breaking news
Abundant rains
-
వర్షాలు బాగుండాలి వర్షాకాల సమావేశాలూ బాగుండాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవాలని, అదేమాదిరి వర్షాకాల సమావేశాలు ఫలప్రదంగా సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా సోమవారం ఆయన పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘రెండూ బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అప్పుడు అందరి జీవితాల్లో వెలుగులు నిండుతాయి. ఇదే ఆశతో ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుందాం. అదే విధంగా ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సైతం ఫలప్రదంగా సాగాలనీ కోరుకుందాం. సభలో నిర్మాణాత్మక చర్చల ద్వారా దేశ ప్రగతికి, ప్రజా సంక్షేమానికి దోహదపడాలి. రాజకీయాలకు అతీతంగా అనుభవజ్ఞులైన ఎంపీల విజ్ఞానం దేశాభివృద్ధి కోసం ఉపయోగపడాలి. బలమైన వాదనలు ఉన్నప్పుడు ప్రశాంతంగా మాట్లాడినా మన గళాన్ని సమర్థవంతంగా వినిపించవచ్చు’’అని మోదీ చెప్పారు. అంతరిక్ష రంగంలో యువత అద్భుతాలు... ‘‘దేశ పురోగతిలో యువత పాత్ర అత్యంత కీలకం. వారి సామర్థ్యాలు, ఆకాంక్షలు అంతరిక్షమంత విశాలమైనవి. గడిచిన నెల రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ, అంతరిక్ష రంగాల్లో అసాధారణ మైలురాళ్లను భారత్ అధిగమించింది. భారతీయ వ్యోమగామి గత ఏడాది వర్షాకాల సమావేశాల ముందు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈసారి వర్షాకాల సమావేశాలకు ముందు భారతీయ అంకుర సంస్థ స్కైరూట్ ప్రయోగించిన విక్రమ్–1 రాకెట్ విజయవంతంగా గగనతలంలోకి వెళ్లింది. భారతీయ యువత ఆశలు, ఆశయాలకు నింగిలాగా ఎలాంటి హద్దుల్లేవనడానికి ఈ విజయమే నిదర్శనం’’అని మోదీ కొనియాడారు. 7.7 శాతం వృద్ధిరేటు... ‘‘పశి్చమాసియాలో యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఎరువులు, రసాయనాల దిగుమతులపై తీవ్ర ప్రభావం పడినప్పటికీ భారతదేశం 7.7 శాతం వృద్ధిరేటును నమోదుచేసింది. ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవడం దేశానికున్న అపారమైన శక్తికి నిదర్శనం’’అని మోదీ అన్నారు.56 ఏళ్ల యువకుని గురించి మాట్లాడట్లేదు రాహుల్‌కు మోదీ చురక స్కైరూట్ సంస్థ విజయం గురించి మాట్లాడుతూ రాహుల్ గాందీనుద్దేశిస్తూ మోదీ పరో క్షంగా వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. యువకులు ఎంతో సాధిస్తున్నారని, రాహుల్ 56 ఏళ్లు వచ్చినా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో విఫలమయ్యారనే అర్థం ధ్వనించేలా మోదీ పరోక్షంగా చురకలంటించారు. ‘‘అంతరిక్షంలో అద్భుతం సృష్టించిన స్కైరూట్ అంకురసంస్థలోని బృంద సభ్యుల సగటు వయస్సు కేవలం 28 ఏళ్లు మాత్రమే. యువత అద్భుతాలు చేస్తోంది. నేనిక్కడ 56 ఏళ్ల యువకుడి(రాహుల్) గురించి మాట్లాడటం లేదు. 28 ఏళ్ల వయస్సున్న దేశీయ యువతే అంతరిక్షంలో భారత జెండాను ఎగరేసింది’’అని మోదీ వ్యాఖ్యానించారు. ప్రైవేట్ రంగానికి కల్పించిన సంస్కరణల వల్లే సాహసోపేతమైన విజ యాలను యువత సాధిస్తోందని మోదీ అన్నారు. -
జలాశయాలు కళకళ.. అయినా నీటి కోసం విలవిల
గజ్వేల్: సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు కళకళలాడుతున్నా.. వాటిని సరైన విధంగా వినియోగించుకోలేని దుస్థితి నెలకొనడంతో గజ్వేల్ నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు తప్పడం లేదు. పూర్వకాలం నుంచి వ్యవసాయానికి ప్రధాన ఆధారంగా ఉన్నా గొలుసు చెరువుల అభివృద్ధిపై నిర్లక్ష్యం అలుముకోవడం, వాగుల నుంచి వచ్చే వరదనీటిని చెరువులు, కుంటల వైపు మళ్లించుకోలేకపోవడం వల్ల ఈ దుస్థితి నెలకొంది. ఫలితంగా రైతులకు కష్టాలు తప్పడం లేదు. చెరువుల అనుసంధాన ప్రక్రియ కూడా అమలుకు నోచుకోవడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువుల అభివృద్ధికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని చేసిన ప్రకటన కొత్త ఆశలను రేపుతోంది. చెరువులను అభివృద్ధి చేస్తే భూగర్భజలాల గణనీయంగా పెరిగి వ్యవసాయరంగం సంక్షోభం నుంచి బయటపడే అవకాశముంది. జలాశయాలు లేని గజ్వేల్ నియోజకవర్గంలో దశాబ్దాల కిందట నిర్మించిన చెరువులు, కుంటలు ప్రధానవనరులుగా ఉన్నాయి. ఈ వనరులను పరిరక్షించే విషయంలో చెప్పుకోదగ్గ కృషి జరగకపోవడం వల్ల అవన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. మరోపక్క కొన్ని చెరువులైతే ఏళ్లతరబడి పూడికతీతకు నోచుకోలేక పల్లంగా మారి చిన్నపాటి వర్షాలకే నిండిపోయి మిగతా నీరంతా వృథాగా పోతున్నాయి. చెరువుల్లో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోవడం వల్ల భూగర్భ జలమట్టం పడిపోతుండగా బోరుబావుల ఆధారంగా సాగుతున్న ఇక్కడి వ్యవసాయం సహజంగానే సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చెరువు, కుంటల పరిరక్షణ అత్యవసరంగా మారింది. ప్రధానంగా గజ్వేల్ నియోజకవర్గంలోని గొ లుసు చెరువులను అభివృద్ధి చేసి వాటిని వాగులతో అనుసంధానం చేసినట్లయితే బీడు భూ ములకు నీరందించవచ్చు. నియోజకవర్గంలోని కుడ్లేరు వాగుతో చెరువులు నింపే అవకాశముంది. గజ్వేల్ మండలంలో కుడ్లేరు వాగులో ప్రవహించే నీటిని కొడకండ్ల వద్ద దారి మళ్లించి కొడకండ్ల చెరువు, కొండపాక మండలంలోని తిప్పారం, సింగారం, వేములగాట్ తదితర గ్రామాల్లోని చెరువుల్లో నీటిని నింపవచ్చు. వర్గల్ మండలంలో ప్రవహించే హల్దీవాగు ద్వారా చెరువులను నింపే అవకాశముంది. ఈ వాగుపై అంబర్‌పేట వద్ద నిర్మించిన ఖాన్‌చెరువు నిండిన తర్వాత వాగులోని వరద నీటిని శాఖారం వద్ద ఫీడర్ ఛానెల్ నిర్మించి శాఖారం, గుంటిపల్లి, వర్గల్ చెరువుల్లో నీటిని నింపవచ్చు. మరో ఫీడర్ ఛానెల్ ద్వారా గోవిందాపూర్, గిర్మాపూర్, మాదారం, నెంటూర్, జబ్బాపూర్, మైలారం, కొమటిబండ చెరువుల్లోకి నీటిని చేర్చవచ్చు. తూప్రాన్ మండలం పా లాట, లింగారెడ్డిపేట, రావెళ్లి, బ్రహ్మణపల్లి, తూప్రాన్ గొలుసు చెరువులను అభివృద్ధి చేసినట్లయితే ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినట్లవుతుంది. ములుగు మండలం మర్కుక్‌లో ఉ న్న పెద్ద చెరువును రంగారెడ్డి జిల్లా నారాయణపూర్ ప్రాంతం నుంచి ఉన్న పరివాహక ప్రాం తం ఫీడర్ఛానల్ను మెరుగుపరచడం ద్వారా నీళ్లతో నింపి ఈ చెరువు నుంచి పాములపర్తి, పాతూరు, ఇప్పలగూడ చెరువులకు నీళ్లను తరలించే అవకాశముంది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ప్రాంతంలో ప్రవహించే వాగు నుంచి నీళ్లను దారి మళ్లించే విధంగా ఫీడర్ఛానళ్లను నిర్మిం చడం ద్వారా ములుగు మండలం కొత్తూరు, సింగన్నగూడ, కొక్కొండ, నర్సాపూర్, తున్కిబొల్లారం, తున్కిఖాల్సా చెరువులను నింపే అవకాశముంది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువుల అభివృద్ధికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడతామని ప్రకటించిన వేళ..ఇక్కడి రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి.


