breaking news
Atmakur Assembly Bypoll
-
ఏపీ పాలిటిక్స్‌లో ‘మూడు ముక్కలాట’
రాజకీయ సిద్ధాంతాలు వేరైనా రహస్య ఎజెండా ఒకటిగా పెట్టుకొని విపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయి. బీజేపీ ఛీ కొడుతున్నా.. టీడీపీ అంతర్గతంగా సహకరిస్తూ లోపాయికారి రాజకీయం చేస్తోంది. బద్వేల్, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఈ తెర చాటు రాజకీయం తెరపైకి వచ్చింది. పదవిలో ఉండి కాలం చేసిన ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు పోటీచేస్తే టీడీపీ పోటీ చేయదని అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటిస్తారు. ఎన్నికల్లో ఆ పార్టీ శ్రేణులు పోటీ చేసిన బీజేపీకి చురుగ్గా సహకరిస్తాయి. కుట్ర రాజకీయాలు చేయడంలో టీడీపీకి వెన్నతో పెట్టిన విద్యగా పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మూడు ముక్కలాట తెరపై కనిపిచింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం తొలుత కాంగ్రెస్‌కు, ఆ తర్వాత వైఎస్సార్సీసీకి కంచుకోటగా నిలుస్తోంది. ప్రజామద్దతు చూరగొని రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచి మంత్రి అయిన మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. పార్టీ సిద్ధాంతం ప్రకారం ఉప ఎన్నికల్లో ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు పోటీచేస్తే టీడీపీ పోటీ చేయదంటూ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. బద్వేల్లో దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధా పోటీ చేసింది. ఆత్మకూరులో మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి పోటీ చేశారు. రెండు చోట్ల టీడీపీ అభ్యర్థిని బరిలో దింపలేదు. అయితే బీజేపీకి పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ కార్యకర్తలు, నేతలు పని చేయడం చూస్తే రెండు పారీ్టల రహస్య ఎజెండా అర్థమవుతోంది. బీజేపీకి.. జనసేన, టీడీపీ ప్రత్యక్ష సహకారం 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన మద్దతుతో అధికారంలోకి వచ్చిన టీడీపీ అరాచక పాలన సాగించింది. దీంతో 2019 ఎన్నికల్లో టీడీపీని బీజేపీ ఛీత్కరించింది. ఈ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు ప్రజా మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమయ్యాయి. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షోభాలు ఎదురైనా.. చిత్తశుద్ధితో పేదలకు సంక్షేమ పాలన అందిస్తుండడంతో వైఎస్సార్సీపీ అపార ప్రజామద్దతు పెంచుకుంది. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్సీపీని నిలువరించడం కష్ట సాధ్యమని తెలుసుకున్న విపక్షాలు అంతర్గతంగా చేతులు కలుపుతున్నాయి. టీడీపీ బహిర్గతంగా బీజేపీ ఛీ కొట్టింది. అయినా అంతర్గతంగా బీజేపీకి లోపాయకారి మద్దతు ఇస్తూ టీడీపీ రహస్య ఎజెండాను అమలు చేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఉప ఎన్నికల పోలింగ్‌లో తెర వెనుక రాజకీయాలకు తెర తీసిన టీడీపీ.. ఆఖరి క్షణంలో తెరపైకి ప్రత్యక్షమైయ్యారు. పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ వర్గీయులు అవతరించారు. జనసేన నేతలు సైతం అదే ధోరణి ప్రదర్శించారు. బీజేపీకి అండగా ప్రచార పర్వం నుంచి పోలింగ్ దాకా సహకారమందించారు. 2019 సాధారణ ఎన్నికల్లో 2,314 ఓట్లతో 1.33 శాతానికి పరిమితమైన బీజేపీ, 2022 ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీల సహకారంతో 19,353 ఓట్లతో 14.1 శాతం ఓటు షేర్ దక్కిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. బీజేపీకి రెండు పార్టీల నేతలు సహకరించినా ఓటింగ్ శాతం ఈ స్థాయికి పరిమితం కావడంతో చూస్తే.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేసినా.. ఒంటరిగా పోటీ చేసినా.. ఆ పారీ్టలకు డిపాజిట్లు కూడా దక్కే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేసిస్తున్నారు. మేకపాటి మంచితనానికి ఆత్మకూరు ప్రజల జేజేలు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 74.47 శాతం ఓట్లు దక్కాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలన, అర్హులందరికీ చిత్తశుద్ధితో ప్రభుత్వ పథకాలు అందిస్తున్న తీరు, మేకపాటి గౌతమ్‌రెడ్డి మంచి తనం ఉప ఎన్నికల్లో ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని పరిశీలకులు చెబుతున్నారు. 