breaking news
Advanced Education
-
టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్) : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న నూతన పోకడలను అందిపుచ్చుకుని అధ్యాపకులు అత్యాధునిక విద్యాబోధన చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలం గాణ యూనివర్శిటీ పరీక్షల ముఖ్య నియంత్రణ అధికారి ప్రొఫెసర్ యాదగిరి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని దుబ్బలోగల గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యలో సమాచార సాంకేతిక పరి జ్ఞానం ఆధారిత బోధనా పద్ధతులపై ఒకరోజు సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యాబోధనలో వినూత్నమైన పద్ధతులు అందుబాటులో ఉన్నా య ని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను బోధిస్తే ఆశించిన ఫలితాలు సాధిస్తారని తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. విద్యార్థులకు సన్మానం గత నెలలో ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పరేడ్‌లో పాల్గొన్న గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు హన్మండ్లు, నరేష్, శిరీషను ప్రొఫెసర్ యాదగిరి ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపల్ రామ్మోహన్‌రెడ్డి, టీయూ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ జి ప్రవీణాబాయి, డీఆర్సీ కో ఆర్డినేటర్ రాకేష్‌చంద్ర, కోశాధికారి వినయ్‌కుమార్, కళాశాల అధ్యాపకులు, జిల్లాలోని డిగ్రీ కళాశాల అధ్యాపకులు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ పాల్గొన్నారు. -
నవోదయ.. ఆరోతరగతిలో ప్రవేశానికి..
విధి విధానాలు.. ఈ పథకం ఉద్దేశాలు.. గ్రామీణ ప్రాంత ప్రతిభావంతులైన విద్యార్థులకు అధిక ప్రాధాన్యతని స్తారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన అధునాతన విద్యను అందించడం ముఖ్యఉద్దేశం. సాంస్కృతి సంప్రదాయాలు, విలువలు పెంపొందించడం, పర్యావరణంపై సదావగాహన, సాహసోపేత కృత్యాలతోపాటు, క్రీడలు, వ్యాయామ విద్యలో శిక్షణ ఇస్తారు. ఎవరు అర్హులు? నవోదయ విద్యాలయంలో ప్రవేశం కోరే అభ్యర్థులు 1-5-2002 ముందు గానీ 31-4-2006తర్వాత గానీ జన్మించి ఉండరాదు. ఈ నిబంధన ఎస్సీ, ఎస్టీ వారితోపాటు అన్ని వర్గాల వారికి వర్తిస్తుంది.ప్రస్తుతం ఐదోతరగతి చదువుతున్న వారై ఉండాలి.అభ్యర్థి 30-9-2014లోగా ఐదోతరగతిలో ప్రవేశం పొందకపోతే అతడు/ఆమె నవోదయ విద్యాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి అర్హతను కోల్పోతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక అభ్యర్థి ప్రవేశ పరీక్షకు రెండోసారి హాజరయ్యేందుకు వీలులేదు. పరీక్ష రాసే భాష.. అభ్యర్థి ఐదోతరగతి ఏ మాధ్యమంలో చదువుతున్నాడో ప? కూడా అదే భాషలోనే రాయాల్సి ఉంటుంది. పరీక్షలోని విభాగాలు పరీక్ష మూడు భాగాలుగా ఉంటుంది. 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. సమయం 2 గంటలు. మేథాశక్తి పరీక్ష: ప్రశ్నలు 50, మార్కులు 50, సమయం ఒక గంట. గణిత పరీక్ష: ప్రశ్నలు 25, మార్కులు 25, సమయం అరగంట. భాషా పరీక్ష: ప్రశ్నలు 25, మార్కులు 25, సమయం అరగంట. దరఖాస్తులు: బ్లాక్ విద్యాశాఖాధికారి, మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారి నుంచి పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని ఈనెల 31లోగా మండల విద్యాధికారికి అందజేయాలి. రిజర్వేషన్ల వివరాలు.. ► జిల్లాలోని పాఠశాలలో గల 80 సీట్లలో కనీసం 75 శాతం గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు, మిగిలిన సీట్లను పట్టణ ప్రాంత అభ్యర్థులకు కేటాయించారు. ► గ్రామీణ ప్రాంతాల నుంచి సీట్లు కోరే వారు ఆ ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 3, 4, 5వతరగతి విద్యా సంవత్సరాలు పూర్తిగా చదివి ఉండాలి. ► ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, బాలికలకు 1/3 వంతు, వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి.