breaking news
AWFIS
-
రాజపుష్ప సమ్మిట్‌లో కో–వర్కింగ్ స్పేస్
సాక్షి, హైదరాబాద్: కో–వర్కింగ్ స్పేస్ కంపెనీ అవ్ఫిస్ ప్రీమియం వర్క్‌స్పేస్ సేవలను ప్రారంభించింది. అవ్ఫిస్ గోల్డ్ పేరిట దేశవ్యాప్తంగా పెద్ద కంపెనీలకు గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్‌లను అందిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే నాలుగు నెలల్లో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నగరాలలో 8 గోల్డ్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇవి 2 లక్షలకు పైగా చ.అ. విస్తీర్ణంలో 5 వేలకు పైగా సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని రాజపుష్ప సమ్మిట్, బెం గళూరులోని శాంతినికేతన్–1 రెండు సెంటర్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుతం అవ్ఫిస్‌కు 12 నగరాలలో 90 సెంటర్లు, 51 వేల సీట్లున్నాయి. -
హైదరాబాద్‌లో ఏడబ్ల్యూఎఫ్ఐఎస్ సేవలు ప్రారంభం
⇒ గంటల వారీగా ఆఫీస్ స్థలాన్ని అద్దెకు... ⇒ 2018 మార్చి నాటికి 20 వేల సీట్ల లక్ష్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గంటలు, రోజుల వారీగా ఆఫీసు స్థలాన్ని అద్దెకిచ్చే (కో–వర్కింగ్ స్పేస్) విభాగంలో ఉన్న ఏడబ్ల్యూఎఫ్ఐఎస్ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. తాజ్ డెక్కన్ భాగస్వామ్యంతో 200 సీటింగ్ సామర్థ్యం గల ఈ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించింది. ఇందులో ప్రీమియం క్యాబిన్స్, ఫిక్స్డ్ డెస్క్‌లు, మీటింగ్ రూమ్‌లు, లాంజ్‌లను ఏర్పాటు చేసింది. ధరల శ్రేణి ఫ్లెక్సీ వర్క్ స్టేషన్లకు రోజుకు రూ.350, ఫిక్స్డ్ సీట్లు రూ.750, క్యాబిన్స్ నెలకు రూ.13 వేలు, మీటింగ్ గదులు గంటకు రూ.600లుగా ఉంటాయని ఏడబ్ల్యూఎఫ్ఐఎస్ ఫౌండర్ అండ్ సీఈఓ అమిత్ రమణి గురువారమిక్కడ విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం ఏడబ్ల్యూఎఫ్ఐఎస్ దేశంలోని 18 నగరాల్లో 5 వేల సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉందని.. 2018 మార్చి నాటికి 20 వేల సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్‌లో వచ్చే 6 నెలల్లో గచ్చిబౌలి, బేగంపేట్ల్లో 1,500 సీట్లు రానున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడబ్ల్యూఎఫ్ఐఎస్ మార్కెటింగ్ హెడ్ సుమిత్ లఖానీ పాల్గొన్నారు.