breaking news
Adam Bain
-
ట్విట్టర్‌కు ఏమైంది?
శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థకు మరో ముఖ్యమైన అధికారి రాజీనామా చేశారు. ఈ క్వార్టర్లో నిరాశాజనక ఫలితాలు, ఉద్యోగాల్లో కోతకు తోడు ముఖ్య అధికారుల వరుస రాజీనామాలు ట్విట్టర్‌ను వెంటాడుతున్నాయి. ట్విట్టర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) ఆడమ్ బైన్ సంస్థ నుంచి వైదొలగుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే ఆయన స్థానంలో 2014 జూలై లో ట్విట్టర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) నియమితుడైన ఆంటోనీ నోటో సీఓఓ బాధ్యతలు స్వీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది. సీఎఫ్ఓ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించే దాకా నోటో కొనసాగుతారని వివరించింది. కొన్ని వారాలపాటు బైన్ నోటోకు సహాయంగా ఉంటారని తెలిపింది. 2010 లో ట్విట్టర్ లో చేరిన ఆడమ్ అద్భుతమైన టీం తయారుచేశారని, అంతర్జాతీయంగా వ్యాపారాన్ని విస్తరించారని ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సే ఒక ప్రకటనలో తెలిపారు. కాగా నష్టాల కారణంగా గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 9శాతం మందిని తొలగిస్తున్నట్లు గత నెలలోనే ట్విట్టర్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 3,860 ఉన్న ఉద్యోగుల్లో 350 మందిని తొలిగిస్తున్నట్టు వెల్లడించింది. ఎపుడూ లాభాలను నమోదు చేయని ట్విట్టర్ 2017 సం.రంలో తొలిసారిగా లాభాలను నమోదు చేసే దిశగా పయనిస్తోందని గత ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా డోర్సే విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే విశ్లేషకులు మాత్రం సంస్థ సామర్థ్యంపై ఆందోళనలు వ్యక్తంచేశారు మరోవైపు వినియోగదారుల పెరుగుదల కోసం కృషి చేస్తున్న సమయంలో అడ్వర్టైజింగ్ బిజినెస్ బాగా పెంచిన ఆడమ్ ట్విట్టర్‌ను వీడడం కంపెనీకి పెద్ద షాకేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల ట్విట్టర్ ఇండియా హెడ్, మేనేజింగ్ డైరెక్టర్లు కూడా సంస్థ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. -
ట్విట్టర్ కు గట్టి ఎదురుదెబ్బ
శాన్ ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియా ప్రఖ్యాత సంస్థ ట్విట్టర్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు కంపెనీ నుంచి వైదొలగారు. తాజాగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) ఆడమ్ బెయిన్ కూడా ట్విట్టర్ కు టాటా చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ బిజినెస్ కు ఇంచార్జిగా ఉన్న ఆయన సంస్థ నుంచి బయటకు వెళ్లిపోనున్నారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆంటోనీ నోటో ఇక నుంచి సీఓఓగా వ్యవహరిస్తారని ట్విట్టర్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఆరేళ్లుగా ట్విట్టర్ లో పనిచేయడం నాకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. నేను కంపెనీని వదిలి పెట్టాలనుకున్న విషయం సీఈవో జాక్ డోర్సేకు ముందుగానే తెలుసు. నేను బయటకు వెళ్లి కొత్తగా ఏదైనా చేయాలనుకుంటున్నాన’ని బెయిన్ ట్వీట్ చేశారు. తన బాధ్యతలు ఆంటోనీకి బదలాయించేందుకు కొన్ని వారాలు ఆయన ట్విట్టర్ లో కొనసాగుతారు. వాణిజ్య కార్యకలాపాల ద్వారా ట్విట్టర్ ఆదాయం పెంచడంతో బెయిన్ కీలకపాత్ర పోషించారు. కాగా, వరుసగా సీనియర్ అధికారులు ట్విట్టర్ కు గుడ్ బై చెబుతుండడం కలకలం రేపుతోంది. ట్విట్టర్ ఇండియా హెడ్ రిషి జైట్లీ, ట్విట్టర్ ఇండియా (ఆగ్నేయ ఆసియా, మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా) మేనేజింగ్ డైరెక్టర్ పర్మిందర్ సింగ్ ఇటీవలే రాజీనామా చేశారు.