breaking news
Adhita myanikal
-
అంతా తెలుగుమయం!
సాధారణంగా తెలుగు సినిమా తెర పైన, తెర వెనకా పరభాషా నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేస్తుంటారు. కళాకారులకు భాషాబేధం లేదు కాబట్టి, తెలుగు ప్రేక్షకులు అందర్నీ ఆదరిస్తారు. కానీ, ఓ సినిమాకి 24 శాఖల్లోనూ తెలుగువారే పని చేశారంటే కాస్త ఎక్కువ ఆనందిస్తారు. ఇంద్రగంటి మోహనకృష్ణ అలాంటి ఆనందాన్ని ఇవ్వ నున్నారు. అవసరాల శ్రీనివాస్, అడివి శేష్ హీరోగా ఆయన దర్శకత్వంలో కేసీ నరసింహారావు నిర్మిస్తున్న సినిమాకి 24 శాఖల్లోనూ తెలుగువారిని ఎంపిక చేశారు. సినిమా అంతా తెలుగుమయం. ‘వెన్నెల’ కిశోర్ ముఖ్యపాత్ర చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్లు ఈష, అదితీ మ్యానికల్ లు తెలుగమ్మా యిలే. ఈ నెల 1న ప్రారంభమైన ఈ చిత్రం షెడ్యూల్ నేటితో పూర్తవు తుంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వినయ్, సంగీతం: మణిశర్మ. -
నవ్వులే నవ్వులు
వైవిధ్యమైన కథాచిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దిట్ట. ‘క్షణం’తో సక్సెస్ ట్రాక్‌లో ఉన్నారు అడివి శేష్. ‘అష్టా చమ్మా’ ద్వారా నటుడిగా పరిచయమై, ‘ఊహలు గుసగుసలాడే’తో తనలో మంచి దర్శకుడు ఉన్నాడని కూడా నిరూపించుకున్నారు. సక్సెస్‌లో ఉన్న ఇంద్రగంటి–శేష్–అవసరాల కాంబినేషన్లో ఓ సినిమా మొదలైంది. అడివి శేష్, అవసరాల శ్రీనివాస్, ఈష, అదితీ మ్యానికల్ ముఖ్య పాత్రల్లో ‘ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ ’ పతాకంపై ఇంద్రగంటి దర్శకత్వంలో కె.సి. నరసింహారావు నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ క్లాప్ ఇచ్చారు. నటుడు తనికెళ్ళ భరణి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ‘వెన్నెల’ కిశోర్ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. నేటి నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తు్తన్నాం’’ అన్నారు. తనికెళ్ల భరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ళ భార్గవ్, తడివేలు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.జి.విందా, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్.