breaking news
balance checking app
-
ఆగస్టు 1 నుంచి యూపీఐ యూజర్లకు కొత్త రూల్స్
ఆగష్టు 1వ తేదీ నుంచి యూపీఐ(Unified Payment Interface) యూజర్లకు కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ క్రమంలో.. పదే పదే బ్యాలెన్స్ చెక్ చేసుకునేవారిని చెక్ పెట్టే నిబంధనలు ప్రధానంగా తీసుకొచ్చింది.యూపీఐ పేమెంట్స్ చేసేవారు.. ఇక నుంచి రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్కు NPCI వీలు కల్పించనుంది. అలాగే.. ఫోన్ నెంబర్ లింకైన బ్యాంక్ ఖాతాలను రోజుకు 25సార్లు మాత్రమే చూసేలా నిబంధన తీసుకురానుంది. పదే పదే బ్యాలెన్స్ చెక్‌తో ఏర్పడే ట్రాఫిక్‌కు చెక్ పెట్టేందుకే ఈ రూల్స్ తెచ్చినట్లు తెలిపింది.ఇక.. ఆటోపే ట్రాన్జాక్షన్ విషయంలోనూ ఓ చిన్న మార్పు చేసింది. UPI AutoPay లావాదేవీలకు నిర్దిష్ట సమయ పరిమితులు (ఫిక్స్డ్ టైం స్లాట్) ఆప్షన్ తీసుకొచ్చింది. అంటే.. సబ్స్క్రిప్షన్లు, విద్యుత్/నీటి బిల్లులు, ఈఎంఐలాంటి షెడ్యూల్ చేయబడిన చెల్లింపులు ఇకపై ఫలానా రోజులో మొత్తం ఎప్పుడైనా జరగకుండా.. ముందుగా నిర్ణయించిన టైం స్లాట్ ప్రకారం ప్రాసెస్ అవుతాయి.అయితే ట్రాన్జాక్షన్(లావాదేవీల) లిమిట్ విషయంలో యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. -
ట్రూ బ్యాలెన్స్ యాప్‌లో సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్స్
సాఫ్ట్ నిధులతో వేగంగా విస్తరిస్తాం: ట్రూ బ్యాలెన్స్ న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన మొబైల్ బ్యాలెన్స్ చెకింగ్ యాప్, ట్రూ బ్యాలెన్స్‌లో సాఫ్ట్‌బ్యాంక్ అనుబంధ సంస్థ, సాఫ్ట్‌బ్యాంక్ వెంచర్స్ కొరియా పెట్టుబడులు పెట్టింది. ప్రి పెయిడ్ మొబైల్ అకౌంట్లలో లభ్యమయ్యే బ్యాలెన్స్‌ను, కాల్ లాగ్‌ను, డేటా ప్యాక్ అసెస్మెంట్ను, రీచార్జ్ సర్వీసులను ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ట్రూ బ్యాలెన్స్ యాప్ తెలియజేస్తుంది. సాఫ్ట్‌బ్యాంక్ వెంచర్స్ కొరియా ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేసింది వెల్లడి కాలేదు. కోటి డౌన్లోడ్లు లక్ష్యం.. 2014లో చార్లీ లీ ఈ యాప్‌ను ప్రారంభించారు. ఈ సాఫ్ట్‌బ్యాంక్ నిధులతో విస్తరణను మరింత వేగవంతం చేస్తామని, తమ సేవలను మరింతగా మెరుగుపరుస్తామని లీ తెలిపారు. భారత్‌లో 20 కోట్ల స్మార్ట్‌ఫోన్ యూజర్లకు చేరువ కావాలన్న తమ ప్రయాణం ఇప్పడే ప్రారంభమైందని, సాఫ్ట్‌బ్యాంక్ వెంచర్స్ కొరియా పెట్టుబడులతో ఈ ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే 20 లక్షల మంది తమ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని, మరో 9 నెలల్లో కోటి డౌన్లోడ్ల మైలురాయిని చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. -
బ్యాంక్ బ్యాలెన్స్ యాప్‌తో జర భద్రం!
''మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి'' అనే యాప్ ప్రకటన చూసి డౌన్ లోడ్ చేసుకున్నారో.. అంతే సంగతులు! మీ అకౌంట్లోని డబ్బంతా మాయమవ్వకపోతే ఒట్టు! ఎందుకంటే అది పక్కా మోసపూరిత యాప్. ప్రస్తుతం వాట్సప్‌లో చక్కర్లు కొడుతున్న ఈ యాప్‌పై రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. బ్యాంక్ బ్యాలెన్స్ తెలసుకునేందుకు ప్రత్యేకంగా తాము ఎలాంటి యాప్‌ను రూపొందించలేదని, కొందరు హ్యాకర్లు ఆర్బీఐ లోగోను అక్రమంగా వినియోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వాటికి స్పందించొద్దని బ్యాంకు ఖాతాదారుల్ని కోరింది.