కుతావ్!🐅మగర్ మచ్చొస్తే ఒడ్డెక్కుతావ్!!యముడొస్తే ఏడికి పోతావ్....😈Bandi Saroj's Parakramam on aha🎬#Parakramam Premieres 14th September on aha! @publicstar_bsk @actoranilkumar @06sudheer @nikhilgopureddy pic.twitter.com/VqeiY5APsk— ahavideoin (@ahavideoIN) September 12, 2024 -
సరోజ్ కుమార్ 'పరాక్రమం'.. 22న గ్రాండ్ రిలీజ్
బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'పరాక్రమం'. శృతి సమన్వి, నాగ లక్ష్మి కీలక పాత్రధారులు. సెన్సార్ పూర్తి చేసుకుని ఈనెల 22న థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్, నిర్మాత ఎస్కేఎన్ హాజరయ్యారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్)సరోజ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి మనిషికి కనెక్ట్ అయ్యే సినిమా. నేను అభిమానించే చిరంజీవి పుట్టినరోజున 'పరాక్రమం' రిలీజ్ కానుండటం సంతోషంగా ఉంది. చిరంజీవిని చిరంజీవి అనే పిలుస్తా. ఆయనకు భారతరత్న కూడా చిన్నదే అనేది నా అభిప్రాయం. చిరంజీవి అంటే శిఖరం. ఆయన హీరోగా నాలాంటి ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారని అన్నాడు.సందీప్ కిషన్ మాట్లాడుతూ.. బండి సరోజ్ కుమార్ చాలా జెన్యూన్ ఫిలింమేకర్. ఆయన వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది. ఆయన సినిమా ఈవెంట్స్ కూడా రొటీన్ గా ఉండవు. నేను చెన్నైలో పోర్కాలం అనే సినిమా చూసి ఎవరీ దర్శకుడు అనుకుని ఆశ్చర్యపోయా. ఆయన బండి సరోజ్ కుమార్. ఆ తర్వాత ఆయనను ఫేస్ బుక్ లో వెతికి మరీ టచ్ లోకి వెళ్లా. ఆయన సినిమాలు యూట్యూబ్‌లో చూసి నేనూ డబ్బులు పంపించాం. పరాక్రమం జెన్యూన్ ఫిల్మ్ అని చెప్పాడు.(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?) -
Parakramam Dream Song: వచ్చాడులే పరాక్రమం..నా కన్నె మనసు చేరే కొత్త సంగమం..
బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "పరాక్రమం". శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికేషన్ పొందింది. ఆగస్టు 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు "పరాక్రమం" సినిమా నుంచి 'డ్రీమ్' సాంగ్ ను రిలీజ్ చేశారు.'డ్రీమ్' సాంగ్ కు బండి సరోజ్ కుమార్ ఆకట్టుకునేలా లిరిక్స్ రాసి బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. శ్రీ వైష్ణవి గోపరాజు అందంగా పాడారు. ఈ సాంగ్ ఎలా ఉందో చూస్తే..'వచ్చాడులే పరాక్రమం..నా కన్నె మనసు చేరే కొత్త సంగమం...తెచ్చాడులే పరాక్రమం.. నా చిట్టి గుండెలోకి వింత యవ్వనం...' అంటూ అమ్మాయి తన మనసులోని తొలిప్రేమ భావాలను చెప్పేలా లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట.లవ్, యాక్షన్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ వంటి ఎలిమెంట్స్ తో "పరాక్రమం" సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చేలా రూపొందించారు బండి సరోజ్ కుమార్. ఈ నెల 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ రాబోతోందీ సినిమా. -
రిలీజ్‌కు సిద్ధమైన పరాక్రమం మూవీ.. డేట్ ఫిక్స్!
బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం "పరాక్రమం". ఈ చిత్రాన్ని బీఎస్కే మెయిన్‌స్ట్రీమ్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను ఆగస్టు 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో మూవీ రిలీజ్ అనౌన్స్మెంట్ టీజర్‌ను విడుదల చేశారు.ఈ సందర్భంగా బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ..'మా పరాక్రమం సినిమాను చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేస్తున్నాం. పరాక్రమం విషయానికి వస్తే ఇదొక సంఘర్షణతో కూడుకున్న కథ. నేను మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చా. నేను గతంలో నిర్భందం , నిర్భందం 2 , మాంగళ్యం సినిమాలను రూపొందించా. ఒక మంచి ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం నా స్టైల్ మార్చాలని ఫిక్స్ అయ్యా. అలా మార్చి చేసిన సినిమానే పరాక్రమం. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
పరాక్రమం మూవీ.. 'మనిషి నేను' అనే సాంగ్ రిలీజ్
బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "పరాక్రమం". బీఎస్కే మెయిన్ స్ట్రీమ్ బ్యానర్‌పై తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో శృతి సమన్వి హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని 'మనిషి నేను' అనే లిరికల్ వీడియో పాటను విడుదల చేశారు. బండి సరోజ్ కుమార్ స్వరపరిచిన ఈ పాటను.. హైమత్ మహమ్మద్ ఆలపించారు.ఈ సందర్భంగా బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ.. "పరాక్రమం చిత్రం నుంచి నేను రాసి స్వరపరిచిన 'మనిషి నేను' అనే పాటను విడుదల చేశాం. ఈ పాటని హైమత్ మహమ్మద్ పాడారు. నా పాట అందరికి నచ్చుతుందని భావిస్తున్నా. మా చిత్రాన్ని ఆగష్టులో విడుదల చేస్తున్నాం. త్వరలోనే ట్రైలర్‌తో మీ ముందుకు వస్తాం" అని తెలిపారు. ఈ చిత్రంలో నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్, శాంక్ వెన్నెలకంటి, వంశీరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
ఎనిమిది మంది పనిని ఒక్కడే చేస్తుంటాడు: విశ్వక్ సేన్
‘‘పరాక్రమం’ సినిమా ట్రైలర్ బాగుంది. నేను యానిమేషన్, ఎడిటింగ్ కోర్సులు చేస్తున్నప్పటి నుంచి మా సర్కిల్స్‌లో బండి సరోజ్ కుమార్ పేరు వింటున్నాను. ఆయన ఎనిమిది మంది పనిని ఒక్కడే చేస్తుంటాడు. ఈ సినిమా సరోజ్ కుమార్‌కు పెద్ద విజయం ఇవ్వాలి’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. బండి సరోజ్ కుమార్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘పరాక్రమం’. శ్రుతి సమన్వి, నాగలక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ఇతర పాత్రల్లో నటించారు.బీఎస్కే మెయిన్ స్ట్రీమ్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కి విశ్వక్ సేన్, దర్శకులు బుచ్చిబాబు, జ్ఞానసాగర్ ద్వారక తదితరులు అతిథులుగా హాజరయ్యారు. బుచ్చిబాబు మాట్లాడుతూ– ‘‘కన్నడ పరిశ్రమలో ఉపేంద్రగారు అన్ని ముఖ్యమైన విభాగాలు ఆయనే చేసుకుంటారు. అలా తెలుగులో సరోజ్ కుమార్ ఉన్నారు’’ అన్నారు. ‘‘నేను 2004లో జూనియర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి వచ్చాను. పలు చిత్రాలు చేశా. ‘పరాక్రమం’ అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా ఉంటుంది’’ అన్నారు బండి సరోజ్ కుమార్. -
గల్లీ క్రికెట్ నేపథ్యంలో ‘పరాక్రమం’
గల్లీ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న తెలుగు చిత్రం ‘పరాక్రమం’. 'మాంగల్యం' మూవీ ఫేమ్ బండి సరోజ్ హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గతంలో మూడు సినిమాలు డిజిటల్ లో ‘వాచ్ అండ్ పే’ (డబ్బు కట్టి సినిమా చూసే పద్ధతి) ద్వారా విడుదల చేసి, విజయం సాధించాడు బండి. ఇప్పుడు ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు సంగీతం, ఎడిటింగ్‌తో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. తన సొంత బ్యానర్ బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ (BSK Mainstream) ద్వారా ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ చిత్రం లో శాస్త్రీయ నృత్య కళాకారిణి శృతి సమన్వి మరియు నాగ లక్ష్మి హీరోయిన్లుగా నటించారు. మరో 50 మంది నూతన నటి నటులు పరిచయం కాబోతున్నారు. వీళ్లలో చాలామంది థియేటర్ ఆర్టిస్ట్ లు పౌర్ణమి, 100% లవ్ లాంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ గా పనిచేసిన వెంకట్ ఆర్ ప్రసాద్ పరాక్రమం చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.


