ఆత్మలతో మాట్లాడాలని కుటుంబం మొత్తాన్ని..
తిరువనంతపురం: కేరళలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పిచ్చి ఆలోచనతో మొత్తం కుటుంబాన్ని హత్య చేశాడు. క్షుద్రపూజలు చేసి ఆత్మలతో మాట్లాడే శక్తి పొందాలనే దుష్ట ఆలోచనతో వారిని చంపేశాడు. ఈ విషయాన్ని అతడు స్వయంగా పోలీసులకు తెలిపాడు. కేరళలోని కాడెల్ జీన్సన్ రాజా అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి తిరువనంతపురం సమీపంలోని ఓ గ్రామంలో ఉంటుండేవాడు. అతడి కి ఆత్మలతో మాట్లాడాలనే కోరిక ఎక్కువగా ఉండేది.
అందుకోసం ప్రత్యేక క్షుద్ర పూజలు నిర్వహించేందుకు కుటుంబాన్ని హత్య చేయాలని అనుకున్నాడు. ఇటీవల ఆన్లైన్లో గొడ్డలి కొనుగోలు చేసిన అతడు ఏప్రిల్ 5న తొలుత తన తల్లిని, తండ్రిని ఓ సోదరిని హత్య చేశాడు. అనంతరం ఏప్రిల్ 7 రాత్రి తన అత్తయ్యను మరోగదిలో హత్య చేశాడు. ఏప్రిల్ 8న వారి మృతదేహాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు సోమవారం అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అతడు ఈ వివరాలు తెలియజేశాడు.