breaking news
Airtel telangana
-
ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్
తెలుగు రాష్టాల ఎయిర్టెల్ యూజర్లకు శుభవార్త తెలిపింది ఎయిర్టెల్. టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్ రూ.199ను తాజాగా సవరించింది. ఈ కొత్త ప్లాన్‌లో భాగంగా యూజర్లు మరింత డేటాను పొందవచ్చు అని పేర్కొంది. కొత్త రూ.199 ప్లాన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో టెలికాం సర్కిల్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. త్వరలో మిగతా యూజర్లకు తీసుకు రానున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు వినియోగదారులు రూ.199 ప్లాన్ కింద రోజూ 1జీబీ డేటాను పొందగా, ఇప్పుడు వారికి రోజూ 1.5జీబీ డేటా లభిస్తుంది. రిలయన్స్ జియో కూడా రూ.199 ప్లాన్ కింద 1.5 జీబీ డేటా అందిస్తుంది.(చదవండి: కొత్త ఏడాదిలో వాట్సాప్ నుంచి బిగ్ అప్డేట్) ఎయిర్టెల్ యూజర్లు 1.5జీబీ రోజువారీ డేటా కోటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత కాలింగ్ సేవలను అందించనుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజుల వరకు ఉటుంది. రీఛార్జ్‌తో పాటు ఎయిర్టెల్ యూజర్లు వింక్ మ్యూజిక్, హెలోట్యూన్‌లను యాక్సెస్ చేయగలరు. అలాగే, యూజర్లు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ ఉచిత సేవలను కూడా పొందవచ్చు. ఎయిర్టెల్ ఇప్పటికే ప్రీపెయిడ్ ప్లాన్ ప్రతిరోజూ అందిస్తుంది. రూ.249 కింద రోజుకు 1.5 జిబి డేటాను, 100 ఎస్ఎంఎస్, 28 రోజుల కాలానికి అపరిమిత కాలింగ్ సేవలను కూడా అందిస్తుంది. రెండు ప్లాన్లు ఒకే విదంగా ఉన్న కారణంగా దీనిని దృష్టిలో ఉంచుకుని ఎయిర్టెల్ త్వరలో రూ.249 ప్లాన్‌లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది. జియో రూ.249 ప్లాన్ కింద 2జీబీ డేటాను అందిస్తుంది. -
ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో 4జీ సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ ఎయిర్టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 4జీ సర్వీసులను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఫిబ్రవరిలోగా సర్వీసులను మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కంపెనీ బెంగళూరు, కోల్‌కతా, పుణే, చండీగఢ్, అమృత్సర్, నాగ్‌పూర్, నాసిక్ తదితర 16 నగరాల్లో 4జీని అందిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 4జీని పరిచయం చేయడం ఖాయమని ఎయిర్టెల్ ఉన్నతాధికారి సాక్షి బిజినెస్ బ్యూరోకు చెప్పారు. సర్కిల్లో తొలుత హైదరాబాద్‌లో ప్రారంభిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్, విజయవాడ నగరాలకు కూడా ఈ సర్వీసులు విస్తరించే అవకాశాలున్నాయి. 3జీ ధరకే 4జీ సేవలు అందిస్తున్నట్టు కంపెనీ చెబుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఎయిర్‌టెల్‌కు 2.08 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. మరోవైపు షియోమి రెడ్మి నోట్ 4జీ మొబైల్‌ను రూ.9,999 ధరకు ఆఫర్ చేస్తున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది. హైదరాబాద్‌తో సహా మొత్తం ఆరు నగరాల్లోని ఎయిర్టెల్ స్టోర్స్‌లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. లాభాల్లోనే 5 విమానాశ్రయాలు హైదరాబాద్: ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ.. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన నడుస్తున్న హైదరాబాద్ సహా అయిదు ఎయిర్‌పోర్టులు లాభాల్లోనే కొనసాగనున్నాయి. 2012-13లో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య తగ్గినా.. ఆ తర్వాత 2013-14లోనూ, 2014-15 తొలినాళ్లలోనూ దేశీ, విదేశీ రూట్లలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదే ధోరణి వచ్చే ఆర్థికసంవత్సరం ప్రథమార్ధంలోనూ కొనసాగనుంది. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రే) ఒక నివేదికలో ఈ విషయాలు పేర్కొంది. ప్రయాణికుల సంఖ్య పెరిగిన ఫలితంగా.. ఇతరత్రా నాన్-ఏరోనాటికల్ ఆదాయాలూ గణనీయంగా పెరుగుతున్నట్లు వివరించింది.