2014లో అత్యధిక మెజార్టీ రికార్డు మేకపాటి గౌతమ్‌రెడ్డికి దక్కగా, ఆ జాబితాలో తొలి స్థానాన్ని మేకపాటి విక్రమ్‌రెడ్డి తిరగరాశారు. 82,888 ఓట్లు మెజార్టీ సాధించి భారీ రికార్డును మేకపాటి విక్రమ్‌రెడ్డి వశ పర్చుకుని, తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సోదరడు దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించనున్నారు. ఇది కూడా చదవండి: వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యం -
ఆత్మకూరులో టీడీపీ వక్ర బుద్ధి బయటపడ్డ ఫోటోలు, వీడియోలు
-
AP: ఆత్మకూరు ఉపఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి
సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం ఉపఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి అయ్యింది. ఈ మేరకు వివరాలను వెల్లడించారు రిటర్నింగ్ అధికారి హరేంద్ర ప్రసాద్. ఇవాళ(మంగళవారం) 28 నామినేషన్లకు స్క్రూట్ని ప్రక్రియ జరిగిందని, వివిధ కారణాల వల్ల 13 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని తెలిపారాయన. ఇదిలా ఉంటే.. ఆత్మకూరు ఉపఎన్నికలో ప్రస్తుతానికి పదిహేను మంది ప్రస్తుతం బరిలో ఉన్నారు. ఈ నెల 9వ తేదీ మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. చదవండి: రాజకీయాల్లో మచ్చలేని కుటుంబం అది! -
ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో మేకపాటి విక్రమ్ రెడ్డి
-
ఆత్మకూరు ఉప ఎన్నికకు పక్కాగా ఏర్పాట్లు
నెల్లూరు(అర్బన్): ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు తెలిపారు. నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తిక్కన ప్రాంగణంలో జేసీ హరేంద్ర ప్రసాద్‌తో కలిసి గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే నెల 28వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు. బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీ ప్యాట్స్ సిద్ధం చేశామన్నారు. ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జేసీ హరేంద్ర ప్రసాద్ వ్యవహరిస్తారన్నారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు ఓటర్లలో 80 ఏళ్లు పైబడిన వారు 4,981 మంది, విభిన్న ప్రతిభావంతులు 4,777 మంది ఉన్నారని కలెక్టర్ తెలిపారు. వారు సజావుగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్లు, సహాయకులను ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1,000 ఓట్లుపైబడి ఉంటే అదనపు పోలింగ్ కేంద్రాన్ని పెడతామన్నారు. ఓటర్ల జాబితాను అభ్యర్థులకు, పోలింగ్ ఏజెంట్లకు ఇస్తామన్నారు. 648 బ్యాలెట్ యూనిట్స్‌ను, 593 కంట్రోల్ యూనిట్స్‌ను, 583 వీవీ ప్యాట్స్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఓటరు స్లిప్పులను ఓటర్లకు అందించి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారులు ఎవరూ పాల్గొనరాదని సూచించారు. ప్రవర్తనా నియమావళి (కోడ్) సక్రమంగా అమలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా కోవిడ్ నోడల్ అధికారిగా డీఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్యను నియమించామన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ హిమావతి, డీఆర్వో వెంకట నారాయణమ్మ, కలెక్టరేట్ పరిపాలనాధికారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ∙ఉప ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ గురువారం అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ చక్రధర్‌బాబు ఎన్నికల నిర్వహణ గురించి చేపట్టిన చర్యలను వివరించారు. ఈవీఎం యంత్రాల గోదామును తనిఖీ చేశామన్నారు. జేసీ హరేంద్ర ప్రసాద్, ఏఎస్పీ హిమవతి పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో.. నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆత్మకూరు ఉప ఎన్నిక పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా జిల్లా పోలీసు కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికల నియమావళిని అందరూ పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.