breaking news
Aatadukundam Raa
-
చైతూ పాత్రే మలుపు తిప్పుతుందట..
చాలా గ్యాప్ తర్వాత అక్కినేని హీరో సుశాంత్ 'ఆటాడుకుందా రా..' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాలో నాగచైతన్య, అఖిల్.. ఇద్దరూ మెరిసి అభిమానులను ఖుష్ చేయనున్నారు. వీరిలో చైతూ పాత్ర కథకు కనెక్ట్ అయ్యి ఉంటుందని టాక్. చైతన్య పాత్రతోనే కథ ఊహించని మలుపు తిరుగుతుందట, ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారని చెబుతోంది చిత్ర యూనిట్. యాక్షన్ ఎంటర్టెయినర్గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 19 న విడుదల కానుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. సుశాంత్ సరసన సోనమ్ బజ్వా కథానాయికగా నటిస్తోంది. సినిమా విజయంపై సుశాంత్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. -
పండగ లాంటి సినిమా
‘‘కథను మలుపు తిప్పే అతిథి పాత్రలో నాగచైతన్య నటించారు. క్లైమాక్స్ సాంగ్‌లో డ్యాన్స్ చేస్తూ అఖిల్ కనిపిస్తారు. సుశాంత్‌తో వీరిద్దరూ కలసి నటించిన ఆ సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అక్కినేని అభిమానులకు పండగలాంటి సినిమా ఇది’’ అన్నారు నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు. సుశాంత్, సోనమ్ బజ్వా జంటగా శ్రీనాగ్ కార్పోరేషన్, శ్రీజి ఫిలింస్ పతాకాలపై ఎ.నాగ సుశీల, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన ‘ఆటాడుకుందాం.. రా’ ఈ 19న విడుదల కానుంది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. ఈ సందర్భంగా చింతలపూడి శ్రీనివాసరావు చెప్పిన విశేషాలు... జి.నాగేశ్వరరెడ్డితో ఓ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో రచయిత శ్రీధర్ సీపాన ఈ కథ చెప్పాడు. మొదట తనే దర్శకత్వం వహిస్తానంటే సరేనన్నాను. కానీ, నాగేశ్వరరెడ్డి కథ కంటే శ్రీధర్ సీపాన కథ బాగా నచ్చింది. దాంతో శ్రీధర్ని అడగ్గానే కథ ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ చిత్రంలో సుశాంత్ చాలా కొత్తగా, స్టైలిష్‌గా కనిపిస్తాడు. సుశాంత్ క్యారెక్టర్ గత సినిమాల కంటే డిఫరెంట్‌గా ఉంటుంది. టైమ్ మిషన్ నేపథ్యంలో వచ్చే సీన్లు థ్రిల్‌కు గురి చేస్తాయి. సుశాంత్, బ్రహ్మానందం, పృథ్వీ, పోసాని కాంబినేషన్లో సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మంచి ప్లానింగ్‌తో, క్లారిటీగా సినిమా తీశారు. ప్రతి ఫ్రేమ్ చాలా కొత్తగా ఉంటుంది. సుశాంత్ నుంచి డిఫరెంట్ యాక్టింగ్ రాబట్టుకున్నారు. కథ డిమాండ్ మేరకు ఖర్చుపెట్టాం. ఏఎన్నార్‌గారి ‘పల్లెకు పోదాం.. పారుని చూద్దాం..’ పాట అలనాటి మధుర స్మృతులను గుర్తుకు తెస్తుంది. కథకు సూటవుతుందని ‘సిసింద్రీ’లో నాగార్జునగారి పాట పల్లవి ‘ఆటాడుకుందాం.. రా’ని టైటిల్‌గా పెట్టాం. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు.