ప్రాథమిక పాఠశాలల్లో 70 మంది టీచర్ల డుమ్మా
ప్రభుత్వ పాఠశాలలంటే విద్యార్థులకే కాదు.. ఉపాధ్యాయులకూ అలుసే. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న 70 మంది ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కొట్టారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లా విద్యాశాఖ నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో ఈ విషయం వెల్లడైంది.
విద్యా శాఖాధికారులు శుక్రవారం నాడు తనిఖీలు నిర్వహించగా, 70 మంది ఉపాధ్యాయులు తమ విధులకు డుమ్మా కొట్టినట్లు తేలింది. వాళ్లందరికీ ఒక రోజు వేతనం కట్ చేస్తామని డీఈవో కేకే సింగ్ విలేకరులకు తెలిపారు. మరోసారి ఇలా విధులకు డుమ్మా కొడితే మాత్రం కఠిన చర్యలు తీసుకోక తప్పదని టీచర్లను గట్టిగా హెచ్చరించినట్లు ఆయన చెప్పారు.